×

మరియు మీలో ఎవరికైనా స్వతంత్రులైన ముస్లిం స్త్రీలను, వివాహం చేసుకునే స్తోమత లేకుంటే, అప్పుడు మీ 4:25 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:25) ayat 25 in Telugu

4:25 Surah An-Nisa’ ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 25 - النِّسَاء - Page - Juz 5

﴿وَمَن لَّمۡ يَسۡتَطِعۡ مِنكُمۡ طَوۡلًا أَن يَنكِحَ ٱلۡمُحۡصَنَٰتِ ٱلۡمُؤۡمِنَٰتِ فَمِن مَّا مَلَكَتۡ أَيۡمَٰنُكُم مِّن فَتَيَٰتِكُمُ ٱلۡمُؤۡمِنَٰتِۚ وَٱللَّهُ أَعۡلَمُ بِإِيمَٰنِكُمۚ بَعۡضُكُم مِّنۢ بَعۡضٖۚ فَٱنكِحُوهُنَّ بِإِذۡنِ أَهۡلِهِنَّ وَءَاتُوهُنَّ أُجُورَهُنَّ بِٱلۡمَعۡرُوفِ مُحۡصَنَٰتٍ غَيۡرَ مُسَٰفِحَٰتٖ وَلَا مُتَّخِذَٰتِ أَخۡدَانٖۚ فَإِذَآ أُحۡصِنَّ فَإِنۡ أَتَيۡنَ بِفَٰحِشَةٖ فَعَلَيۡهِنَّ نِصۡفُ مَا عَلَى ٱلۡمُحۡصَنَٰتِ مِنَ ٱلۡعَذَابِۚ ذَٰلِكَ لِمَنۡ خَشِيَ ٱلۡعَنَتَ مِنكُمۡۚ وَأَن تَصۡبِرُواْ خَيۡرٞ لَّكُمۡۗ وَٱللَّهُ غَفُورٞ رَّحِيمٞ ﴾
[النِّسَاء: 25]

మరియు మీలో ఎవరికైనా స్వతంత్రులైన ముస్లిం స్త్రీలను, వివాహం చేసుకునే స్తోమత లేకుంటే, అప్పుడు మీ స్వాధీనంలో ఉన్న ముస్లిం లైనటువంటి బానిస స్త్రీలను వివాహమాడవచ్చు. మరియు అల్లాహ్ కు మీ విశ్వాసం గురించి తెలుసు. మీరంతా ఒకే ఒక వర్గానికి చెందిన వారు. (ఒకరి కొకరు సంబంధించిన వారు), అందువల్ల వారి సంరక్షకుల అనుమతితో వారితో వివాహం చేసుకొని, ధర్మప్రకారంగా వారి స్త్రీ శుల్కం (మహ్ర్) ఇవ్వండి. ఇది వారిని వివాహ బంధంలో సురక్షితంగా ఉంచటానికి,స్వేచ్ఛా కామక్రీడలకు దిగకుండా ఉంచటానికి మరియు దొంగచాటు సంబంధాలు ఏర్పరచుకోకుండా ఉంచటానికి (ఆదేశించబడింది). వారు (ఆ బానిస స్త్రీలు) వివాహ బంధంలో రక్షణ పొందిన తరువాత కూడా వ్యభిచారానికి పాల్పడితే, స్వతంత్రులైన స్త్రీలకు విధించే శిక్షలోని సగం శిక్ష వారికి విధించండి. ఇది మీలో పాపభీతి గలవారికి వర్తిస్తుంది. ఒకవేళ మీరు నిగ్రహం పాటిస్తే అది మీకే మంచిది. మరియు అల్లాహ్ క్షమాశీలుడు. అపార కరుణాప్రదాత

❮ Previous Next ❯

ترجمة: ومن لم يستطع منكم طولا أن ينكح المحصنات المؤمنات فمن ما ملكت, باللغة التيلجو

﴿ومن لم يستطع منكم طولا أن ينكح المحصنات المؤمنات فمن ما ملكت﴾ [النِّسَاء: 25]

Abdul Raheem Mohammad Moulana
mariyu milo evarikaina svatantrulaina muslim strilanu, vivaham cesukune stomata lekunte, appudu mi svadhinanlo unna muslim lainatuvanti banisa strilanu vivahamadavaccu. Mariyu allah ku mi visvasam gurinci telusu. Miranta oke oka varganiki cendina varu. (Okari kokaru sambandhincina varu), anduvalla vari sanraksakula anumatito varito vivaham cesukoni, dharmaprakaranga vari stri sulkam (mahr) ivvandi. Idi varini vivaha bandhanlo suraksitanga uncataniki,sveccha kamakridalaku digakunda uncataniki mariyu dongacatu sambandhalu erparacukokunda uncataniki (adesincabadindi). Varu (a banisa strilu) vivaha bandhanlo raksana pondina taruvata kuda vyabhicaraniki palpadite, svatantrulaina strilaku vidhince siksaloni sagam siksa variki vidhincandi. Idi milo papabhiti galavariki vartistundi. Okavela miru nigraham patiste adi mike mancidi. Mariyu allah ksamasiludu. Apara karunapradata
Abdul Raheem Mohammad Moulana
mariyu mīlō evarikainā svatantrulaina musliṁ strīlanu, vivāhaṁ cēsukunē stōmata lēkuṇṭē, appuḍu mī svādhīnanlō unna musliṁ lainaṭuvaṇṭi bānisa strīlanu vivāhamāḍavaccu. Mariyu allāh ku mī viśvāsaṁ gurin̄ci telusu. Mīrantā okē oka vargāniki cendina vāru. (Okari kokaru sambandhin̄cina vāru), anduvalla vāri sanrakṣakula anumatitō vāritō vivāhaṁ cēsukoni, dharmaprakāraṅgā vāri strī śulkaṁ (mahr) ivvaṇḍi. Idi vārini vivāha bandhanlō surakṣitaṅgā un̄caṭāniki,svēcchā kāmakrīḍalaku digakuṇḍā un̄caṭāniki mariyu doṅgacāṭu sambandhālu ērparacukōkuṇḍā un̄caṭāniki (ādēśin̄cabaḍindi). Vāru (ā bānisa strīlu) vivāha bandhanlō rakṣaṇa pondina taruvāta kūḍā vyabhicārāniki pālpaḍitē, svatantrulaina strīlaku vidhin̄cē śikṣalōni sagaṁ śikṣa vāriki vidhin̄caṇḍi. Idi mīlō pāpabhīti galavāriki vartistundi. Okavēḷa mīru nigrahaṁ pāṭistē adi mīkē man̄cidi. Mariyu allāh kṣamāśīluḍu. Apāra karuṇāpradāta
Muhammad Aziz Ur Rehman
మీలో ఎవరికయినా స్వతంత్రులగు ముస్లిం స్త్రీలను వివాహమాడే స్థోమత లేకపోతే, మీ యాజమాన్యంలో ఉన్న విశ్వాసులైన బానిస స్త్రీలను నికాహ్‌ చేసుకోవాలి. మీ విశ్వాస స్థితి గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు. మీరంతా పరస్పరం ఒక్కటే కదా! కాబట్టి వారి యజమానుల అనుమతితో వారిని వివాహమాడండి. నియమానుసారం వారి మహర్‌ను వారికి ఇవ్వండి. అయితే వారు సౌశీల్యవతులై ఉండాలి. బాహాటంగా అశ్లీల కార్యాలకు పాల్పడనివారై ఉండాలి. చాటుమాటు ప్రేమ కలాపాలు సాగించేవారు కాకుండా ఉండాలి. మరి ఆ బానిస స్త్రీలు వివాహబంధంలో కట్టుబడిన తరువాత కూడా సిగ్గుమాలిన పనికి గనక ఒడిగడితే స్వతంత్రులగు స్త్రీలకు విధించే శిక్షలో సగం శిక్ష వీరికి విధించబడుతుంది. తమ వల్ల పాపకార్యం జరిగి పోతుందేమో, ఓర్చుకోలేమేమో అన్న భయం ఉన్నవారికి ఇలా బానిస స్త్రీలను వివాహమాడే వెసులుబాటు ఇవ్వబడింది. ఒకవేళ మీరు ఆత్మనిగ్రహాన్ని అలవరచుకుంటే అది మీకే శ్రేయస్కరం. అల్లాహ్‌ అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడూను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek