×

మదీనా పురవాసులకు మరియు చుట్టుప్రక్కలలో ఉండే ఎడారి వాసులకు (బద్దూలకు) అల్లాహ్ ప్రవక్తను వదలి వెనుక 9:120 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:120) ayat 120 in Telugu

9:120 Surah At-Taubah ayat 120 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 120 - التوبَة - Page - Juz 11

﴿مَا كَانَ لِأَهۡلِ ٱلۡمَدِينَةِ وَمَنۡ حَوۡلَهُم مِّنَ ٱلۡأَعۡرَابِ أَن يَتَخَلَّفُواْ عَن رَّسُولِ ٱللَّهِ وَلَا يَرۡغَبُواْ بِأَنفُسِهِمۡ عَن نَّفۡسِهِۦۚ ذَٰلِكَ بِأَنَّهُمۡ لَا يُصِيبُهُمۡ ظَمَأٞ وَلَا نَصَبٞ وَلَا مَخۡمَصَةٞ فِي سَبِيلِ ٱللَّهِ وَلَا يَطَـُٔونَ مَوۡطِئٗا يَغِيظُ ٱلۡكُفَّارَ وَلَا يَنَالُونَ مِنۡ عَدُوّٖ نَّيۡلًا إِلَّا كُتِبَ لَهُم بِهِۦ عَمَلٞ صَٰلِحٌۚ إِنَّ ٱللَّهَ لَا يُضِيعُ أَجۡرَ ٱلۡمُحۡسِنِينَ ﴾
[التوبَة: 120]

మదీనా పురవాసులకు మరియు చుట్టుప్రక్కలలో ఉండే ఎడారి వాసులకు (బద్దూలకు) అల్లాహ్ ప్రవక్తను వదలి వెనుక ఉండి పోవటం మరియు తమ ప్రాణాలకు అతని (దైవప్రవక్త) ప్రాణాలపై ఆధిక్యత నివ్వటం తగిన పని కాదు. ఎందుకంటే అల్లాహ్ మార్గంలో వారు ఆకలి దప్పులు, (శారీరక) కష్టాలు సహిస్తే, శత్రువుల భూమిలోకి దూరి సత్యతిరస్కారుల కోపాన్ని రేకెత్తిస్తే మరియు శత్రువుల నుండి ఏదైనా సాధిస్తే, దానికి బదులుగా వారికి ఒక సత్కార్యం వ్రాయబడకుండా ఉండదు. నిశ్చయంగా అల్లాహ్ సజ్జనుల ఫలితాన్ని వ్యర్థ పరచడు

❮ Previous Next ❯

ترجمة: ما كان لأهل المدينة ومن حولهم من الأعراب أن يتخلفوا عن رسول, باللغة التيلجو

﴿ما كان لأهل المدينة ومن حولهم من الأعراب أن يتخلفوا عن رسول﴾ [التوبَة: 120]

Abdul Raheem Mohammad Moulana
madina puravasulaku mariyu cuttuprakkalalo unde edari vasulaku (baddulaku) allah pravaktanu vadali venuka undi povatam mariyu tama pranalaku atani (daivapravakta) pranalapai adhikyata nivvatam tagina pani kadu. Endukante allah marganlo varu akali dappulu, (sariraka) kastalu sahiste, satruvula bhumiloki duri satyatiraskarula kopanni rekettiste mariyu satruvula nundi edaina sadhiste, daniki baduluga variki oka satkaryam vrayabadakunda undadu. Niscayanga allah sajjanula phalitanni vyartha paracadu
Abdul Raheem Mohammad Moulana
madīnā puravāsulaku mariyu cuṭṭuprakkalalō uṇḍē eḍāri vāsulaku (baddūlaku) allāh pravaktanu vadali venuka uṇḍi pōvaṭaṁ mariyu tama prāṇālaku atani (daivapravakta) prāṇālapai ādhikyata nivvaṭaṁ tagina pani kādu. Endukaṇṭē allāh mārganlō vāru ākali dappulu, (śārīraka) kaṣṭālu sahistē, śatruvula bhūmilōki dūri satyatiraskārula kōpānni rēkettistē mariyu śatruvula nuṇḍi ēdainā sādhistē, dāniki badulugā vāriki oka satkāryaṁ vrāyabaḍakuṇḍā uṇḍadu. Niścayaṅgā allāh sajjanula phalitānni vyartha paracaḍu
Muhammad Aziz Ur Rehman
దైవప్రవక్తను విడిచి వెనుక ఉండి పోవటం మదీనాలో నివసించే వారికి గానీ, చుట్టుప్రక్కల నివసించే పల్లెటూరి వాళ్ళకుగానీ ఏ మాత్రం శోభాయమానం కాదు. తమ ప్రాణాలను ఆయన ప్రాణంకన్నా మిన్నగా భావించటం కూడా వారికి తగదు. ఎందుకంటే దైవమార్గంలో వారికి దాహం అయినా, అలసట కలిగినా, ఆకలైనా, అవిశ్వాసులను కోపం తెప్పించే స్థలం గుండా వారు సాగిపోయినా, శత్రువుల సంగతి చూసుకున్నా- వాటన్నింటిపై వారి పేర సత్కార్యం లిఖించబడుతుంది. ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్‌ సద్వర్తనుల పుణ్యఫలాన్ని వృధా కానివ్వడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek