×

మరియు ఆయనే ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు తరువాత దాని ద్వారా మేము సర్వలోకాల వృక్షకోటిని 6:99 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:99) ayat 99 in Telugu

6:99 Surah Al-An‘am ayat 99 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 99 - الأنعَام - Page - Juz 7

﴿وَهُوَ ٱلَّذِيٓ أَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَأَخۡرَجۡنَا بِهِۦ نَبَاتَ كُلِّ شَيۡءٖ فَأَخۡرَجۡنَا مِنۡهُ خَضِرٗا نُّخۡرِجُ مِنۡهُ حَبّٗا مُّتَرَاكِبٗا وَمِنَ ٱلنَّخۡلِ مِن طَلۡعِهَا قِنۡوَانٞ دَانِيَةٞ وَجَنَّٰتٖ مِّنۡ أَعۡنَابٖ وَٱلزَّيۡتُونَ وَٱلرُّمَّانَ مُشۡتَبِهٗا وَغَيۡرَ مُتَشَٰبِهٍۗ ٱنظُرُوٓاْ إِلَىٰ ثَمَرِهِۦٓ إِذَآ أَثۡمَرَ وَيَنۡعِهِۦٓۚ إِنَّ فِي ذَٰلِكُمۡ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يُؤۡمِنُونَ ﴾
[الأنعَام: 99]

మరియు ఆయనే ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు తరువాత దాని ద్వారా మేము సర్వలోకాల వృక్షకోటిని ఉద్భవింపజేశాము. మరియు దాని నుండి మేము పచ్చని పైరును పండించాము. వాటిలో దట్టమైన గింజలను పుట్టించాము. మరియు ఖర్జూరపు చెట్ల గెలల నుండి క్రిందికి వ్రేలాడుతున్న పండ్ల గుత్తులను, ద్రాక్ష, జైతూన్ మరియు దానిమ్మ తోటలను (పుట్టించాము). వాటిలో కొన్ని ఒకదాని నొకటి పోలి ఉంటాయి, మరికొన్ని ఒకదాని నొకటి పోలి ఉండవు. ఫలించినప్పుడు వాటి ఫలాలను మరియు వాటి పరిపక్వాన్ని గమనించండి. నిశ్చయంగా, వీటిలో విశ్వసించే వారికి సూచనలున్నాయి

❮ Previous Next ❯

ترجمة: وهو الذي أنـزل من السماء ماء فأخرجنا به نبات كل شيء فأخرجنا, باللغة التيلجو

﴿وهو الذي أنـزل من السماء ماء فأخرجنا به نبات كل شيء فأخرجنا﴾ [الأنعَام: 99]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayane akasam nundi varsanni kuripincadu taruvata dani dvara memu sarvalokala vrksakotini udbhavimpajesamu. Mariyu dani nundi memu paccani pairunu pandincamu. Vatilo dattamaina ginjalanu puttincamu. Mariyu kharjurapu cetla gelala nundi krindiki vreladutunna pandla guttulanu, draksa, jaitun mariyu danim'ma totalanu (puttincamu). Vatilo konni okadani nokati poli untayi, marikonni okadani nokati poli undavu. Phalincinappudu vati phalalanu mariyu vati paripakvanni gamanincandi. Niscayanga, vitilo visvasince variki sucanalunnayi
Abdul Raheem Mohammad Moulana
mariyu āyanē ākāśaṁ nuṇḍi varṣānni kuripin̄cāḍu taruvāta dāni dvārā mēmu sarvalōkāla vr̥kṣakōṭini udbhavimpajēśāmu. Mariyu dāni nuṇḍi mēmu paccani pairunu paṇḍin̄cāmu. Vāṭilō daṭṭamaina gin̄jalanu puṭṭin̄cāmu. Mariyu kharjūrapu ceṭla gelala nuṇḍi krindiki vrēlāḍutunna paṇḍla guttulanu, drākṣa, jaitūn mariyu dānim'ma tōṭalanu (puṭṭin̄cāmu). Vāṭilō konni okadāni nokaṭi pōli uṇṭāyi, marikonni okadāni nokaṭi pōli uṇḍavu. Phalin̄cinappuḍu vāṭi phalālanu mariyu vāṭi paripakvānni gamanin̄caṇḍi. Niścayaṅgā, vīṭilō viśvasin̄cē vāriki sūcanalunnāyi
Muhammad Aziz Ur Rehman
ఇంకా – ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించినవాడు ఆయనే. ఆ తరువాత దాని ద్వారా మేము అన్నిరకాల మొక్కల్ని వెలికి తీశాము. ఆపైన మేము పచ్చని కొమ్మను సృజించాము. దాని ద్వారా మేము ఒకదానిపై ఒకటి పేరుకుని ఉన్న గింజలు గల పంటల్ని పండిస్తాము. ఖర్జూర చెట్ల నుంచి, అంటే వాటి పాళి నుండి క్రిందికి వ్రేలాడే పండ్ల గెలలను, ద్రాక్ష తోటలను, జైతూనును (ఆలివ్‌ పండ్లను), దానిమ్మ కాయలను ఉత్పన్నం చేశాము. వాటిలో కొన్ని ఒక దానిని ఇంకొకటి పోలి ఉంటాయి. మరికొన్ని పోలి ఉండవు. ప్రతి చెట్టుకు కాసినకాయ పెరిగి పెద్దదవుతున్నప్పుడు, అది పండుతున్నప్పుడు కాస్త నిశిత దృష్టితో చూడండి! నమ్మేవారి కోసం వీటిలో నిదర్శనాలున్నాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek