×

మరియు వారందరూ అల్లాహ్ ముందు హాజరు పరచబడి నప్పుడు, (ఇహలోకంలో) బలహీనులుగా ఉన్నవారు గొప్పవారిగా ఉన్న 14:21 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:21) ayat 21 in Telugu

14:21 Surah Ibrahim ayat 21 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 21 - إبراهِيم - Page - Juz 13

﴿وَبَرَزُواْ لِلَّهِ جَمِيعٗا فَقَالَ ٱلضُّعَفَٰٓؤُاْ لِلَّذِينَ ٱسۡتَكۡبَرُوٓاْ إِنَّا كُنَّا لَكُمۡ تَبَعٗا فَهَلۡ أَنتُم مُّغۡنُونَ عَنَّا مِنۡ عَذَابِ ٱللَّهِ مِن شَيۡءٖۚ قَالُواْ لَوۡ هَدَىٰنَا ٱللَّهُ لَهَدَيۡنَٰكُمۡۖ سَوَآءٌ عَلَيۡنَآ أَجَزِعۡنَآ أَمۡ صَبَرۡنَا مَا لَنَا مِن مَّحِيصٖ ﴾
[إبراهِيم: 21]

మరియు వారందరూ అల్లాహ్ ముందు హాజరు పరచబడి నప్పుడు, (ఇహలోకంలో) బలహీనులుగా ఉన్నవారు గొప్పవారిగా ఉన్న వారితో అంటారు: "వాస్తవానికి ప్రపంచంలో మేము మిమ్మల్ని అనుసరించాము, ఇపుడు మీరు మమ్మల్ని అల్లాహ్ శిక్ష నుండి కాపాడటానికి ఏమైనా చేయగలరా?" వారంటారు: "అల్లాహ్ మాకు సన్మార్గం చూపి ఉంటే మేము మీకు కూడా (సన్మార్గం) చూపి ఉండేవారం. ఇపుడు మనం దుఃఖపడినా లేదా సహనం వహించినా అంతా ఒక్కటే! మనకిప్పుడు తప్పించుకునే మార్గం ఏదీ లేదు

❮ Previous Next ❯

ترجمة: وبرزوا لله جميعا فقال الضعفاء للذين استكبروا إنا كنا لكم تبعا فهل, باللغة التيلجو

﴿وبرزوا لله جميعا فقال الضعفاء للذين استكبروا إنا كنا لكم تبعا فهل﴾ [إبراهِيم: 21]

Abdul Raheem Mohammad Moulana
mariyu varandaru allah mundu hajaru paracabadi nappudu, (ihalokanlo) balahinuluga unnavaru goppavariga unna varito antaru: "Vastavaniki prapancanlo memu mim'malni anusarincamu, ipudu miru mam'malni allah siksa nundi kapadataniki emaina ceyagalara?" Varantaru: "Allah maku sanmargam cupi unte memu miku kuda (sanmargam) cupi undevaram. Ipudu manam duhkhapadina leda sahanam vahincina anta okkate! Manakippudu tappincukune margam edi ledu
Abdul Raheem Mohammad Moulana
mariyu vārandarū allāh mundu hājaru paracabaḍi nappuḍu, (ihalōkanlō) balahīnulugā unnavāru goppavārigā unna vāritō aṇṭāru: "Vāstavāniki prapan̄canlō mēmu mim'malni anusarin̄cāmu, ipuḍu mīru mam'malni allāh śikṣa nuṇḍi kāpāḍaṭāniki ēmainā cēyagalarā?" Vāraṇṭāru: "Allāh māku sanmārgaṁ cūpi uṇṭē mēmu mīku kūḍā (sanmārgaṁ) cūpi uṇḍēvāraṁ. Ipuḍu manaṁ duḥkhapaḍinā lēdā sahanaṁ vahin̄cinā antā okkaṭē! Manakippuḍu tappin̄cukunē mārgaṁ ēdī lēdu
Muhammad Aziz Ur Rehman
వారంతా అల్లాహ్‌కు ఎదురుగా నిలబడతారు. అప్పుడు బలహీనులు, (ప్రపంచంలో) పెద్ద మనుషులుగా చెలామణి అయినవారిని ఉద్దేశించి, “మేము (ఒకప్పుడు) మీకు అనుయాయులుగా ఉండేవాళ్ళం. మరి మీరు ఇప్పుడు మా నుంచి దైవశిక్షలలో ఏ కొంచెమైనా శిక్షను తొలగించగలరా?” అని అడుగుతారు. దానికి వారు ఇలా సమాధానమిస్తారు : “అల్లాహ్‌ గనక మాకు సన్మార్గం చూపి ఉంటే మేము కూడా తప్పకుండా మీకు మార్గదర్శకత్వం వహించి ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం అసహనాన్ని ప్రదర్శించినా, సహనం వహించినా ఒక్కటే. మనకిక తప్పించుకునే మార్గం ఏదీ లేదు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek