×

ఎవరికైతే, పెండ్లి చేసుకునే శక్తి లేదో వారు, అల్లాహ్ తన అనుగ్రహంతో వారిని ధనవంతులుగా చేసే 24:33 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:33) ayat 33 in Telugu

24:33 Surah An-Nur ayat 33 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 33 - النور - Page - Juz 18

﴿وَلۡيَسۡتَعۡفِفِ ٱلَّذِينَ لَا يَجِدُونَ نِكَاحًا حَتَّىٰ يُغۡنِيَهُمُ ٱللَّهُ مِن فَضۡلِهِۦۗ وَٱلَّذِينَ يَبۡتَغُونَ ٱلۡكِتَٰبَ مِمَّا مَلَكَتۡ أَيۡمَٰنُكُمۡ فَكَاتِبُوهُمۡ إِنۡ عَلِمۡتُمۡ فِيهِمۡ خَيۡرٗاۖ وَءَاتُوهُم مِّن مَّالِ ٱللَّهِ ٱلَّذِيٓ ءَاتَىٰكُمۡۚ وَلَا تُكۡرِهُواْ فَتَيَٰتِكُمۡ عَلَى ٱلۡبِغَآءِ إِنۡ أَرَدۡنَ تَحَصُّنٗا لِّتَبۡتَغُواْ عَرَضَ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۚ وَمَن يُكۡرِههُّنَّ فَإِنَّ ٱللَّهَ مِنۢ بَعۡدِ إِكۡرَٰهِهِنَّ غَفُورٞ رَّحِيمٞ ﴾
[النور: 33]

ఎవరికైతే, పెండ్లి చేసుకునే శక్తి లేదో వారు, అల్లాహ్ తన అనుగ్రహంతో వారిని ధనవంతులుగా చేసే వరకు శీలశుద్ధతను పాటించాలి. మరియు మీ బానిసలలో ఎవరైనా స్వేచ్ఛాపత్రం వ్రాయించుకోగోరితే వారి యందు మీకు మంచితనం కనబడితే, వారికి స్వేచ్ఛాపత్రం వ్రాసి ఇవ్విండి. అల్లాహ్ మీకు ఇచ్చిన ధనం నుండి వారికి కూడా కొంత ఇవ్వండి. మీరు ఇహలోక ప్రయోజనాల నిమిత్తం, మీ బానిస స్త్రీలు శీలవతులుగా ఉండగోరితే వారిని వ్యభిచారానికి బలవంతపెట్టకండి, ఎవరైనా వారిని బలవంతపెడితే! నిశ్చయంగా, అల్లాహ్ వారిని (ఆ బానిస స్త్రీలకు) బలాత్కారం తరువాత క్షమించేవాడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: وليستعفف الذين لا يجدون نكاحا حتى يغنيهم الله من فضله والذين يبتغون, باللغة التيلجو

﴿وليستعفف الذين لا يجدون نكاحا حتى يغنيهم الله من فضله والذين يبتغون﴾ [النور: 33]

Abdul Raheem Mohammad Moulana
evarikaite, pendli cesukune sakti ledo varu, allah tana anugrahanto varini dhanavantuluga cese varaku silasud'dhatanu patincali. Mariyu mi banisalalo evaraina svecchapatram vrayincukogorite vari yandu miku mancitanam kanabadite, variki svecchapatram vrasi ivvindi. Allah miku iccina dhanam nundi variki kuda konta ivvandi. Miru ihaloka prayojanala nimittam, mi banisa strilu silavatuluga undagorite varini vyabhicaraniki balavantapettakandi, evaraina varini balavantapedite! Niscayanga, allah varini (a banisa strilaku) balatkaram taruvata ksamincevadu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
evarikaitē, peṇḍli cēsukunē śakti lēdō vāru, allāh tana anugrahantō vārini dhanavantulugā cēsē varaku śīlaśud'dhatanu pāṭin̄cāli. Mariyu mī bānisalalō evarainā svēcchāpatraṁ vrāyin̄cukōgōritē vāri yandu mīku man̄citanaṁ kanabaḍitē, vāriki svēcchāpatraṁ vrāsi ivviṇḍi. Allāh mīku iccina dhanaṁ nuṇḍi vāriki kūḍā konta ivvaṇḍi. Mīru ihalōka prayōjanāla nimittaṁ, mī bānisa strīlu śīlavatulugā uṇḍagōritē vārini vyabhicārāniki balavantapeṭṭakaṇḍi, evarainā vārini balavantapeḍitē! Niścayaṅgā, allāh vārini (ā bānisa strīlaku) balātkāraṁ taruvāta kṣamin̄cēvāḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
వివాహం చేసుకునే ఆర్థిక స్థోమతలేనివారు, అల్లాహ్‌ తన అనుగ్రహంతో తమకు స్థోమతను ప్రసాదించేవరకూ శీల శుద్ధతను పాటించాలి. మీ బానిసలలో ఎవరయినా మీకేదైనా (సొమ్మును) ఇచ్చి, విడుదలకు సంబంధించిన లిఖిత పూర్వక ఒప్పందం (ముకాతబత్‌) మీతో చేసుకోదలిస్తే – వారిలో మీకు మంచితనం కానవచ్చిన పక్షంలో – వారికి వ్రాతపత్రం వ్రాసి ఇవ్వండి. అల్లాహ్‌ మీకు ప్రసాదించిన ధనంలో నుంచి వారికీ కొంత ఇవ్వండి. మీ బానిస స్త్రీలు శీలవతులుగా ఉండగోరి నప్పుడు, మీరు మీ ప్రాపంచిక జీవితపు స్వలాభాల కోసం వాళ్ళను వేశ్యావృత్తికై బలవంతపెట్టకండి. ఒకవేళ ఎవరయినా వారిని (ఆ నీచమైన పని కోసం) బలవంతం చేస్తే, ఆ బలాత్కారం తరువాత అల్లాహ్‌ (ఆ అభాగినులను) క్షమించేవాడు, కనికరించేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek