×

మరియు అల్లాహ్ ప్రవక్తల నుండి తీసుకున్న గట్టి ప్రమాణాన్ని (జ్ఞాపకం చేసుకోండి): "నేను మీకు ఒక 3:81 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:81) ayat 81 in Telugu

3:81 Surah al-‘Imran ayat 81 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 81 - آل عِمران - Page - Juz 3

﴿وَإِذۡ أَخَذَ ٱللَّهُ مِيثَٰقَ ٱلنَّبِيِّـۧنَ لَمَآ ءَاتَيۡتُكُم مِّن كِتَٰبٖ وَحِكۡمَةٖ ثُمَّ جَآءَكُمۡ رَسُولٞ مُّصَدِّقٞ لِّمَا مَعَكُمۡ لَتُؤۡمِنُنَّ بِهِۦ وَلَتَنصُرُنَّهُۥۚ قَالَ ءَأَقۡرَرۡتُمۡ وَأَخَذۡتُمۡ عَلَىٰ ذَٰلِكُمۡ إِصۡرِيۖ قَالُوٓاْ أَقۡرَرۡنَاۚ قَالَ فَٱشۡهَدُواْ وَأَنَا۠ مَعَكُم مِّنَ ٱلشَّٰهِدِينَ ﴾
[آل عِمران: 81]

మరియు అల్లాహ్ ప్రవక్తల నుండి తీసుకున్న గట్టి ప్రమాణాన్ని (జ్ఞాపకం చేసుకోండి): "నేను మీకు ఒక గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించిన తరువాత, ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి (మీ గ్రంథాలలో నుండి మిగిలివున్న) సత్యాన్ని ధృవపరిస్తే మీరు అతని (ధర్మాన్ని) విశ్వసించి, అతనికి సహాయం చేయవలసి ఉంటుంది." అని చెప్పి ఇలా ప్రశ్నించాడు: "ఏమీ? మీరు దీనికి అంగీకరిస్తారా? మరియు నా ఈ ప్రమాణాన్ని స్వీకరిస్తారా?" వారన్నారు: "మేము అంగీకరిస్తాము." అప్పుడు ఆయన అన్నాడు: "అయితే, మీరు దీనికి సాక్షులుగా ఉండండి. మరియు నేను కూడా మీతోపాటు సాక్షిగా ఉంటాను

❮ Previous Next ❯

ترجمة: وإذ أخذ الله ميثاق النبيين لما آتيتكم من كتاب وحكمة ثم جاءكم, باللغة التيلجو

﴿وإذ أخذ الله ميثاق النبيين لما آتيتكم من كتاب وحكمة ثم جاءكم﴾ [آل عِمران: 81]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah pravaktala nundi tisukunna gatti pramananni (jnapakam cesukondi): "Nenu miku oka granthanni mariyu vivekanni prasadincina taruvata, oka sandesaharudu (muham'mad) vacci (mi granthalalo nundi migilivunna) satyanni dhrvapariste miru atani (dharmanni) visvasinci, ataniki sahayam ceyavalasi untundi." Ani ceppi ila prasnincadu: "Emi? Miru diniki angikaristara? Mariyu na i pramananni svikaristara?" Varannaru: "Memu angikaristamu." Appudu ayana annadu: "Ayite, miru diniki saksuluga undandi. Mariyu nenu kuda mitopatu saksiga untanu
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh pravaktala nuṇḍi tīsukunna gaṭṭi pramāṇānni (jñāpakaṁ cēsukōṇḍi): "Nēnu mīku oka granthānni mariyu vivēkānni prasādin̄cina taruvāta, oka sandēśaharuḍu (muham'mad) vacci (mī granthālalō nuṇḍi migilivunna) satyānni dhr̥vaparistē mīru atani (dharmānni) viśvasin̄ci, ataniki sahāyaṁ cēyavalasi uṇṭundi." Ani ceppi ilā praśnin̄cāḍu: "Ēmī? Mīru dīniki aṅgīkaristārā? Mariyu nā ī pramāṇānni svīkaristārā?" Vārannāru: "Mēmu aṅgīkaristāmu." Appuḍu āyana annāḍu: "Ayitē, mīru dīniki sākṣulugā uṇḍaṇḍi. Mariyu nēnu kūḍā mītōpāṭu sākṣigā uṇṭānu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ (తన) ప్రవక్తల నుండి వాగ్దానం తీసుకున్నప్పుడు, ”నేను మీకు గ్రంథాన్ని, వివేకాన్ని ఒసగిన తరువాత, మీ వద్ద ఉన్న దాన్ని సత్యమని ధృవీకరించే ప్రవక్త మీ వద్దకు వస్తే మీరు తప్పకుండా అతన్ని విశ్వసించాలి, అతనికి సహాయపడాలి” అని చెప్పాడు. తరువాత ఆయన, ”ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? నేను మీపై మోపిన బాధ్యతను స్వీకరిస్తున్నారా?” అని ప్రశ్నించగా, ”మేము ఒప్పుకుంటున్నాము” అని అందరూ అన్నారు. ”మరయితే దీనికి మీరు సాక్షులుగా ఉండండి. మీతోపాటు నేనూ సాక్షిగా ఉంటాను” అని అల్లాహ్‌ అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek