Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 235 - البَقَرَة - Page - Juz 2
﴿وَلَا جُنَاحَ عَلَيۡكُمۡ فِيمَا عَرَّضۡتُم بِهِۦ مِنۡ خِطۡبَةِ ٱلنِّسَآءِ أَوۡ أَكۡنَنتُمۡ فِيٓ أَنفُسِكُمۡۚ عَلِمَ ٱللَّهُ أَنَّكُمۡ سَتَذۡكُرُونَهُنَّ وَلَٰكِن لَّا تُوَاعِدُوهُنَّ سِرًّا إِلَّآ أَن تَقُولُواْ قَوۡلٗا مَّعۡرُوفٗاۚ وَلَا تَعۡزِمُواْ عُقۡدَةَ ٱلنِّكَاحِ حَتَّىٰ يَبۡلُغَ ٱلۡكِتَٰبُ أَجَلَهُۥۚ وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ يَعۡلَمُ مَا فِيٓ أَنفُسِكُمۡ فَٱحۡذَرُوهُۚ وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ غَفُورٌ حَلِيمٞ ﴾
[البَقَرَة: 235]
﴿ولا جناح عليكم فيما عرضتم به من خطبة النساء أو أكننتم في﴾ [البَقَرَة: 235]
Abdul Raheem Mohammad Moulana Mariyu miru (vitantuvu leka mudu vidakulu pondina strilato) vivaham cesukovalane sankalpanni (vari niriksana kalanlo) paroksanga telipina leka danini mi manas'sulalo gopyanga uncina mipai dosam ledu. Miru varito (vivahamadatam gurinci) alocistunnarani allah ku telusu, kani varito rahasyanga elanti oppandam cesukokandi. Ayite miredaina matladadalacukunte, dharmasam'matamaina ritilo matladukondi. Mariyu niriksana vyavadhi purtayyenta varaku vivaham cesukokandi. Niscayanga mi manas'sulalo unnadanta allah ku telusani telusukoni, ayanaku bhayapadandi. Mariyu niscayanga allah ksamasiludu, sahanasiludu (santa svabhavudu) ani telusukondi |
Abdul Raheem Mohammad Moulana Mariyu mīru (vitantuvu lēka mūḍu viḍākulu pondina strīlatō) vivāhaṁ cēsukōvālanē saṅkalpānni (vāri nirīkṣaṇā kālanlō) parōkṣaṅgā telipinā lēka dānini mī manas'sulalō gōpyaṅgā un̄cinā mīpai dōṣaṁ lēdu. Mīru vāritō (vivāhamāḍaṭaṁ gurin̄ci) ālōcistunnārani allāh ku telusu, kānī vāritō rahasyaṅgā elāṇṭi oppandaṁ cēsukōkaṇḍi. Ayitē mīrēdainā māṭlāḍadalacukuṇṭē, dharmasam'matamaina rītilō māṭlāḍukōṇḍi. Mariyu nirīkṣaṇā vyavadhi pūrtayyēnta varaku vivāhaṁ cēsukōkaṇḍi. Niścayaṅgā mī manas'sulalō unnadantā allāh ku telusani telusukoni, āyanaku bhayapaḍaṇḍi. Mariyu niścayaṅgā allāh kṣamāśīluḍu, sahanaśīluḍu (śānta svabhāvuḍu) ani telusukōṇḍi |
Muhammad Aziz Ur Rehman ఆ స్త్రీలను (వితంతువులను) నికాహ్ చేసుకోవాలన్న మీ సంకల్పాన్ని సూచనా ప్రాయంగా వారికి తెలియజేసినా లేక మీ ఉద్దేశాన్ని మీ గుండెల్లోనే దాచుకున్నా అందులో తప్పేమీలేదు. మీరు తప్పకుండా వారి గురించి ప్రస్తావిస్తారన్న సంగతి అల్లాహ్‌కు తెలుసు. అయితే మీరు వారికి లోపాయికారిగా వాగ్దానాలు చేయకండి. ధర్మయుక్తంగా ఏదన్నా చెబితే అది వేరే విషయం! కాని ఇద్దత్ (గడువు) కాలం ముగియనిదే నికాహ్ ఒప్పందాన్ని నిశ్చయం చేయకండి. మీ ఆంతర్యాల్లో దాగి వున్న విషయాలను సయితం అల్లాహ్ తెలుసుకుంటాడని మరువకండి. కనుక ఆయన పట్ల అప్రమత్తంగా ఉండండి. అల్లాహ్ క్షమించేవాడు, సహనశీలి అని కూడా తెలుసుకోండి |