×

ఏమీ? మూసా (నిర్యాణం) తరువాత ఇస్రాయీలు సంతతి నాయకులు, తమ ఒక ప్రవక్తతో: "నీవు మా 2:246 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:246) ayat 246 in Telugu

2:246 Surah Al-Baqarah ayat 246 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 246 - البَقَرَة - Page - Juz 2

﴿أَلَمۡ تَرَ إِلَى ٱلۡمَلَإِ مِنۢ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ مِنۢ بَعۡدِ مُوسَىٰٓ إِذۡ قَالُواْ لِنَبِيّٖ لَّهُمُ ٱبۡعَثۡ لَنَا مَلِكٗا نُّقَٰتِلۡ فِي سَبِيلِ ٱللَّهِۖ قَالَ هَلۡ عَسَيۡتُمۡ إِن كُتِبَ عَلَيۡكُمُ ٱلۡقِتَالُ أَلَّا تُقَٰتِلُواْۖ قَالُواْ وَمَا لَنَآ أَلَّا نُقَٰتِلَ فِي سَبِيلِ ٱللَّهِ وَقَدۡ أُخۡرِجۡنَا مِن دِيَٰرِنَا وَأَبۡنَآئِنَاۖ فَلَمَّا كُتِبَ عَلَيۡهِمُ ٱلۡقِتَالُ تَوَلَّوۡاْ إِلَّا قَلِيلٗا مِّنۡهُمۡۚ وَٱللَّهُ عَلِيمُۢ بِٱلظَّٰلِمِينَ ﴾
[البَقَرَة: 246]

ఏమీ? మూసా (నిర్యాణం) తరువాత ఇస్రాయీలు సంతతి నాయకులు, తమ ఒక ప్రవక్తతో: "నీవు మా కొరకు ఒక రాజును నియమించు, మేము అల్లాహ్ మార్గంలో యుద్ధం (జిహాద్) చేస్తాము." అని పలికిన సంగతి నీకు తెలియదా? దానికి అతను: "ఒకవేళ యుద్ధం చేయమని ఆదేశిస్తే, మీరు యుద్ధం చేయటానికి నిరాకరించరు కదా? అని అన్నాడు. దానికి వారు: "మేము మరియు మా సంతానం, మా ఇండ్ల నుండి గెంటివేయ బడ్డాము కదా! అలాంటప్పుడు మేము అల్లాహ్ మార్గంలో ఎందుకు యుద్ధం చేయము?" అని జవాబిచ్చారు. కాని యుద్ధం చేయండని ఆజ్ఞాపించగానే, వారిలో కొందరు తప్ప, అందరూ వెన్ను చూపారు. మరియు అల్లాహ్ కు ఈ దుర్మార్గులను గురించి బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: ألم تر إلى الملإ من بني إسرائيل من بعد موسى إذ قالوا, باللغة التيلجو

﴿ألم تر إلى الملإ من بني إسرائيل من بعد موسى إذ قالوا﴾ [البَقَرَة: 246]

Abdul Raheem Mohammad Moulana
Emi? Musa (niryanam) taruvata israyilu santati nayakulu, tama oka pravaktato: "Nivu ma koraku oka rajunu niyamincu, memu allah marganlo yud'dham (jihad) cestamu." Ani palikina sangati niku teliyada? Daniki atanu: "Okavela yud'dham ceyamani adesiste, miru yud'dham ceyataniki nirakarincaru kada? Ani annadu. Daniki varu: "Memu mariyu ma santanam, ma indla nundi gentiveya baddamu kada! Alantappudu memu allah marganlo enduku yud'dham ceyamu?" Ani javabiccaru. Kani yud'dham ceyandani ajnapincagane, varilo kondaru tappa, andaru vennu cuparu. Mariyu allah ku i durmargulanu gurinci baga telusu
Abdul Raheem Mohammad Moulana
Ēmī? Mūsā (niryāṇaṁ) taruvāta isrāyīlu santati nāyakulu, tama oka pravaktatō: "Nīvu mā koraku oka rājunu niyamin̄cu, mēmu allāh mārganlō yud'dhaṁ (jihād) cēstāmu." Ani palikina saṅgati nīku teliyadā? Dāniki atanu: "Okavēḷa yud'dhaṁ cēyamani ādēśistē, mīru yud'dhaṁ cēyaṭāniki nirākarin̄caru kadā? Ani annāḍu. Dāniki vāru: "Mēmu mariyu mā santānaṁ, mā iṇḍla nuṇḍi geṇṭivēya baḍḍāmu kadā! Alāṇṭappuḍu mēmu allāh mārganlō enduku yud'dhaṁ cēyamu?" Ani javābiccāru. Kāni yud'dhaṁ cēyaṇḍani ājñāpin̄cagānē, vārilō kondaru tappa, andarū vennu cūpāru. Mariyu allāh ku ī durmārgulanu gurin̄ci bāgā telusu
Muhammad Aziz Ur Rehman
మూసా తరువాత ఇస్రాయీలు సంతతి పెద్దల (రెండు నాల్కల ధోరణి)ని గురించి నువ్వు ఆలోచించావా? “మేము దైవమార్గంలో పోరాడేందుకుగాను మాకోసం ఎవరినయినా రాజుగా నియమించండి” అని వారు తమ ప్రవక్తను కోరారు. దానికి ఆ ప్రవక్త, “తీరా యుద్ధం విధించబడ్డాక మీరు వెనుకంజ వేస్తారేమో!” అని అన్నాడు. దానికి వారు, “మేము ఇప్పటికే ఇళ్లనుంచి తరిమివేయబడ్డాము. మా పిల్లలకు దూరం చేయబడ్డాము. అలాంటప్పుడు మేము దైవమార్గంలో పోరాడకుండా ఉండటం అనేది ఎలా సాధ్యం?” అని (కడు గంభీరంగా) పలికారు. తీరా యుద్ధం విధిగా చేయబడినప్పుడు, వారిలో కొద్ది మంది మినహా మిగిలిన వారంతా వెన్నుచూపారు. అల్లాహ్‌ దుర్మార్గులను బాగా ఎరుగు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek