Quran with Telugu translation - Surah Al-hashr ayat 9 - الحَشر - Page - Juz 28
﴿وَٱلَّذِينَ تَبَوَّءُو ٱلدَّارَ وَٱلۡإِيمَٰنَ مِن قَبۡلِهِمۡ يُحِبُّونَ مَنۡ هَاجَرَ إِلَيۡهِمۡ وَلَا يَجِدُونَ فِي صُدُورِهِمۡ حَاجَةٗ مِّمَّآ أُوتُواْ وَيُؤۡثِرُونَ عَلَىٰٓ أَنفُسِهِمۡ وَلَوۡ كَانَ بِهِمۡ خَصَاصَةٞۚ وَمَن يُوقَ شُحَّ نَفۡسِهِۦ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡمُفۡلِحُونَ ﴾
[الحَشر: 9]
﴿والذين تبوءوا الدار والإيمان من قبلهم يحبون من هاجر إليهم ولا يجدون﴾ [الحَشر: 9]
Abdul Raheem Mohammad Moulana mariyu evaraite - i (valasa vaccinavaru) rakapurvame - visvasinci valasa kendram (madina)lo nivasistu undevaro! Variki kuda hakku vundi. Varu tama vaddaku valasa vaccina varini premistaru. Mariyu varu (valasa vaccina) variki edi ivvabadina! Dani avasaram tamaku unnatlu bhavincaru. Mariyu tamaku avasaramunna variki tama sonta (avasarala) mida pradhan'yatanistaru. Mariyu evaraite atmalobham nundi raksimpa badataro! Alanti varu, vare! Saphalyam pondevaru |
Abdul Raheem Mohammad Moulana mariyu evaraitē - ī (valasa vaccinavāru) rākapūrvamē - viśvasin̄ci valasa kēndraṁ (madīnā)lō nivasistū uṇḍēvārō! Vāriki kūḍā hakku vundi. Vāru tama vaddaku valasa vaccina vārini prēmistāru. Mariyu vāru (valasa vaccina) vāriki ēdi ivvabaḍinā! Dāni avasaraṁ tamaku unnaṭlu bhāvin̄caru. Mariyu tamaku avasaramunnā vāriki tama sonta (avasarāla) mīda prādhān'yatanistāru. Mariyu evaraitē atmalōbhaṁ nuṇḍi rakṣimpa baḍatārō! Alāṇṭi vāru, vārē! Sāphalyaṁ pondēvāru |
Muhammad Aziz Ur Rehman ఇకపోతే వీరికంటే ముందే ఈ ప్రదేశం (మదీనా)లోనూ, విశ్వాసంలోనూ స్థానికులై ఉన్నవారు (వారికి కూడా ఈ సొమ్ము వర్తిస్తుంది); వారు ఇల్లూ వాకిలిని వదలి తమ వైపుకు వలస వచ్చే ముహాజిర్లను ప్రేమిస్తారు. వారికి ఏమి ఇవ్వబడినా దానిపై తమ అంతర్యాలలో ఏ కాస్త అసూయను కూడా రానివ్వరు. తాము అమిత అవసరంలో ఉన్నప్పటికీ తమపైన వారికే ప్రాధాన్యతనిస్తారు. వాస్తవానికి తమ స్వార్థ ప్రియత్వం (పేరాశ) నుండి రక్షించబడినవారే కృతార్థులు |