Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 11 - النِّسَاء - Page - Juz 4
﴿يُوصِيكُمُ ٱللَّهُ فِيٓ أَوۡلَٰدِكُمۡۖ لِلذَّكَرِ مِثۡلُ حَظِّ ٱلۡأُنثَيَيۡنِۚ فَإِن كُنَّ نِسَآءٗ فَوۡقَ ٱثۡنَتَيۡنِ فَلَهُنَّ ثُلُثَا مَا تَرَكَۖ وَإِن كَانَتۡ وَٰحِدَةٗ فَلَهَا ٱلنِّصۡفُۚ وَلِأَبَوَيۡهِ لِكُلِّ وَٰحِدٖ مِّنۡهُمَا ٱلسُّدُسُ مِمَّا تَرَكَ إِن كَانَ لَهُۥ وَلَدٞۚ فَإِن لَّمۡ يَكُن لَّهُۥ وَلَدٞ وَوَرِثَهُۥٓ أَبَوَاهُ فَلِأُمِّهِ ٱلثُّلُثُۚ فَإِن كَانَ لَهُۥٓ إِخۡوَةٞ فَلِأُمِّهِ ٱلسُّدُسُۚ مِنۢ بَعۡدِ وَصِيَّةٖ يُوصِي بِهَآ أَوۡ دَيۡنٍۗ ءَابَآؤُكُمۡ وَأَبۡنَآؤُكُمۡ لَا تَدۡرُونَ أَيُّهُمۡ أَقۡرَبُ لَكُمۡ نَفۡعٗاۚ فَرِيضَةٗ مِّنَ ٱللَّهِۗ إِنَّ ٱللَّهَ كَانَ عَلِيمًا حَكِيمٗا ﴾
[النِّسَاء: 11]
﴿يوصيكم الله في أولادكم للذكر مثل حظ الأنثيين فإن كن نساء فوق﴾ [النِّسَاء: 11]
Abdul Raheem Mohammad Moulana Mi santana varasatvanni gurinci allah miku i vidhanga adesistunnadu: Oka purusuni (bhagam) iddaru strila bhagalaku samananga undali. Okavela iddaru leka antakante ekkuva stri (santanam matrame) unte, variki vidicina astilo mudinta rendu bhagalu untayi. Mariyu okavela oke adapilla unte ardhabhaganiki ame hakkudaruralu. Mariyu (mrtudu) santanam kalavadaite, atani tallidandrulalo prati okkariki vidicina astilo arobhagam labhistundi. Okavela ataniki santanam lekunte atani tallidandrulu matrame varasuluga unte, appudu talliki mudobhagam. Mrtuniki sodarasodarimanulu unte, talliki arobhagam. (I pampakamanta) mrtuni appulu tirci, atani vilunama pai amalu jaripina taruvatane jaragali. Mi tallidandrulu mariyu mi santananlo prayojanam ritya miku evaru ekkuva sannihitulo, miku teliyadu. Idi allah niyamincina vidhanam. Niscayanga, allah sarvajnudu, maha vivekavantudu |
Abdul Raheem Mohammad Moulana Mī santāna vārasatvānni gurin̄ci allāh mīku ī vidhaṅgā ādēśistunnāḍu: Oka puruṣuni (bhāgaṁ) iddaru strīla bhāgālaku samānaṅgā uṇḍāli. Okavēḷa iddaru lēka antakaṇṭē ekkuva strī (santānaṁ mātramē) uṇṭē, vāriki viḍicina āstilō mūḍiṇṭa reṇḍu bhāgālu uṇṭāyi. Mariyu okavēḷa okē āḍapilla uṇṭē ardhabhāgāniki āme hakkudārurālu. Mariyu (mr̥tuḍu) santānaṁ kalavāḍaitē, atani tallidaṇḍrulalō prati okkarikī viḍicina āstilō ārōbhāgaṁ labhistundi. Okavēḷa ataniki santānaṁ lēkuṇṭē atani tallidaṇḍrulu mātramē vārasulugā uṇṭē, appuḍu talliki mūḍōbhāgaṁ. Mr̥tuniki sōdarasōdarīmaṇulu uṇṭē, talliki ārōbhāgaṁ. (Ī pampakamantā) mr̥tuni appulu tīrci, atani vīlunāmā pai amalu jaripina taruvātanē jaragāli. Mī tallidaṇḍrulu mariyu mī santānanlō prayōjanaṁ rītyā mīku evaru ekkuva sannihitulō, mīku teliyadu. Idi allāh niyamin̄cina vidhānaṁ. Niścayaṅgā, allāh sarvajñuḍu, mahā vivēkavantuḍu |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్ మీ సంతానం విషయంలో మీకు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు : ఒక అబ్బాయి వాటా ఇద్దరు అమ్మాయిల వాటాకు సమానం. ఒకవేళ (మృతునికి) ఇద్దరుకన్నా ఎక్కువ మంది కుమార్తెలు మాత్రమే ఉంటే వారికి వారసత్వ ఆస్తిలో మూడింట రెండొంతుల భాగం లభిస్తుంది. ఒకవేళ ఒకే కూతురుంటే ఆమెకు సగభాగం దక్కుతుంది. చనిపోయిన వ్యక్తికి గనక సంతానముంటే, అతని తల్లిదండ్రులలో ఒక్కొక్కరికి అతను వదలివెళ్ళిన ఆస్తిలో ఆరింట ఒక భాగం లభిస్తుంది. ఒకవేళ మృతుడు సంతానం లేనివాడై ఉండి, అతని తల్లిదండ్రులే అతని ఆస్తికి వారసులైనపుడు, అతని తల్లికి మూడింట ఒక భాగం ఇవ్వాలి. ఒకవేళ మృతునికి గనక అనేక మంది అన్నదమ్ములుంటే, అప్పుడు తల్లికి ఆరింట ఒక భాగం మాత్రమే దక్కుతుంది. చనిపోయిన వ్యక్తి వ్రాసిన వీలునామాను అమలు పరచి, అతను చేసి వున్న అప్పులను తీర్చిన మీదటే ఈ (ఆస్తి) వాటాలు లభిస్తాయి. మీ తండ్రులలో లేక కుమారులలో – మీకు ప్రయోజనం చేకూర్చటంలో ఎవరు ఎక్కువ సన్నిహితులో మీకు తెలియదు. ఇవి అల్లాహ్ తరఫున నిర్ణయించబడిన వాటాలు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞాని, పరిపూర్ణ వివేకం గలవాడు |