×

ఏమీ? పూర్వం గతించిన, ప్రజల గాథలు మీకు చేరలేదా? నూహ్, ఆద్ మరియు సమూద్ జాతి 14:9 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:9) ayat 9 in Telugu

14:9 Surah Ibrahim ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 9 - إبراهِيم - Page - Juz 13

﴿أَلَمۡ يَأۡتِكُمۡ نَبَؤُاْ ٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ قَوۡمِ نُوحٖ وَعَادٖ وَثَمُودَ وَٱلَّذِينَ مِنۢ بَعۡدِهِمۡ لَا يَعۡلَمُهُمۡ إِلَّا ٱللَّهُۚ جَآءَتۡهُمۡ رُسُلُهُم بِٱلۡبَيِّنَٰتِ فَرَدُّوٓاْ أَيۡدِيَهُمۡ فِيٓ أَفۡوَٰهِهِمۡ وَقَالُوٓاْ إِنَّا كَفَرۡنَا بِمَآ أُرۡسِلۡتُم بِهِۦ وَإِنَّا لَفِي شَكّٖ مِّمَّا تَدۡعُونَنَآ إِلَيۡهِ مُرِيبٖ ﴾
[إبراهِيم: 9]

ఏమీ? పూర్వం గతించిన, ప్రజల గాథలు మీకు చేరలేదా? నూహ్, ఆద్ మరియు సమూద్ జాతి వారి మరియు వారి తరువాత వచ్చిన వారి (గాథలు)? వారిని గురించి అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఎరుగరు! వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చినపుడు, వారు తమ నోళ్ళలో తమ చేతులు పెట్టుకొని ఇలా అన్నారు: "నిశ్చయంగా మేము మీతో పంపబడిన సందేశాన్ని తిరస్కరిస్తున్నాము. మరియు నిశ్చయంగా, మీరు దేని వైపునకైతే మమ్మల్ని ఆహ్వానిస్తున్నారో, దానిని గురించి మేము ఆందోళన కలిగించేటంత సందేహంలో పడి వున్నాము

❮ Previous Next ❯

ترجمة: ألم يأتكم نبأ الذين من قبلكم قوم نوح وعاد وثمود والذين من, باللغة التيلجو

﴿ألم يأتكم نبأ الذين من قبلكم قوم نوح وعاد وثمود والذين من﴾ [إبراهِيم: 9]

Abdul Raheem Mohammad Moulana
emi? Purvam gatincina, prajala gathalu miku ceraleda? Nuh, ad mariyu samud jati vari mariyu vari taruvata vaccina vari (gathalu)? Varini gurinci allah tappa marevvaru erugaru! Vari pravaktalu vari vaddaku spastamaina sucanalu tisukoni vaccinapudu, varu tama nollalo tama cetulu pettukoni ila annaru: "Niscayanga memu mito pampabadina sandesanni tiraskaristunnamu. Mariyu niscayanga, miru deni vaipunakaite mam'malni ahvanistunnaro, danini gurinci memu andolana kaligincetanta sandehanlo padi vunnamu
Abdul Raheem Mohammad Moulana
ēmī? Pūrvaṁ gatin̄cina, prajala gāthalu mīku cēralēdā? Nūh, ād mariyu samūd jāti vāri mariyu vāri taruvāta vaccina vāri (gāthalu)? Vārini gurin̄ci allāh tappa marevvarū erugaru! Vāri pravaktalu vāri vaddaku spaṣṭamaina sūcanalu tīsukoni vaccinapuḍu, vāru tama nōḷḷalō tama cētulu peṭṭukoni ilā annāru: "Niścayaṅgā mēmu mītō pampabaḍina sandēśānni tiraskaristunnāmu. Mariyu niścayaṅgā, mīru dēni vaipunakaitē mam'malni āhvānistunnārō, dānini gurin̄ci mēmu āndōḷana kaligin̄cēṭanta sandēhanlō paḍi vunnāmu
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, మీకు పూర్వం గతించిన వారి సమాచారాలు మీకు చేరలేదా? నూహ్‌ జాతి, ఆద్‌, సమూదు జాతి, ఇంకా వాటి తరువాత వచ్చిన వారి సంగతులు, వారి గురించి అల్లాహ్‌కు తప్ప ఇంకెవరికీ తెలియదు. వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలు తీసుకుని వచ్చారు. కాని వాళ్ళు తమ చేతులను తమ నోటిలో పెట్టుకున్నారు. “మీకు ఏ విషయం ఇచ్చి పంపటం జరిగిందో దాన్ని మేము తిరస్కరిస్తున్నాము. ఏ విషయం వైపుకు మీరు మమ్మల్ని పిలుస్తున్నారో దానిపై మాకు తీవ్రమైన సందేహం ఉంది” అని అన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek