Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 53 - الأحزَاب - Page - Juz 22
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَدۡخُلُواْ بُيُوتَ ٱلنَّبِيِّ إِلَّآ أَن يُؤۡذَنَ لَكُمۡ إِلَىٰ طَعَامٍ غَيۡرَ نَٰظِرِينَ إِنَىٰهُ وَلَٰكِنۡ إِذَا دُعِيتُمۡ فَٱدۡخُلُواْ فَإِذَا طَعِمۡتُمۡ فَٱنتَشِرُواْ وَلَا مُسۡتَـٔۡنِسِينَ لِحَدِيثٍۚ إِنَّ ذَٰلِكُمۡ كَانَ يُؤۡذِي ٱلنَّبِيَّ فَيَسۡتَحۡيِۦ مِنكُمۡۖ وَٱللَّهُ لَا يَسۡتَحۡيِۦ مِنَ ٱلۡحَقِّۚ وَإِذَا سَأَلۡتُمُوهُنَّ مَتَٰعٗا فَسۡـَٔلُوهُنَّ مِن وَرَآءِ حِجَابٖۚ ذَٰلِكُمۡ أَطۡهَرُ لِقُلُوبِكُمۡ وَقُلُوبِهِنَّۚ وَمَا كَانَ لَكُمۡ أَن تُؤۡذُواْ رَسُولَ ٱللَّهِ وَلَآ أَن تَنكِحُوٓاْ أَزۡوَٰجَهُۥ مِنۢ بَعۡدِهِۦٓ أَبَدًاۚ إِنَّ ذَٰلِكُمۡ كَانَ عِندَ ٱللَّهِ عَظِيمًا ﴾
[الأحزَاب: 53]
﴿ياأيها الذين آمنوا لا تدخلوا بيوت النبي إلا أن يؤذن لكم إلى﴾ [الأحزَاب: 53]
Abdul Raheem Mohammad Moulana O visvasulara! Pravakta yokka indlaloki anumati lekunda pravesincakandi. Bhojanartham (piluvabadinapudu) aharam sid'dhaparice samayam koraku veci undakandi, kani miru piluvabadi nappudu tappakunda vellandi. Ayite bhojanam cesina ventane vellipondi mariyu sadharana sambhasanalo kalaksepam cestu kurcokandi. Niscayanga, dini valana pravaktaku kastam kalugutundi; kani atanu mim'malni (pom'manataniki) sankocistadu. Mariyu allah satyam ceppataniki sankocincadu (siggu padadu). Mariyu miru pravakta bharyalato edaina adaga valasi vaccinappudu teracatu nundi adagandi. Idi mi hrdayalanu mariyu vari hrdayalanu kuda nirmalanga uncutundi. Mariyu allah sandesaharuniki kastam kaligincatam miku tagadu. Mariyu atani taruvata atani bharyalato miru ennatiki vivaham cesukokandi. Niscayanga idi allah drstilo maha aparadham |
Abdul Raheem Mohammad Moulana Ō viśvāsulārā! Pravakta yokka iṇḍlalōki anumati lēkuṇḍā pravēśin̄cakaṇḍi. Bhōjanārthaṁ (piluvabaḍinapuḍu) āhāraṁ sid'dhaparicē samayaṁ koraku vēci uṇḍakaṇḍi, kāni mīru piluvabaḍi nappuḍu tappakuṇḍā veḷḷaṇḍi. Ayitē bhōjanaṁ cēsina veṇṭanē veḷḷipoṇḍi mariyu sādhāraṇa sambhāṣaṇalō kālakṣēpaṁ cēstū kūrcōkaṇḍi. Niścayaṅgā, dīni valana pravaktaku kaṣṭaṁ kalugutundi; kāni atanu mim'malni (pom'manaṭāniki) saṅkōcistāḍu. Mariyu allāh satyaṁ ceppaṭāniki saṅkōcin̄caḍu (siggu paḍaḍu). Mariyu mīru pravakta bhāryalatō ēdainā aḍaga valasi vaccinappuḍu teracāṭu nuṇḍi aḍagaṇḍi. Idi mī hr̥dayālanu mariyu vāri hr̥dayālanu kūḍā nirmalaṅgā un̄cutundi. Mariyu allāh sandēśaharuniki kaṣṭaṁ kaligin̄caṭaṁ mīku tagadu. Mariyu atani taruvāta atani bhāryalatō mīru ennaṭikī vivāhaṁ cēsukōkaṇḍi. Niścayaṅgā idi allāh dr̥ṣṭilō mahā aparādhaṁ |
Muhammad Aziz Ur Rehman ఓ విశ్వాసులారా! మీకు అనుమతి లేనిదే మీరు ప్రవక్త ఇండ్లలోకి వెళ్ళకండి. భోజనార్థం మీకు పిలుపు అందినపుడు మాత్రం వెళ్ళండి. అయితే భోజనం తయారయ్యేవరకు వేచి ఉండే విధంగా కాదు. మరి భోజనం చేసిన వెంటనే బయలుదేరండి. కబుర్లు చెప్పుకుంటూ అక్కడే ఉండిపోకండి. ఈ రకమయిన మీ ప్రవర్తనవల్ల ప్రవక్తకు బాధ కలుగుతుంది. మొహమాటం కొద్దీ అతను మీకేమీ చెప్పడు. అయితే అల్లాహ్ మాత్రం నిజం చెప్పటానికి మొహమాటపడడు. మీరు ప్రవక్త సతీమణులను ఏదైనా అడగవలసి వచ్చినప్పుడు తెర వెనుక నుంచి అడగండి. మీ ఆంతర్యాల, వారి హృదయాల పరిశుద్ధత కోసం ఇదే సముచితమైన పద్ధతి. దైవప్రవక్తకు మనస్తాపం కలిగించటంగానీ, అతని తదనంతరం అతని భార్యలను వివాహమాడటంగానీ ఎన్నటికీ మీకు ధర్మసమ్మతం కాదు. అల్లాహ్ దృష్టిలో ఇది మహా పాతకం (అని తెలుసుకోండి) |