×

ఏమీ? నీకు తెలియదా (చూడటం లేదా)? రహస్య సమాలోచనల్ని నిషేధించటం జరిగినప్పటికీ! వారు - నిషేధింపబడిన 58:8 Telugu translation

Quran infoTeluguSurah Al-Mujadilah ⮕ (58:8) ayat 8 in Telugu

58:8 Surah Al-Mujadilah ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mujadilah ayat 8 - المُجَادلة - Page - Juz 28

﴿أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ نُهُواْ عَنِ ٱلنَّجۡوَىٰ ثُمَّ يَعُودُونَ لِمَا نُهُواْ عَنۡهُ وَيَتَنَٰجَوۡنَ بِٱلۡإِثۡمِ وَٱلۡعُدۡوَٰنِ وَمَعۡصِيَتِ ٱلرَّسُولِۖ وَإِذَا جَآءُوكَ حَيَّوۡكَ بِمَا لَمۡ يُحَيِّكَ بِهِ ٱللَّهُ وَيَقُولُونَ فِيٓ أَنفُسِهِمۡ لَوۡلَا يُعَذِّبُنَا ٱللَّهُ بِمَا نَقُولُۚ حَسۡبُهُمۡ جَهَنَّمُ يَصۡلَوۡنَهَاۖ فَبِئۡسَ ٱلۡمَصِيرُ ﴾
[المُجَادلة: 8]

ఏమీ? నీకు తెలియదా (చూడటం లేదా)? రహస్య సమాలోచనల్ని నిషేధించటం జరిగినప్పటికీ! వారు - నిషేధింపబడిన దానినే - మళ్ళీ చేస్తున్నారని? మరియు వారు రహస్యంగా పాపం చేయడం - హద్దులు మీరి ప్రవర్తించడం మరియు ప్రవక్త ఆజ్ఞలను ఉల్లంఘించడం గురించి - సమాలోచనలు చేస్తున్నారని! (ఓ ముహమ్మద్!) నీ వద్దకు వచ్చినపుడు, అల్లాహ్ కూడా నీకు సలాం చేయని విధంగా, వారు నీకు సలాం చేస్తూ, తమలో తాము ఇలా అనుకుంటారు: "మేము పలికే మాటలకు, అల్లాహ్ మమ్మల్ని ఎందుకు శిక్షించటం లేదు?" వారికి నరకమే చాలు, వారందులో ప్రవేశిస్తారు. ఎంత ఘోరమైన గమ్యస్థానం

❮ Previous Next ❯

ترجمة: ألم تر إلى الذين نهوا عن النجوى ثم يعودون لما نهوا عنه, باللغة التيلجو

﴿ألم تر إلى الذين نهوا عن النجوى ثم يعودون لما نهوا عنه﴾ [المُجَادلة: 8]

Abdul Raheem Mohammad Moulana
Emi? Niku teliyada (cudatam leda)? Rahasya samalocanalni nisedhincatam jariginappatiki! Varu - nisedhimpabadina danine - malli cestunnarani? Mariyu varu rahasyanga papam ceyadam - haddulu miri pravartincadam mariyu pravakta ajnalanu ullanghincadam gurinci - samalocanalu cestunnarani! (O muham'mad!) Ni vaddaku vaccinapudu, allah kuda niku salam ceyani vidhanga, varu niku salam cestu, tamalo tamu ila anukuntaru: "Memu palike matalaku, allah mam'malni enduku siksincatam ledu?" Variki narakame calu, varandulo pravesistaru. Enta ghoramaina gamyasthanam
Abdul Raheem Mohammad Moulana
Ēmī? Nīku teliyadā (cūḍaṭaṁ lēdā)? Rahasya samālōcanalni niṣēdhin̄caṭaṁ jariginappaṭikī! Vāru - niṣēdhimpabaḍina dāninē - maḷḷī cēstunnārani? Mariyu vāru rahasyaṅgā pāpaṁ cēyaḍaṁ - haddulu mīri pravartin̄caḍaṁ mariyu pravakta ājñalanu ullaṅghin̄caḍaṁ gurin̄ci - samālōcanalu cēstunnārani! (Ō muham'mad!) Nī vaddaku vaccinapuḍu, allāh kūḍā nīku salāṁ cēyani vidhaṅgā, vāru nīku salāṁ cēstū, tamalō tāmu ilā anukuṇṭāru: "Mēmu palikē māṭalaku, allāh mam'malni enduku śikṣin̄caṭaṁ lēdu?" Vāriki narakamē cālu, vārandulō pravēśistāru. Enta ghōramaina gamyasthānaṁ
Muhammad Aziz Ur Rehman
రహస్య మంతనాలు జరపరాదని వారించబడినవారిని నీవు చూడలేదా? అయినాసరే వారు వారింపబడిన దానికే మళ్ళి పాల్పడుతున్నారు. వారు పాపం, అత్యాచారం, ప్రవక్త పట్ల అవిధేయతలకు సంబంధించిన రహస్య మంతనాలను సాగిస్తున్నారు. వారు నీ దగ్గరకు వచ్చినపుడు, అల్లాహ్ నీకు ఏ పదజాలంతో సలాం చెయ్యలేదో ఆ పదజాలంతో నీకు సలాం చేస్తారు. పైపెచ్చు, “మనం పలికే ఈ మాటలపై అల్లాహ్ మనల్ని ఎందుకు శిక్షించటం లేదు?!” అని లోలోపలే చెప్పుకుంటారు. వారికి నరకం (యాతన) సరిపోతుంది. వారు అందులోకి ప్రవేశిస్తారు. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek