×

మరియు వారి ప్రవక్త (సామ్యూల్) వారితో: "నిశ్చయంగా, అల్లాహ్ మీ కొరకు 'తాలూత్ ను (సౌల్ 2:247 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:247) ayat 247 in Telugu

2:247 Surah Al-Baqarah ayat 247 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 247 - البَقَرَة - Page - Juz 2

﴿وَقَالَ لَهُمۡ نَبِيُّهُمۡ إِنَّ ٱللَّهَ قَدۡ بَعَثَ لَكُمۡ طَالُوتَ مَلِكٗاۚ قَالُوٓاْ أَنَّىٰ يَكُونُ لَهُ ٱلۡمُلۡكُ عَلَيۡنَا وَنَحۡنُ أَحَقُّ بِٱلۡمُلۡكِ مِنۡهُ وَلَمۡ يُؤۡتَ سَعَةٗ مِّنَ ٱلۡمَالِۚ قَالَ إِنَّ ٱللَّهَ ٱصۡطَفَىٰهُ عَلَيۡكُمۡ وَزَادَهُۥ بَسۡطَةٗ فِي ٱلۡعِلۡمِ وَٱلۡجِسۡمِۖ وَٱللَّهُ يُؤۡتِي مُلۡكَهُۥ مَن يَشَآءُۚ وَٱللَّهُ وَٰسِعٌ عَلِيمٞ ﴾
[البَقَرَة: 247]

మరియు వారి ప్రవక్త (సామ్యూల్) వారితో: "నిశ్చయంగా, అల్లాహ్ మీ కొరకు 'తాలూత్ ను (సౌల్ ను) రాజుగా నియమించాడు." అని అన్నాడు. దానికి వారు అన్నారు: "మాపై రాజ్యం చేసే హక్కు అతనికి ఎలా సంక్రమిస్తుంది? వాస్తవానికి, రాజ్యం చేసే హక్కు, అతని కంటే ఎక్కువ, మాకే ఉంది. మరియు అతను అత్యధిక ధనసంపత్తులున్న వాడునూ కాడు." (దానికి వారి ప్రవక్త) అన్నాడు: "నిశ్చయంగా, అల్లాహ్ మీలో అతనిని ఎన్నుకొని అతనికి బుద్ధిబలాన్నీ, శారీరక బలాన్నీ సమృద్ధిగా ప్రసాదించాడు. మరియు అల్లాహ్ తాను కోరిన వారికి తన రాజ్యాన్ని ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: وقال لهم نبيهم إن الله قد بعث لكم طالوت ملكا قالوا أنى, باللغة التيلجو

﴿وقال لهم نبيهم إن الله قد بعث لكم طالوت ملكا قالوا أنى﴾ [البَقَرَة: 247]

Abdul Raheem Mohammad Moulana
mariyu vari pravakta (samyul) varito: "Niscayanga, allah mi koraku'talut nu (saul nu) rajuga niyamincadu." Ani annadu. Daniki varu annaru: "Mapai rajyam cese hakku ataniki ela sankramistundi? Vastavaniki, rajyam cese hakku, atani kante ekkuva, make undi. Mariyu atanu atyadhika dhanasampattulunna vadunu kadu." (Daniki vari pravakta) annadu: "Niscayanga, allah milo atanini ennukoni ataniki bud'dhibalanni, sariraka balanni samrd'dhiga prasadincadu. Mariyu allah tanu korina variki tana rajyanni prasadistadu. Mariyu allah sarvavyapti, sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāri pravakta (sāmyūl) vāritō: "Niścayaṅgā, allāh mī koraku'tālūt nu (saul nu) rājugā niyamin̄cāḍu." Ani annāḍu. Dāniki vāru annāru: "Māpai rājyaṁ cēsē hakku ataniki elā saṅkramistundi? Vāstavāniki, rājyaṁ cēsē hakku, atani kaṇṭē ekkuva, mākē undi. Mariyu atanu atyadhika dhanasampattulunna vāḍunū kāḍu." (Dāniki vāri pravakta) annāḍu: "Niścayaṅgā, allāh mīlō atanini ennukoni ataniki bud'dhibalānnī, śārīraka balānnī samr̥d'dhigā prasādin̄cāḍu. Mariyu allāh tānu kōrina vāriki tana rājyānni prasādistāḍu. Mariyu allāh sarvavyāpti, sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
“అల్లాహ్‌ తాలూత్‌ను మీ రాజుగా నియమించాడని” వారి ప్రవక్త వారికి తెలియజేసినప్పుడు, “అతని అధికారం మాపై ఎలా నడుస్తుంది? రాజ్యాధికారానికి అతనికన్నా ఎక్కువ హక్కు దారులము మేమాయె! కనీసం అతనికి సిరిసంపదల్లో కూడా విస్తృతి వొసగబడలేదు” అని (సాకులు) చెప్పసాగారు. ప్రవక్త వారికి ఇలా నచ్చజెప్పాడు: “(చూడండి!) అల్లాహ్‌ అతన్నే మీపై (నాయకునిగా) ఎన్నుకున్నాడు. జ్ఞానపరంగా, శారీరకంగా కూడా అతనికి ఆధిక్యతను ప్రసాదించాడు. అల్లాహ్‌ తాను కోరిన వారికి రాజ్యాధికారం ఇస్తాడు. అల్లాహ్‌ విశాల సంపన్నుడు, జ్ఞాన సంపన్నుడు కూడా!”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek