×

మరియు మీ భార్యలకు సంతానం లేని పక్షంలో, వారు విడిచిపోయిన దానిలో మీకు అర్ధభాగం. కాని 4:12 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:12) ayat 12 in Telugu

4:12 Surah An-Nisa’ ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 12 - النِّسَاء - Page - Juz 4

﴿۞ وَلَكُمۡ نِصۡفُ مَا تَرَكَ أَزۡوَٰجُكُمۡ إِن لَّمۡ يَكُن لَّهُنَّ وَلَدٞۚ فَإِن كَانَ لَهُنَّ وَلَدٞ فَلَكُمُ ٱلرُّبُعُ مِمَّا تَرَكۡنَۚ مِنۢ بَعۡدِ وَصِيَّةٖ يُوصِينَ بِهَآ أَوۡ دَيۡنٖۚ وَلَهُنَّ ٱلرُّبُعُ مِمَّا تَرَكۡتُمۡ إِن لَّمۡ يَكُن لَّكُمۡ وَلَدٞۚ فَإِن كَانَ لَكُمۡ وَلَدٞ فَلَهُنَّ ٱلثُّمُنُ مِمَّا تَرَكۡتُمۚ مِّنۢ بَعۡدِ وَصِيَّةٖ تُوصُونَ بِهَآ أَوۡ دَيۡنٖۗ وَإِن كَانَ رَجُلٞ يُورَثُ كَلَٰلَةً أَوِ ٱمۡرَأَةٞ وَلَهُۥٓ أَخٌ أَوۡ أُخۡتٞ فَلِكُلِّ وَٰحِدٖ مِّنۡهُمَا ٱلسُّدُسُۚ فَإِن كَانُوٓاْ أَكۡثَرَ مِن ذَٰلِكَ فَهُمۡ شُرَكَآءُ فِي ٱلثُّلُثِۚ مِنۢ بَعۡدِ وَصِيَّةٖ يُوصَىٰ بِهَآ أَوۡ دَيۡنٍ غَيۡرَ مُضَآرّٖۚ وَصِيَّةٗ مِّنَ ٱللَّهِۗ وَٱللَّهُ عَلِيمٌ حَلِيمٞ ﴾
[النِّسَاء: 12]

మరియు మీ భార్యలకు సంతానం లేని పక్షంలో, వారు విడిచిపోయిన దానిలో మీకు అర్ధభాగం. కాని ఒకవేళ వారికి సంతానం ఉంటే, వారు విడిచి పోయిన దానిలో నాలుగోభాగం మీది. (ఇదంతా) వారు వ్రాసి పోయిన వీలునామాపై అమలు జరిపి, వారి అప్పులు తీర్చిన తరువాత. మరియు మీకు సంతానం లేని పక్షంలో మీరు విడిచి పోయిన దానిలో వారికి (మీ భార్యలకు) నాలుగోభాగం. కాని ఒకవేళ మీకు సంతానం ఉంటే, మీరు విడిచిన దానిలో వారికి ఎనిమిదో భాగం. ఇదంతా మీరు వ్రాసిన వీలునామాపై అమలు జరిగి మీ అప్పులు తీర్చిన తరువాత. మరియు ఒకవేళ మరణించిన పురుషుడు లేక స్త్రీ కలాల అయి (తండ్రి, కొడుకు లేక మనమడు లేకుండా) ఒక సోదరుడు మరియు ఒక సోదరి మాత్రమే ఉంటే, వారిలో ప్రతి ఒక్కరికీ ఆరోభాగం. కాని ఒకవేళ వారు (సోదరసోదరీమణులు) ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే, వారంతా మూడో భాగానికి వారసులవుతారు. ఇదంతా మృతుడు వ్రాసిన వీలునామాపై అమలు జరిగి అప్పులు తీర్చిన తరువాత. ఎవ్వరికీ నష్టం కలుగజేయకుండా జరగాలి. ఇది అల్లాహ్ నుండి వచ్చిన ఆదేశం. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, సహనశీలుడు (శాంతస్వభావుడు)

❮ Previous Next ❯

ترجمة: ولكم نصف ما ترك أزواجكم إن لم يكن لهن ولد فإن كان, باللغة التيلجو

﴿ولكم نصف ما ترك أزواجكم إن لم يكن لهن ولد فإن كان﴾ [النِّسَاء: 12]

Abdul Raheem Mohammad Moulana
Mariyu mi bharyalaku santanam leni paksanlo, varu vidicipoyina danilo miku ardhabhagam. Kani okavela variki santanam unte, varu vidici poyina danilo nalugobhagam midi. (Idanta) varu vrasi poyina vilunamapai amalu jaripi, vari appulu tircina taruvata. Mariyu miku santanam leni paksanlo miru vidici poyina danilo variki (mi bharyalaku) nalugobhagam. Kani okavela miku santanam unte, miru vidicina danilo variki enimido bhagam. Idanta miru vrasina vilunamapai amalu jarigi mi appulu tircina taruvata. Mariyu okavela maranincina purusudu leka stri kalala ayi (tandri, koduku leka manamadu lekunda) oka sodarudu mariyu oka sodari matrame unte, varilo prati okkariki arobhagam. Kani okavela varu (sodarasodarimanulu) iddari kante ekkuva unte, varanta mudo bhaganiki varasulavutaru. Idanta mrtudu vrasina vilunamapai amalu jarigi appulu tircina taruvata. Evvariki nastam kalugajeyakunda jaragali. Idi allah nundi vaccina adesam. Mariyu allah sarvajnudu, sahanasiludu (santasvabhavudu)
Abdul Raheem Mohammad Moulana
Mariyu mī bhāryalaku santānaṁ lēni pakṣanlō, vāru viḍicipōyina dānilō mīku ardhabhāgaṁ. Kāni okavēḷa vāriki santānaṁ uṇṭē, vāru viḍici pōyina dānilō nālugōbhāgaṁ mīdi. (Idantā) vāru vrāsi pōyina vīlunāmāpai amalu jaripi, vāri appulu tīrcina taruvāta. Mariyu mīku santānaṁ lēni pakṣanlō mīru viḍici pōyina dānilō vāriki (mī bhāryalaku) nālugōbhāgaṁ. Kāni okavēḷa mīku santānaṁ uṇṭē, mīru viḍicina dānilō vāriki enimidō bhāgaṁ. Idantā mīru vrāsina vīlunāmāpai amalu jarigi mī appulu tīrcina taruvāta. Mariyu okavēḷa maraṇin̄cina puruṣuḍu lēka strī kalāla ayi (taṇḍri, koḍuku lēka manamaḍu lēkuṇḍā) oka sōdaruḍu mariyu oka sōdari mātramē uṇṭē, vārilō prati okkarikī ārōbhāgaṁ. Kāni okavēḷa vāru (sōdarasōdarīmaṇulu) iddari kaṇṭē ekkuva uṇṭē, vārantā mūḍō bhāgāniki vārasulavutāru. Idantā mr̥tuḍu vrāsina vīlunāmāpai amalu jarigi appulu tīrcina taruvāta. Evvarikī naṣṭaṁ kalugajēyakuṇḍā jaragāli. Idi allāh nuṇḍi vaccina ādēśaṁ. Mariyu allāh sarvajñuḍu, sahanaśīluḍu (śāntasvabhāvuḍu)
Muhammad Aziz Ur Rehman
మీ భార్యలకు సంతానం లేనిపక్షంలో వారు వదలివెళ్ళిన ఆస్తిలో సగభాగం మీది. ఒకవేళ వారికి సంతానముంటే వారు విడిచిపెట్టిన ఆస్తిలో నాల్గోభాగం మీకు చెందుతుంది. వారు వ్రాసిపోయిన వీలునామాను అమలుపరచిన మీదట, లేదా వారు చేసిన అప్పుల్ని తీర్చిన మీదటే ఈ పంపకం జరగాలి. మీకు పిల్లలు లేని పక్షంలో మీరు వదలిపోయే ఆస్తిలో మీ భార్యలకు నాల్గో భాగం లభిస్తుంది. ఒకవేళ మీకు పిల్లలుంటే అప్పుడు మీరు వదలివెళ్ళే ఆస్తిలో మీ భార్యలకు ఎనిమిదో వంతు మాత్రమే లభిస్తుంది. మీరు వ్రాసి వెళ్ళిన వీలునామాను అమలు పరచి, లేదా మీరు చేసివెళ్ళిన అప్పుల్ని తీర్చిన తరువాతే మిగిలిన ఆస్తిలో పంపకాలు జరుగుతాయి. చనిపోయిన పురుషుడు లేక స్త్రీ ‘కలాలా’ అయి ఉండి (అంటే వారికి తండ్రిగాని, కొడుకు గాని లేకుండా ఉండి) వారికి ఒక సోదరుడు లేక ఒక సోదరి ఉన్నట్లయితే వారిలో ఒక్కొక్కరికి ఆరింట ఒక భాగం చొప్పున లభిస్తుంది. కాని వారు ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నట్లయితే అప్పుడు మొత్తం ఆస్తిలోని మూడో భాగాన్ని వారంతా సమానంగా పంచుకోవాలి. అయితే మృతుడు వ్రాసిన వీలునామాను అమలుపరచి, లేదా అతని అప్పులన్నీ తీర్చిన మీదటే ఈ పంపకం జరగాలి. ఇది ఇతరులకు నష్టకరంగా పరిణమించకూడదు. ఇది అల్లాహ్‌ తరఫున జరిగిన నిర్థారణ. అల్లాహ్‌ అన్నీ తెలిసినవాడు, సహనశీలుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek