×

ఓ విశ్వాసులారా! (కేవలం) పరులకు చూపటానికి, తన ధనం ఖర్చు చేస్తూ అల్లాహ్ ను, అంతిమదినాన్ని 2:264 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:264) ayat 264 in Telugu

2:264 Surah Al-Baqarah ayat 264 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 264 - البَقَرَة - Page - Juz 3

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تُبۡطِلُواْ صَدَقَٰتِكُم بِٱلۡمَنِّ وَٱلۡأَذَىٰ كَٱلَّذِي يُنفِقُ مَالَهُۥ رِئَآءَ ٱلنَّاسِ وَلَا يُؤۡمِنُ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِۖ فَمَثَلُهُۥ كَمَثَلِ صَفۡوَانٍ عَلَيۡهِ تُرَابٞ فَأَصَابَهُۥ وَابِلٞ فَتَرَكَهُۥ صَلۡدٗاۖ لَّا يَقۡدِرُونَ عَلَىٰ شَيۡءٖ مِّمَّا كَسَبُواْۗ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلۡكَٰفِرِينَ ﴾
[البَقَرَة: 264]

ఓ విశ్వాసులారా! (కేవలం) పరులకు చూపటానికి, తన ధనం ఖర్చు చేస్తూ అల్లాహ్ ను, అంతిమదినాన్ని విశ్వసించని వాని మాదిరిగా! మీరూ చేసిన మేలును చెప్పుకొని (ఉపకారం పొందిన వారిని) కష్టపెట్టి, మీ దానధర్మాలను వ్యర్థ పరచుకోకండి. ఇలాంటి వాని పోలిక మట్టి కప్పుకున్న ఒక నున్నని బండపై భారీ వర్షం కురిసి (మట్టి కొట్టుకుపోగా) అది ఉత్తగా మిగిలి పోయినట్లుగా ఉంటుంది. ఇలాంటి వారు తాము సంపాదించిన దాని నుండి ఏమీ చేయలేరు. మరియు అల్లాహ్ సత్యతిరస్కారులకు సన్మార్గం చూపడు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا لا تبطلوا صدقاتكم بالمن والأذى كالذي ينفق ماله رئاء, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا لا تبطلوا صدقاتكم بالمن والأذى كالذي ينفق ماله رئاء﴾ [البَقَرَة: 264]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! (Kevalam) parulaku cupataniki, tana dhanam kharcu cestu allah nu, antimadinanni visvasincani vani madiriga! Miru cesina melunu ceppukoni (upakaram pondina varini) kastapetti, mi danadharmalanu vyartha paracukokandi. Ilanti vani polika matti kappukunna oka nunnani bandapai bhari varsam kurisi (matti kottukupoga) adi uttaga migili poyinatluga untundi. Ilanti varu tamu sampadincina dani nundi emi ceyaleru. Mariyu allah satyatiraskarulaku sanmargam cupadu
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! (Kēvalaṁ) parulaku cūpaṭāniki, tana dhanaṁ kharcu cēstū allāh nu, antimadinānni viśvasin̄cani vāni mādirigā! Mīrū cēsina mēlunu ceppukoni (upakāraṁ pondina vārini) kaṣṭapeṭṭi, mī dānadharmālanu vyartha paracukōkaṇḍi. Ilāṇṭi vāni pōlika maṭṭi kappukunna oka nunnani baṇḍapai bhārī varṣaṁ kurisi (maṭṭi koṭṭukupōgā) adi uttagā migili pōyinaṭlugā uṇṭundi. Ilāṇṭi vāru tāmu sampādin̄cina dāni nuṇḍi ēmī cēyalēru. Mariyu allāh satyatiraskārulaku sanmārgaṁ cūpaḍu
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! తన ధనాన్ని పరుల మెప్పుకోసం ఖర్చుచేస్తూ, అల్లాహ్‌ను గానీ, అంతిమదినాన్ని గానీ విశ్వసించని వ్యక్తి మాదిరిగా మీరు మీ ఉపకారాన్ని చాటుకుని, (గ్రహీతల) మనస్సులను నొప్పించి మీ దానధర్మాలను వృధా చేసుకోకండి. అతని ఉపమానం కొద్దిగా మట్టి పేరుకుని ఉన్న నున్నని రాతి బండ వంటిది. దానిపై భారీవర్షం కురిసి, ఆ మట్టి కాస్తా కొట్టుకు పోయి, కటికరాయి మాత్రమే మిగులుతుంది. ఈ ప్రదర్శనా కారులకు తాము చేసుకున్న దానిలో నుంచి ఏమీ ప్రాప్తించదు. అల్లాహ్‌ సత్యతిరస్కారులకు సన్మార్గం చూపడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek