Quran with Telugu translation - Surah Al-Mumtahanah ayat 4 - المُمتَحنَة - Page - Juz 28
﴿قَدۡ كَانَتۡ لَكُمۡ أُسۡوَةٌ حَسَنَةٞ فِيٓ إِبۡرَٰهِيمَ وَٱلَّذِينَ مَعَهُۥٓ إِذۡ قَالُواْ لِقَوۡمِهِمۡ إِنَّا بُرَءَٰٓؤُاْ مِنكُمۡ وَمِمَّا تَعۡبُدُونَ مِن دُونِ ٱللَّهِ كَفَرۡنَا بِكُمۡ وَبَدَا بَيۡنَنَا وَبَيۡنَكُمُ ٱلۡعَدَٰوَةُ وَٱلۡبَغۡضَآءُ أَبَدًا حَتَّىٰ تُؤۡمِنُواْ بِٱللَّهِ وَحۡدَهُۥٓ إِلَّا قَوۡلَ إِبۡرَٰهِيمَ لِأَبِيهِ لَأَسۡتَغۡفِرَنَّ لَكَ وَمَآ أَمۡلِكُ لَكَ مِنَ ٱللَّهِ مِن شَيۡءٖۖ رَّبَّنَا عَلَيۡكَ تَوَكَّلۡنَا وَإِلَيۡكَ أَنَبۡنَا وَإِلَيۡكَ ٱلۡمَصِيرُ ﴾
[المُمتَحنَة: 4]
﴿قد كانت لكم أسوة حسنة في إبراهيم والذين معه إذ قالوا لقومهم﴾ [المُمتَحنَة: 4]
Abdul Raheem Mohammad Moulana Vastavaniki ibrahim mariyu atanito unna varilo mi koraku oka manci adarsam undi. Varu tama jati varito ila annappudu: "Niscayanga, allah nu vadali miru aradhince vatito mariyu mito, maku elanti sambandham ledu. Memu mim'malni tyajincamu mariyu miru advitiyudaina allah nu visvasincananta varaku, maku miku madhya virodham mariyu dvesam untundi." Ika ibrahim tana tandrito: "Nenu tappaka ninnu ksamincamani (na prabhuvunu) vedukuntanu. Idi tappa, ni koraku allah nundi maremi ponde adhikaram naku ledu." Ani matrame anagaligadu. (Allah to ila prarthincadu): "O na prabhu! Memu ninne nam'mukunnamu mariyu ni vaipunake pascattapanto maralutunnamu mariyu ni vaipuke ma gamyasthanamundi |
Abdul Raheem Mohammad Moulana Vāstavāniki ibrāhīm mariyu atanitō unna vārilō mī koraku oka man̄ci ādarśaṁ undi. Vāru tama jāti vāritō ilā annappuḍu: "Niścayaṅgā, allāh nu vadali mīru ārādhin̄cē vāṭitō mariyu mītō, māku elāṇṭi sambandhaṁ lēdu. Mēmu mim'malni tyajin̄cāmu mariyu mīru advitīyuḍaina allāh nu viśvasin̄cananta varaku, mākū mīkū madhya virōdhaṁ mariyu dvēṣaṁ uṇṭundi." Ika ibrāhīm tana taṇḍritō: "Nēnu tappaka ninnu kṣamin̄camani (nā prabhuvunu) vēḍukuṇṭānu. Idi tappa, nī koraku allāh nuṇḍi marēmī pondē adhikāraṁ nāku lēdu." Ani mātramē anagaligāḍu. (Allāh tō ilā prārthin̄cāḍu): "Ō nā prabhū! Mēmu ninnē nam'mukunnāmu mariyu nī vaipunakē paścāttāpantō maralutunnāmu mariyu nī vaipukē mā gamyasthānamundi |
Muhammad Aziz Ur Rehman (ఓ ముస్లిములారా!) మీకు ఇబ్రాహీములోనూ, అతని వెంటనున్న వారిలోనూ అత్యుత్తమమైన ఆదర్శం ఉంది. వారంతా తమ జాతి వారితో స్పష్టంగా ఇలా చెప్పేశారు : “మీతోనూ, అల్లాహ్ ను వదలి మీరు పూజించే వారందరితోనూ మాకెలాంటి సంబంధం లేదు. మేము మిమ్మల్ని (మీ మిథ్య విశ్వాసాలను) తిరస్కరిస్తున్నాము. ఒకే ఒక్కడైన అల్లాహ్ ను మీరు విశ్వసించనంత వరకూ, మాకూ – మీకూ మధ్య శాశ్వతంగా విరోధం, వైషమ్యం ఏర్పడినట్లే.” అయితే ఇబ్రాహీము తన తండ్రితో, “(నాన్న!) నేను మీ మన్నింపు కోసం తప్పకుండా ప్రార్ధిస్తాను. (కాని) మీ విషయంలో నేను అల్లాహ్ సమక్షంలో అంతకంటే ఎక్కువ ఏమీ చేయలేను” అన్న మాట మాత్రం (వినయింపుతో కూడుకున్నది) – (ఇంకా వారిలా వేడుకున్నారు, “మా ప్రభూ! మేము నిన్నే నమ్ముకున్నాము. నీ వైపుకే మరలుతున్నాము. (ఎట్టకేలకు) నిన్నే చేరుకోవలసి ఉంది |