×

మరియు - పొరపాటుగా తప్ప - ఒక విశ్వాసి మరొక విశ్వాసిని చంపటం తగని పని 4:92 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:92) ayat 92 in Telugu

4:92 Surah An-Nisa’ ayat 92 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 92 - النِّسَاء - Page - Juz 5

﴿وَمَا كَانَ لِمُؤۡمِنٍ أَن يَقۡتُلَ مُؤۡمِنًا إِلَّا خَطَـٔٗاۚ وَمَن قَتَلَ مُؤۡمِنًا خَطَـٔٗا فَتَحۡرِيرُ رَقَبَةٖ مُّؤۡمِنَةٖ وَدِيَةٞ مُّسَلَّمَةٌ إِلَىٰٓ أَهۡلِهِۦٓ إِلَّآ أَن يَصَّدَّقُواْۚ فَإِن كَانَ مِن قَوۡمٍ عَدُوّٖ لَّكُمۡ وَهُوَ مُؤۡمِنٞ فَتَحۡرِيرُ رَقَبَةٖ مُّؤۡمِنَةٖۖ وَإِن كَانَ مِن قَوۡمِۭ بَيۡنَكُمۡ وَبَيۡنَهُم مِّيثَٰقٞ فَدِيَةٞ مُّسَلَّمَةٌ إِلَىٰٓ أَهۡلِهِۦ وَتَحۡرِيرُ رَقَبَةٖ مُّؤۡمِنَةٖۖ فَمَن لَّمۡ يَجِدۡ فَصِيَامُ شَهۡرَيۡنِ مُتَتَابِعَيۡنِ تَوۡبَةٗ مِّنَ ٱللَّهِۗ وَكَانَ ٱللَّهُ عَلِيمًا حَكِيمٗا ﴾
[النِّسَاء: 92]

మరియు - పొరపాటుగా తప్ప - ఒక విశ్వాసి మరొక విశ్వాసిని చంపటం తగని పని (నిషిద్ధం). మరియు ఒక విశ్వాసిని పొరపాటుగా చంపిన వాడు (దానికి పరిహారంగా) అతడు ఒక విశ్వాసి బానిసకు విముక్తి కలిగించాలి మరియు హతుని కుటుంబీకులకు (వారసులకు) రక్తపరిహారం (దియత్) కూడా చెల్లించాలి. వారు క్షమిస్తే అది వారికి దానం (సదఖ) అవుతుంది! కాని ఒకవేళ వధింపబడిన వాడు విశ్వాసి అయి, మీ శత్రువులలో చేరిన వాడై ఉంటే, ఒక విశ్వాస బానిసకు విముక్తి కలిగించాలి. ఒకవేళ (వధింప బడిన వాడు) - మీరు ఒడంబడిక చేసుకొని వున్న జనులకు చెందిన వాడైతే - రక్త పరిహారం అతని కుటుంబీకులకు (వారసులకు) ఇవ్వాలి. మరియు ఒక విశ్వాస (ముస్లిం) బానిసకు విముక్తి కలిగించాలి. (బానిసకు విముక్తి కలిగించే) శక్తిలేని వాడు, వరుసగా రెండు నెలలు ఉపవాసాలు ఉండాలి. అల్లాహ్ ముందు పశ్చాత్తాప పడటానికి (ఇదే సరైన పద్ధతి). అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు

❮ Previous Next ❯

ترجمة: وما كان لمؤمن أن يقتل مؤمنا إلا خطأ ومن قتل مؤمنا خطأ, باللغة التيلجو

﴿وما كان لمؤمن أن يقتل مؤمنا إلا خطأ ومن قتل مؤمنا خطأ﴾ [النِّسَاء: 92]

Abdul Raheem Mohammad Moulana
Mariyu - porapatuga tappa - oka visvasi maroka visvasini campatam tagani pani (nisid'dham). Mariyu oka visvasini porapatuga campina vadu (daniki pariharanga) atadu oka visvasi banisaku vimukti kaligincali mariyu hatuni kutumbikulaku (varasulaku) raktapariharam (diyat) kuda cellincali. Varu ksamiste adi variki danam (sadakha) avutundi! Kani okavela vadhimpabadina vadu visvasi ayi, mi satruvulalo cerina vadai unte, oka visvasa banisaku vimukti kaligincali. Okavela (vadhimpa badina vadu) - miru odambadika cesukoni vunna janulaku cendina vadaite - rakta pariharam atani kutumbikulaku (varasulaku) ivvali. Mariyu oka visvasa (muslim) banisaku vimukti kaligincali. (Banisaku vimukti kaligince) saktileni vadu, varusaga rendu nelalu upavasalu undali. Allah mundu pascattapa padataniki (ide saraina pad'dhati). Allah sarvajnudu, maha vivecanaparudu
Abdul Raheem Mohammad Moulana
Mariyu - porapāṭugā tappa - oka viśvāsi maroka viśvāsini campaṭaṁ tagani pani (niṣid'dhaṁ). Mariyu oka viśvāsini porapāṭugā campina vāḍu (dāniki parihāraṅgā) ataḍu oka viśvāsi bānisaku vimukti kaligin̄cāli mariyu hatuni kuṭumbīkulaku (vārasulaku) raktaparihāraṁ (diyat) kūḍā cellin̄cāli. Vāru kṣamistē adi vāriki dānaṁ (sadakha) avutundi! Kāni okavēḷa vadhimpabaḍina vāḍu viśvāsi ayi, mī śatruvulalō cērina vāḍai uṇṭē, oka viśvāsa bānisaku vimukti kaligin̄cāli. Okavēḷa (vadhimpa baḍina vāḍu) - mīru oḍambaḍika cēsukoni vunna janulaku cendina vāḍaitē - rakta parihāraṁ atani kuṭumbīkulaku (vārasulaku) ivvāli. Mariyu oka viśvāsa (musliṁ) bānisaku vimukti kaligin̄cāli. (Bānisaku vimukti kaligin̄cē) śaktilēni vāḍu, varusagā reṇḍu nelalu upavāsālu uṇḍāli. Allāh mundu paścāttāpa paḍaṭāniki (idē saraina pad'dhati). Allāh sarvajñuḍu, mahā vivēcanāparuḍu
Muhammad Aziz Ur Rehman
ఒక విశ్వాసి మరో విశ్వాసిని చంపటం ఎంతమాత్రం తగదు. పొరపాటున జరిగితే అది వేరే విషయం. ఎవరయినా పొరపాటున ఒక ముస్లింను చంపితే దానికి పరిహారంగా ఒక ముస్లిం బానిసను బానిసత్వం నుంచి విడిపించాలి. ఇంకా హతుని కుటుంబీకులకు రక్త పరిహారం చెల్లించాలి. ఒకవేళ వారు క్షమాభిక్షపెడితే అది వేరే విషయం. కాని చంపబడిన వ్యక్తి, శత్రు వర్గానికి చెందినవాడై, అతను ముస్లిం కూడా అయి వుంటే అట్టి పరిస్థితిలో ఒక్క ముస్లిం బానిసకు విముక్తి నొసగాలి. ఒకవేళ హతుడు మీతో ఒడంబడిక చేసుకున్న జాతికి చెందినవాడైనపుడు రక్త పరిహారాన్ని అతని కుటుంబీకులకు చెల్లించి తీరాలి. (దాంతో పాటు) ఒక ముస్లిం బానిసను కూడా స్వతంత్రుడ్ని చేయాలి. బానిసకు విముక్తి నొసగే స్థోమత లేనివారు ఎడతెగకుండా రెండు మాసాలు ఉపవాసం ఉండాలి. అల్లాహ్‌ నుంచి క్షమాభిక్ష పొందటానికి (ఈ పద్ధతి సూచించబడింది). అల్లాహ్‌ అన్నీ తెలిసినవాడు, వివేచనా పరుడూను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek