×

ఏమీ? అల్లాహ్ (తన అనుగ్రహంతో) సామ్రాజ్యం ఇచ్చిన తరువాత, ఇబ్రాహీమ్ తో అతని ప్రభువు (అల్లాహ్) 2:258 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:258) ayat 258 in Telugu

2:258 Surah Al-Baqarah ayat 258 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 258 - البَقَرَة - Page - Juz 3

﴿أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِي حَآجَّ إِبۡرَٰهِـۧمَ فِي رَبِّهِۦٓ أَنۡ ءَاتَىٰهُ ٱللَّهُ ٱلۡمُلۡكَ إِذۡ قَالَ إِبۡرَٰهِـۧمُ رَبِّيَ ٱلَّذِي يُحۡيِۦ وَيُمِيتُ قَالَ أَنَا۠ أُحۡيِۦ وَأُمِيتُۖ قَالَ إِبۡرَٰهِـۧمُ فَإِنَّ ٱللَّهَ يَأۡتِي بِٱلشَّمۡسِ مِنَ ٱلۡمَشۡرِقِ فَأۡتِ بِهَا مِنَ ٱلۡمَغۡرِبِ فَبُهِتَ ٱلَّذِي كَفَرَۗ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلظَّٰلِمِينَ ﴾
[البَقَرَة: 258]

ఏమీ? అల్లాహ్ (తన అనుగ్రహంతో) సామ్రాజ్యం ఇచ్చిన తరువాత, ఇబ్రాహీమ్ తో అతని ప్రభువు (అల్లాహ్) ను గురించి వాదించిన వ్యక్తి (నమ్రూద్) విషయం నీకు తెలియదా? ఇబ్రాహీమ్: "జీవన్మరణాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయో! ఆయనే నా ప్రభువు." అని అన్నప్పుడు, అతడు: "చావుబ్రతుకులు రెండూ నా ఆధీనంలోనే ఉన్నాయి." అని అన్నాడు. అప్పుడు ఇబ్రాహీమ్: "సరే! అల్లాహ్ సూర్యుణ్ణి తూర్పు నుండి ఉదయింపజేస్తాడు; అయితే నీవు (సూర్యుణ్ణి) పడమర నుండి ఉదయింపజెయ్యి." అని అన్నాడు. దానితో ఆ సత్యతిరస్కారి చికాకు పడ్డాడు. మరియు అల్లాహ్ దుర్మార్గం అవలంబించిన ప్రజలకు సన్మార్గం చూపడు

❮ Previous Next ❯

ترجمة: ألم تر إلى الذي حاج إبراهيم في ربه أن آتاه الله الملك, باللغة التيلجو

﴿ألم تر إلى الذي حاج إبراهيم في ربه أن آتاه الله الملك﴾ [البَقَرَة: 258]

Abdul Raheem Mohammad Moulana
emi? Allah (tana anugrahanto) samrajyam iccina taruvata, ibrahim to atani prabhuvu (allah) nu gurinci vadincina vyakti (namrud) visayam niku teliyada? Ibrahim: "Jivanmaranalu evari adhinanlo unnayo! Ayane na prabhuvu." Ani annappudu, atadu: "Cavubratukulu rendu na adhinanlone unnayi." Ani annadu. Appudu ibrahim: "Sare! Allah suryunni turpu nundi udayimpajestadu; ayite nivu (suryunni) padamara nundi udayimpajeyyi." Ani annadu. Danito a satyatiraskari cikaku paddadu. Mariyu allah durmargam avalambincina prajalaku sanmargam cupadu
Abdul Raheem Mohammad Moulana
ēmī? Allāh (tana anugrahantō) sāmrājyaṁ iccina taruvāta, ibrāhīm tō atani prabhuvu (allāh) nu gurin̄ci vādin̄cina vyakti (namrūd) viṣayaṁ nīku teliyadā? Ibrāhīm: "Jīvanmaraṇālu evari ādhīnanlō unnāyō! Āyanē nā prabhuvu." Ani annappuḍu, ataḍu: "Cāvubratukulu reṇḍū nā ādhīnanlōnē unnāyi." Ani annāḍu. Appuḍu ibrāhīm: "Sarē! Allāh sūryuṇṇi tūrpu nuṇḍi udayimpajēstāḍu; ayitē nīvu (sūryuṇṇi) paḍamara nuṇḍi udayimpajeyyi." Ani annāḍu. Dānitō ā satyatiraskāri cikāku paḍḍāḍu. Mariyu allāh durmārgaṁ avalambin̄cina prajalaku sanmārgaṁ cūpaḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ తనకు రాజ్యాధికారం ఇచ్చాడని (గర్వం కొద్దీ) ఇబ్రాహీంతో అతని ప్రభువు (ఎవరన్న) విషయంపై గొడవపడిన వానిని నీవు చూడలేదా? “జీవన్మరణాలను ఇచ్చేవాడు నా ప్రభువు” అని ఇబ్రాహీం అన్నప్పుడు, “నేనూ బ్రతికిస్తాను, చంపుతాను” అని అతనన్నాడు. అప్పుడు ఇబ్రాహీం (అలైహిస్సలాం), “సరే! అల్లాహ్‌ సూర్యుణ్ణి తూర్పు వైపు నుంచి ఉదయింపజేస్తున్నాడు కదా! మరి నువ్వు దాన్ని కాస్త పడమటి వైపు నుంచి ఉదయింపజెయ్యి” అని కోరినప్పుడు ఆ దైవతిరస్కారి బిత్తరపోయాడు. యదార్థమేమిటంటే అల్లాహ్‌ దుర్మార్గులకు సన్మార్గం చూపడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek