×

పూర్వం, మానవులంతా ఒకే ఒక సమాజంగా ఉండేవారు. అప్పుడు అల్లాహ్ వారికి శుభవార్తలు ఇవ్వటానికి మరియు 2:213 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:213) ayat 213 in Telugu

2:213 Surah Al-Baqarah ayat 213 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 213 - البَقَرَة - Page - Juz 2

﴿كَانَ ٱلنَّاسُ أُمَّةٗ وَٰحِدَةٗ فَبَعَثَ ٱللَّهُ ٱلنَّبِيِّـۧنَ مُبَشِّرِينَ وَمُنذِرِينَ وَأَنزَلَ مَعَهُمُ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ لِيَحۡكُمَ بَيۡنَ ٱلنَّاسِ فِيمَا ٱخۡتَلَفُواْ فِيهِۚ وَمَا ٱخۡتَلَفَ فِيهِ إِلَّا ٱلَّذِينَ أُوتُوهُ مِنۢ بَعۡدِ مَا جَآءَتۡهُمُ ٱلۡبَيِّنَٰتُ بَغۡيَۢا بَيۡنَهُمۡۖ فَهَدَى ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُواْ لِمَا ٱخۡتَلَفُواْ فِيهِ مِنَ ٱلۡحَقِّ بِإِذۡنِهِۦۗ وَٱللَّهُ يَهۡدِي مَن يَشَآءُ إِلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٍ ﴾
[البَقَرَة: 213]

పూర్వం, మానవులంతా ఒకే ఒక సమాజంగా ఉండేవారు. అప్పుడు అల్లాహ్ వారికి శుభవార్తలు ఇవ్వటానికి మరియు హెచ్చరికలు చేయటానికి ప్రవక్తలను పంపాడు. మరియు మానవులలో ఏర్పడిన భేదాలను పరిష్కరించటానికి, ఆయన గ్రంథాన్ని సత్యంతో వారి ద్వారా అవతరింపజేశాడు మరియు అది (దివ్యగ్రంథం) ఇవ్వబడిన వారు, స్పష్టమైన హితోపదేశాలు పొందిన తరువాత కూడా, పరస్పర ద్వేషాల వల్ల భేదాభిప్రాయాలు పుట్టించుకున్నారు. కాని అల్లాహ్ తన ఆజ్ఞతో, విశ్వాసులకు వారు వివాదాలాడుతున్న విషయంలో సత్యమార్గాన్ని చూపాడు. మరియు అల్లాహ్ తాను కోరిన వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు

❮ Previous Next ❯

ترجمة: كان الناس أمة واحدة فبعث الله النبيين مبشرين ومنذرين وأنـزل معهم الكتاب, باللغة التيلجو

﴿كان الناس أمة واحدة فبعث الله النبيين مبشرين ومنذرين وأنـزل معهم الكتاب﴾ [البَقَرَة: 213]

Abdul Raheem Mohammad Moulana
Purvam, manavulanta oke oka samajanga undevaru. Appudu allah variki subhavartalu ivvataniki mariyu heccarikalu ceyataniki pravaktalanu pampadu. Mariyu manavulalo erpadina bhedalanu pariskarincataniki, ayana granthanni satyanto vari dvara avatarimpajesadu mariyu adi (divyagrantham) ivvabadina varu, spastamaina hitopadesalu pondina taruvata kuda, paraspara dvesala valla bhedabhiprayalu puttincukunnaru. Kani allah tana ajnato, visvasulaku varu vivadaladutunna visayanlo satyamarganni cupadu. Mariyu allah tanu korina variki rjumargam vaipunaku margadarsakatvam cestadu
Abdul Raheem Mohammad Moulana
Pūrvaṁ, mānavulantā okē oka samājaṅgā uṇḍēvāru. Appuḍu allāh vāriki śubhavārtalu ivvaṭāniki mariyu heccarikalu cēyaṭāniki pravaktalanu pampāḍu. Mariyu mānavulalō ērpaḍina bhēdālanu pariṣkarin̄caṭāniki, āyana granthānni satyantō vāri dvārā avatarimpajēśāḍu mariyu adi (divyagranthaṁ) ivvabaḍina vāru, spaṣṭamaina hitōpadēśālu pondina taruvāta kūḍā, paraspara dvēṣāla valla bhēdābhiprāyālu puṭṭin̄cukunnāru. Kāni allāh tana ājñatō, viśvāsulaku vāru vivādālāḍutunna viṣayanlō satyamārgānni cūpāḍu. Mariyu allāh tānu kōrina vāriki r̥jumārgaṁ vaipunaku mārgadarśakatvaṁ cēstāḍu
Muhammad Aziz Ur Rehman
మానవులంతా ఒకే సమాజంగా ఉండేవారు. అల్లాహ్‌ ప్రవక్తలను శుభవార్తనిచ్చే వారుగా, భయపెట్టే వారుగా చేసి పంపాడు. ప్రజల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలపై తీర్పు చేయటానికిగాను వారివెంట (అనగా ప్రవక్తల వెంట) సత్య బద్ధమైన గ్రంథాలను పంపాడు. మరి వాళ్ళే (అనగా ప్రజలే) – స్పష్టమైన ఆదేశాలు వొసగబడిన తరువాత కూడా – పరస్పర వైర భావం, అసూయ మూలంగా అందులో విభేదించుకున్నారు. అందుచేత అల్లాహ్‌ విశ్వాసులకు ఈ భేదాభిప్రాయం నుండి కూడా తన ఆజ్ఞానుసారం సత్యం వైపుకు దర్శకత్వం వహించాడు. అల్లాహ్‌ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek