×

ఓ విశ్వాసులారా! మీలో ఎవరికైనా మరణ సమయం ఆసన్నమైతే, మీరు వీలునామా వ్రాసేటప్పుడు, మీలో న్యాయవర్తులైన 5:106 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:106) ayat 106 in Telugu

5:106 Surah Al-Ma’idah ayat 106 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 106 - المَائدة - Page - Juz 7

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ شَهَٰدَةُ بَيۡنِكُمۡ إِذَا حَضَرَ أَحَدَكُمُ ٱلۡمَوۡتُ حِينَ ٱلۡوَصِيَّةِ ٱثۡنَانِ ذَوَا عَدۡلٖ مِّنكُمۡ أَوۡ ءَاخَرَانِ مِنۡ غَيۡرِكُمۡ إِنۡ أَنتُمۡ ضَرَبۡتُمۡ فِي ٱلۡأَرۡضِ فَأَصَٰبَتۡكُم مُّصِيبَةُ ٱلۡمَوۡتِۚ تَحۡبِسُونَهُمَا مِنۢ بَعۡدِ ٱلصَّلَوٰةِ فَيُقۡسِمَانِ بِٱللَّهِ إِنِ ٱرۡتَبۡتُمۡ لَا نَشۡتَرِي بِهِۦ ثَمَنٗا وَلَوۡ كَانَ ذَا قُرۡبَىٰ وَلَا نَكۡتُمُ شَهَٰدَةَ ٱللَّهِ إِنَّآ إِذٗا لَّمِنَ ٱلۡأٓثِمِينَ ﴾
[المَائدة: 106]

ఓ విశ్వాసులారా! మీలో ఎవరికైనా మరణ సమయం ఆసన్నమైతే, మీరు వీలునామా వ్రాసేటప్పుడు, మీలో న్యాయవర్తులైన ఇద్దరు వ్యక్తులను సాక్షులుగా తీసుకోండి. ఒకవేళ మీరు ప్రయాణ స్థితిలో ఉండి, అక్కడ మీకు మరణ ఆపద సంభవిస్తే, మీ వారు (ముస్లింలు లేకుంటే) ఇతరులను ఎవరినైనా ఇద్దరిని (సాక్షులుగా) తీసుకోవచ్చు. ఆ ఇద్దరినీ నమాజ్ తరువాత ఆపుకోండి. మీకు సందేహముంటే, వారిద్దరూ అల్లాహ్ పై ప్రమాణం చేసి ఇలా అనాలి: "మా దగ్గరి బంధువు కొరకైనా సరే మేము స్వార్థం కొరకు మా సాక్ష్యాన్ని అమ్మము. మేము అల్లాహ్ కొరకు ఇచ్చే సాక్ష్యాన్ని దాచము. మేము ఆ విధంగా చేస్తే నిశ్చయంగా, పాపాత్ములలో లెక్కింప బడుదుము గాక

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا شهادة بينكم إذا حضر أحدكم الموت حين الوصية اثنان, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا شهادة بينكم إذا حضر أحدكم الموت حين الوصية اثنان﴾ [المَائدة: 106]

Abdul Raheem Mohammad Moulana
O visvasulara! Milo evarikaina marana samayam asannamaite, miru vilunama vrasetappudu, milo n'yayavartulaina iddaru vyaktulanu saksuluga tisukondi. Okavela miru prayana sthitilo undi, akkada miku marana apada sambhaviste, mi varu (muslinlu lekunte) itarulanu evarinaina iddarini (saksuluga) tisukovaccu. A iddarini namaj taruvata apukondi. Miku sandehamunte, variddaru allah pai pramanam cesi ila anali: "Ma daggari bandhuvu korakaina sare memu svartham koraku ma saksyanni am'mamu. Memu allah koraku icce saksyanni dacamu. Memu a vidhanga ceste niscayanga, papatmulalo lekkimpa badudumu gaka
Abdul Raheem Mohammad Moulana
Ō viśvāsulārā! Mīlō evarikainā maraṇa samayaṁ āsannamaitē, mīru vīlunāmā vrāsēṭappuḍu, mīlō n'yāyavartulaina iddaru vyaktulanu sākṣulugā tīsukōṇḍi. Okavēḷa mīru prayāṇa sthitilō uṇḍi, akkaḍa mīku maraṇa āpada sambhavistē, mī vāru (muslinlu lēkuṇṭē) itarulanu evarinainā iddarini (sākṣulugā) tīsukōvaccu. Ā iddarinī namāj taruvāta āpukōṇḍi. Mīku sandēhamuṇṭē, vāriddarū allāh pai pramāṇaṁ cēsi ilā anāli: "Mā daggari bandhuvu korakainā sarē mēmu svārthaṁ koraku mā sākṣyānni am'mamu. Mēmu allāh koraku iccē sākṣyānni dācamu. Mēmu ā vidhaṅgā cēstē niścayaṅgā, pāpātmulalō lekkimpa baḍudumu gāka
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! మీలో ఎవరికయినా మరణ సమయం దగ్గరపడి, అతడు విల్లు చెప్పదలచినప్పుడు మీలోని ఇద్దరు వ్యక్తులు సాక్షులుగా ఉండటం భావ్యం. ఆ ఇద్దరు వ్యక్తులూ ధర్మచింతన గలవారై ఉండాలి. (వారు మీ వారై ఉండాలి). లేదా మీరు ప్రయాణావస్థలో ఉండి, మీకు మరణ విపత్తు దాపురిస్తే అన్యులిద్దరిని కూడా సాక్షులుగా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు అనుమానం కలిగితే నమాజు అనంతరం ఆ ఇద్దరినీ ఆపుకోండి. మరి వారిద్దరూ దేవునిపై ప్రమాణం చేసి ఇలా చెప్పాలి: “మేము స్వప్రయోజనం కోసం ప్రమాణాలను అమ్ముకునేవాళ్ళం కాము. (మేము సాక్ష్యమిచ్చే వ్యక్తి) మా బంధువు అయినాసరే (మేము నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తాము). అల్లాహ్‌ యొక్క సాక్ష్యాన్ని మేము దాచి పెట్టము. ఒకవేళ మేమలా చేస్తే ఘోరమైన పాపానికి పాల్పడిన వారమవుతాము.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek