×

మరియు నీవు (ఓ ప్రవక్తా!) వారి (ముస్లింల) మద్య ఉండి (పోరాటం జరుగుతూ ఉండగా) నమాజ్ 4:102 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:102) ayat 102 in Telugu

4:102 Surah An-Nisa’ ayat 102 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 102 - النِّسَاء - Page - Juz 5

﴿وَإِذَا كُنتَ فِيهِمۡ فَأَقَمۡتَ لَهُمُ ٱلصَّلَوٰةَ فَلۡتَقُمۡ طَآئِفَةٞ مِّنۡهُم مَّعَكَ وَلۡيَأۡخُذُوٓاْ أَسۡلِحَتَهُمۡۖ فَإِذَا سَجَدُواْ فَلۡيَكُونُواْ مِن وَرَآئِكُمۡ وَلۡتَأۡتِ طَآئِفَةٌ أُخۡرَىٰ لَمۡ يُصَلُّواْ فَلۡيُصَلُّواْ مَعَكَ وَلۡيَأۡخُذُواْ حِذۡرَهُمۡ وَأَسۡلِحَتَهُمۡۗ وَدَّ ٱلَّذِينَ كَفَرُواْ لَوۡ تَغۡفُلُونَ عَنۡ أَسۡلِحَتِكُمۡ وَأَمۡتِعَتِكُمۡ فَيَمِيلُونَ عَلَيۡكُم مَّيۡلَةٗ وَٰحِدَةٗۚ وَلَا جُنَاحَ عَلَيۡكُمۡ إِن كَانَ بِكُمۡ أَذٗى مِّن مَّطَرٍ أَوۡ كُنتُم مَّرۡضَىٰٓ أَن تَضَعُوٓاْ أَسۡلِحَتَكُمۡۖ وَخُذُواْ حِذۡرَكُمۡۗ إِنَّ ٱللَّهَ أَعَدَّ لِلۡكَٰفِرِينَ عَذَابٗا مُّهِينٗا ﴾
[النِّسَاء: 102]

మరియు నీవు (ఓ ప్రవక్తా!) వారి (ముస్లింల) మద్య ఉండి (పోరాటం జరుగుతూ ఉండగా) నమాజ్ చేయించటానికి వారితో నిలబడితే, వారిలోని ఒక వర్గం నీతో పాటు నిలబడాలి. మరియు వారు అస్త్రధారులై ఉండాలి. వారు తమ సజ్దాను పూర్తి చేసుకొని వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఇంకా నమాజ్ చేయని రెండో వర్గం వచ్చి నీతో పాటు నమాజ్ చేయాలి. వారు కూడా జాగరూకులై ఉండి, తమ ఆయుధాలను ధరించి ఉండాలి. ఎందుకంటే, మీరు మీ ఆయుధాల పట్ల, మరియు మీ సామగ్రి పట్ల, ఏ కొద్ది అజాగ్రత్త వహించినా మీపై ఒక్కసారిగా విరుచుకు పడాలని సత్యతిరస్కారులు కాచుకొని ఉంటారు. అయితే, వర్షం వల్ల మీకు ఇబ్బందిగా ఉంటే! లేదా మీరు అస్వస్థులైతే, మీరు మీ ఆయుధాలను దించి పెట్టడం పాపం కాదు. అయినా మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారుల కొరకు అవమానకరమైన శిక్షను సిద్ధ పరచి ఉంచాడు

❮ Previous Next ❯

ترجمة: وإذا كنت فيهم فأقمت لهم الصلاة فلتقم طائفة منهم معك وليأخذوا أسلحتهم, باللغة التيلجو

﴿وإذا كنت فيهم فأقمت لهم الصلاة فلتقم طائفة منهم معك وليأخذوا أسلحتهم﴾ [النِّسَاء: 102]

Abdul Raheem Mohammad Moulana
mariyu nivu (o pravakta!) Vari (muslinla) madya undi (poratam jarugutu undaga) namaj ceyincataniki varito nilabadite, variloni oka vargam nito patu nilabadali. Mariyu varu astradharulai undali. Varu tama sajdanu purti cesukoni venakki vellipovali. Appudu inka namaj ceyani rendo vargam vacci nito patu namaj ceyali. Varu kuda jagarukulai undi, tama ayudhalanu dharinci undali. Endukante, miru mi ayudhala patla, mariyu mi samagri patla, e koddi ajagratta vahincina mipai okkasariga virucuku padalani satyatiraskarulu kacukoni untaru. Ayite, varsam valla miku ibbandiga unte! Leda miru asvasthulaite, miru mi ayudhalanu dinci pettadam papam kadu. Ayina mi jagrattalo miru undali. Niscayanga, allah satyatiraskarula koraku avamanakaramaina siksanu sid'dha paraci uncadu
Abdul Raheem Mohammad Moulana
mariyu nīvu (ō pravaktā!) Vāri (muslinla) madya uṇḍi (pōrāṭaṁ jarugutū uṇḍagā) namāj cēyin̄caṭāniki vāritō nilabaḍitē, vārilōni oka vargaṁ nītō pāṭu nilabaḍāli. Mariyu vāru astradhārulai uṇḍāli. Vāru tama sajdānu pūrti cēsukoni venakki veḷḷipōvāli. Appuḍu iṅkā namāj cēyani reṇḍō vargaṁ vacci nītō pāṭu namāj cēyāli. Vāru kūḍā jāgarūkulai uṇḍi, tama āyudhālanu dharin̄ci uṇḍāli. Endukaṇṭē, mīru mī āyudhāla paṭla, mariyu mī sāmagri paṭla, ē koddi ajāgratta vahin̄cinā mīpai okkasārigā virucuku paḍālani satyatiraskārulu kācukoni uṇṭāru. Ayitē, varṣaṁ valla mīku ibbandigā uṇṭē! Lēdā mīru asvasthulaitē, mīru mī āyudhālanu din̄ci peṭṭaḍaṁ pāpaṁ kādu. Ayinā mī jāgrattalō mīru uṇḍāli. Niścayaṅgā, allāh satyatiraskārula koraku avamānakaramaina śikṣanu sid'dha paraci un̄cāḍu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) నీవు వారి మధ్య ఉన్నప్పుడు, వారి కోసం నమాజును మొదలుపెట్టినప్పుడు, వారిలోని ఒక సమూహం తమ ఆయుధాలను తీసుకొని నీ వెంట నిలబడాలి. మరి వారు సజ్దా చేయగానే మీ వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పటి వరకూ నమాజ్‌లో పాల్గొనని రెండవ సమూహం వచ్చి నీతోపాటు నమాజు చేయాలి. వారు కూడా తమ రక్షణ సామగ్రిని, తమ ఆయుధాలను చేబూని ఉండాలి. మీరు మీ ఆయుధాల పట్ల, సామగ్రిపట్ల ఏమరుపాటుకు లోనైతే, ఒక్కసారిగా మీపై విరుచుకుపడాలని అవిశ్వాసులు కోరుకుంటారు. అయితే వర్షం మూలంగా లేక అస్వస్థత మూలంగా ఇబ్బందిగా ఉండి మీరు మీ ఆయుధాలను విడిచినట్లయితే అది దోషం కాదు. అయినా ఆత్మరక్షణ సామగ్రిని వెంట తీసుకొని ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ తిరస్కారుల కోసం అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek