Quran with Telugu translation - Surah Al-hajj ayat 78 - الحج - Page - Juz 17
﴿وَجَٰهِدُواْ فِي ٱللَّهِ حَقَّ جِهَادِهِۦۚ هُوَ ٱجۡتَبَىٰكُمۡ وَمَا جَعَلَ عَلَيۡكُمۡ فِي ٱلدِّينِ مِنۡ حَرَجٖۚ مِّلَّةَ أَبِيكُمۡ إِبۡرَٰهِيمَۚ هُوَ سَمَّىٰكُمُ ٱلۡمُسۡلِمِينَ مِن قَبۡلُ وَفِي هَٰذَا لِيَكُونَ ٱلرَّسُولُ شَهِيدًا عَلَيۡكُمۡ وَتَكُونُواْ شُهَدَآءَ عَلَى ٱلنَّاسِۚ فَأَقِيمُواْ ٱلصَّلَوٰةَ وَءَاتُواْ ٱلزَّكَوٰةَ وَٱعۡتَصِمُواْ بِٱللَّهِ هُوَ مَوۡلَىٰكُمۡۖ فَنِعۡمَ ٱلۡمَوۡلَىٰ وَنِعۡمَ ٱلنَّصِيرُ ﴾
[الحج: 78]
﴿وجاهدوا في الله حق جهاده هو اجتباكم وما جعل عليكم في الدين﴾ [الحج: 78]
Abdul Raheem Mohammad Moulana mariyu allah marganlo poradavalasina vidhanga dharmaporatam ceyandi. Ayana mim'malni ennukunnadu. Mariyu ayana dharmam visayanlo miku elanti ibbandi kaligincaledu. Idi mi tandri ibrahim matame. Ayana modati nundi miku allah ku vidheyulu (muslinlu) ani peru pettadu. Dinikai mi sandesaharudu miku saksiga undataniki mariyu miru prajalaku saksuluga undataniki. Kavuna namaj sthapincandi, vidhi danam (jakat) ivvandi. Mariyu allah to gatti sambandham kaligi undandi, ayane mi sanraksakudu, enta sresthamaina sanraksakudu mariyu enta uttama sahayakudu |
Abdul Raheem Mohammad Moulana mariyu allāh mārganlō pōrāḍavalasina vidhaṅgā dharmapōrāṭaṁ cēyaṇḍi. Āyana mim'malni ennukunnāḍu. Mariyu āyana dharmaṁ viṣayanlō mīku elāṇṭi ibbandi kaligin̄calēdu. Idi mī taṇḍri ibrāhīm matamē. Āyana modaṭi nuṇḍi mīku allāh ku vidhēyulu (muslinlu) ani pēru peṭṭāḍu. Dīnikai mī sandēśaharuḍu mīku sākṣigā uṇḍaṭāniki mariyu mīru prajalaku sākṣulugā uṇḍaṭāniki. Kāvuna namāj sthāpin̄caṇḍi, vidhi dānaṁ (jakāt) ivvaṇḍi. Mariyu allāh tō gaṭṭi sambandhaṁ kaligi uṇḍaṇḍi, āyanē mī sanrakṣakuḍu, enta śrēṣṭhamaina sanrakṣakuḍu mariyu enta uttama sahāyakuḍu |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్ (ప్రసన్నత) కోసం పాటుపడవలసిన విధంగా పాటుపడండి. ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ధర్మం విషయంలో ఆయన మీపై ఎలాంటి ఇబ్బందినీ ఉంచలేదు. మీ పితామహుడైన ఇబ్రాహీము (అలైహిస్సలాం) ధర్మానికి కట్టుబడి ఉండండి. ఈ ఖుర్‌ఆన్‌కు పూర్వం కూడా ఆయన (అల్లాహ్) మిమ్మల్ని ‘ముస్లింలు’ గానే నామకరణం చేశాడు. మరి ఇందులో కూడా (మీ పేరు అదే). దైవప్రవక్త మీపై సాక్షిగా, మీరు మానవాళిపై సాక్షులుగా ఉండటానికి(ఈ విధంగా చేయబడింది). కనుక మీరు నమాజును నెలకొల్పండి, జకాతును చెల్లించండి, అల్లాహ్‌ను స్థిరంగా ఆశ్రయించండి. ఆయనే మీ సంరక్షకుడు! (ఆయన) ఎంత చక్కని సంరక్షకుడు! మరెంత చక్కని సహాయకుడు |