×

నిశ్చయంగా, మీ ప్రభువైన అల్లాహ్ యే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) 7:54 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:54) ayat 54 in Telugu

7:54 Surah Al-A‘raf ayat 54 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 54 - الأعرَاف - Page - Juz 8

﴿إِنَّ رَبَّكُمُ ٱللَّهُ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ فِي سِتَّةِ أَيَّامٖ ثُمَّ ٱسۡتَوَىٰ عَلَى ٱلۡعَرۡشِۖ يُغۡشِي ٱلَّيۡلَ ٱلنَّهَارَ يَطۡلُبُهُۥ حَثِيثٗا وَٱلشَّمۡسَ وَٱلۡقَمَرَ وَٱلنُّجُومَ مُسَخَّرَٰتِۭ بِأَمۡرِهِۦٓۗ أَلَا لَهُ ٱلۡخَلۡقُ وَٱلۡأَمۡرُۗ تَبَارَكَ ٱللَّهُ رَبُّ ٱلۡعَٰلَمِينَ ﴾
[الأعرَاف: 54]

నిశ్చయంగా, మీ ప్రభువైన అల్లాహ్ యే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించాడు. ఆ పిదప తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్ఠించాడు. ఆయన రాత్రిని పగటి వెంట ఎడతెగకుండా అనుసరింపజేసి, దానిపై (పగటిపై) కప్పుతూ ఉంటాడు. మరియు సూర్యచంద్ర, నక్షత్రాలు ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. నిశ్చయంగా, సర్వసృష్టి ఆయనదే! మరియు ఆజ్ఞ నడిచేది ఆయనదే. అల్లాహ్ ఎంతో శుభదాయకుడు, సర్వ లోకాలకు పోషకుడు

❮ Previous Next ❯

ترجمة: إن ربكم الله الذي خلق السموات والأرض في ستة أيام ثم استوى, باللغة التيلجو

﴿إن ربكم الله الذي خلق السموات والأرض في ستة أيام ثم استوى﴾ [الأعرَاف: 54]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, mi prabhuvaina allah ye akasalanu mariyu bhumini aru dinamulalo (ayyam lalo) srstincadu. A pidapa tana sinhasananni (ars nu) adhisthincadu. Ayana ratrini pagati venta edategakunda anusarimpajesi, danipai (pagatipai) kapputu untadu. Mariyu suryacandra, naksatralu ayana ajnaku kattubadi unnayi. Niscayanga, sarvasrsti ayanade! Mariyu ajna nadicedi ayanade. Allah ento subhadayakudu, sarva lokalaku posakudu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, mī prabhuvaina allāh yē ākāśālanu mariyu bhūmini āru dinamulalō (ayyām lalō) sr̥ṣṭin̄cāḍu. Ā pidapa tana sinhāsanānni (arṣ nu) adhiṣṭhin̄cāḍu. Āyana rātrini pagaṭi veṇṭa eḍategakuṇḍā anusarimpajēsi, dānipai (pagaṭipai) kapputū uṇṭāḍu. Mariyu sūryacandra, nakṣatrālu āyana ājñaku kaṭṭubaḍi unnāyi. Niścayaṅgā, sarvasr̥ṣṭi āyanadē! Mariyu ājña naḍicēdi āyanadē. Allāh entō śubhadāyakuḍu, sarva lōkālaku pōṣakuḍu
Muhammad Aziz Ur Rehman
నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై (అర్ష్‌పై) ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌ అపారమైన శుభాలు కలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek