×

అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వవ్యవస్థకు ఆధార భూతుడు. 2:255 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:255) ayat 255 in Telugu

2:255 Surah Al-Baqarah ayat 255 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 255 - البَقَرَة - Page - Juz 3

﴿ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلۡحَيُّ ٱلۡقَيُّومُۚ لَا تَأۡخُذُهُۥ سِنَةٞ وَلَا نَوۡمٞۚ لَّهُۥ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۗ مَن ذَا ٱلَّذِي يَشۡفَعُ عِندَهُۥٓ إِلَّا بِإِذۡنِهِۦۚ يَعۡلَمُ مَا بَيۡنَ أَيۡدِيهِمۡ وَمَا خَلۡفَهُمۡۖ وَلَا يُحِيطُونَ بِشَيۡءٖ مِّنۡ عِلۡمِهِۦٓ إِلَّا بِمَا شَآءَۚ وَسِعَ كُرۡسِيُّهُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَۖ وَلَا يَـُٔودُهُۥ حِفۡظُهُمَاۚ وَهُوَ ٱلۡعَلِيُّ ٱلۡعَظِيمُ ﴾
[البَقَرَة: 255]

అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వవ్యవస్థకు ఆధార భూతుడు. ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. ఆయన సమ్ముఖంలో - ఆయన అనుజ్ఞ లేకుండా - సిఫారసు చేయగల వాడెవడు? వారి ముందున్నదీ మరియు వారి వెనుక నున్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమునూ వారు గ్రహించజాలరు. ఆయన కుర్సీ ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్ఠించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన మహోన్నతుడు, సర్వోత్తముడు

❮ Previous Next ❯

ترجمة: الله لا إله إلا هو الحي القيوم لا تأخذه سنة ولا نوم, باللغة التيلجو

﴿الله لا إله إلا هو الحي القيوم لا تأخذه سنة ولا نوم﴾ [البَقَرَة: 255]

Abdul Raheem Mohammad Moulana
allah! Ayana tappa maroka aradhya devudu ledu. Ayana sajivudu, visvavyavasthaku adhara bhutudu. Ayanaku kunuku radu mariyu nidura radu. Bhumyakasalalo unna samastamu ayanaku cendinade. Ayana sam'mukhanlo - ayana anujna lekunda - sipharasu ceyagala vadevadu? Vari mundunnadi mariyu vari venuka nunnadi anni ayanaku baga telusu. Mariyu ayana korite tappa, ayana jnanavisesalalo e visayamunu varu grahincajalaru. Ayana kursi akasalanu mariyu bhumini parivesthinci unnadi. Vati sanraksana ayanaku e matram alasata kaligincadu. Mariyu ayana mahonnatudu, sarvottamudu
Abdul Raheem Mohammad Moulana
allāh! Āyana tappa maroka ārādhya dēvuḍu lēḍu. Āyana sajīvuḍu, viśvavyavasthaku ādhāra bhūtuḍu. Āyanaku kunuku rādu mariyu nidura rādu. Bhūmyākāśālalō unna samastamū āyanaku cendinadē. Āyana sam'mukhanlō - āyana anujña lēkuṇḍā - siphārasu cēyagala vāḍevaḍu? Vāri mundunnadī mariyu vāri venuka nunnadī annī āyanaku bāgā telusu. Mariyu āyana kōritē tappa, āyana jñānaviśēṣālalō ē viṣayamunū vāru grahin̄cajālaru. Āyana kursī ākāśālanū mariyu bhūminī parivēṣṭhin̄ci unnadi. Vāṭi sanrakṣaṇa āyanaku ē mātraṁ alasaṭa kaligin̄cadu. Mariyu āyana mahōnnatuḍu, sarvōttamuḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ (మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం). ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన సజీవుడు; అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకుగానీ, నిద్రగానీ పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన అధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానినీ, వెనుక ఉన్నదానిని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్యపరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం భూమ్యాకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek