Quran with Telugu translation - Surah Ibrahim ayat 22 - إبراهِيم - Page - Juz 13
﴿وَقَالَ ٱلشَّيۡطَٰنُ لَمَّا قُضِيَ ٱلۡأَمۡرُ إِنَّ ٱللَّهَ وَعَدَكُمۡ وَعۡدَ ٱلۡحَقِّ وَوَعَدتُّكُمۡ فَأَخۡلَفۡتُكُمۡۖ وَمَا كَانَ لِيَ عَلَيۡكُم مِّن سُلۡطَٰنٍ إِلَّآ أَن دَعَوۡتُكُمۡ فَٱسۡتَجَبۡتُمۡ لِيۖ فَلَا تَلُومُونِي وَلُومُوٓاْ أَنفُسَكُمۖ مَّآ أَنَا۠ بِمُصۡرِخِكُمۡ وَمَآ أَنتُم بِمُصۡرِخِيَّ إِنِّي كَفَرۡتُ بِمَآ أَشۡرَكۡتُمُونِ مِن قَبۡلُۗ إِنَّ ٱلظَّٰلِمِينَ لَهُمۡ عَذَابٌ أَلِيمٞ ﴾
[إبراهِيم: 22]
﴿وقال الشيطان لما قضي الأمر إن الله وعدكم وعد الحق ووعدتكم فأخلفتكم﴾ [إبراهِيم: 22]
Abdul Raheem Mohammad Moulana mariyu tirpu jarigina taruvata saitanu (varito) antadu: "Niscayanga, allah miku cesina vagdaname satyamaina vagdanam. Mariyu nenu miku vagdanam cesi danini bhangam cesanu. Mariyu naku mipai elanti adhikaram undedi kadu; nenu kevalam mim'malni ahvanincanu, miru svikarincaru. Kavuna miru nannu nindincakandi mim'malni mire nindincukondi. Nenu miku sahayam ceyalenu mariyu miru naku sahayam ceyaleru. Intaku mundu miru nannu (allah ku) satiga kalpincina danni niscayanga nenu tiraskaristunnanu. Niscayanga, durmargulaku badhakaramaina siksa untundi |
Abdul Raheem Mohammad Moulana mariyu tīrpu jarigina taruvāta ṣaitānu (vāritō) aṇṭāḍu: "Niścayaṅgā, allāh mīku cēsina vāgdānamē satyamaina vāgdānaṁ. Mariyu nēnu mīku vāgdānaṁ cēsi dānini bhaṅgaṁ cēśānu. Mariyu nāku mīpai elāṇṭi adhikāraṁ uṇḍēdi kādu; nēnu kēvalaṁ mim'malni āhvānin̄cānu, mīru svīkarin̄cāru. Kāvuna mīru nannu nindin̄cakaṇḍi mim'malni mīrē nindin̄cukōṇḍi. Nēnu mīku sahāyaṁ cēyalēnu mariyu mīrū nāku sahāyaṁ cēyalēru. Intaku mundu mīru nannu (allāh ku) sāṭigā kalpin̄cina dānni niścayaṅgā nēnu tiraskaristunnānu. Niścayaṅgā, durmārgulaku bādhākaramaina śikṣa uṇṭundi |
Muhammad Aziz Ur Rehman సమస్త వ్యవహారంపై తీర్పు జరిగిపోయిన తరువాత షైతాన్ ఇలా అంటాడు: “అల్లాహ్ మీకు సత్యబద్ధమైన వాగ్దానం చేశాడు. నేను మాత్రం మీకు చేసిన వాగ్దానాలకు విరుద్ధంగా ప్రవర్తించాను. నాకు మీపై ఎలాంటి అధికారమూ లేదు. కాకపోతే, నేను మీకు పిలుపునిచ్చాను. మీరు నా మాటను అంగీకరించారు. కాబట్టి మీరు (ఇప్పుడు) నన్ను నిందించకండి; మిమ్మల్ని మీరే నిందించుకోండి. మీ మొరలను నేను ఆలకించ లేను. నా మొరను మీరూ ఆలకించలేరు. ఇంతకు మునుపు మీరు నన్ను దైవత్వంలో భాగస్థునిగా నిలబెట్టారన్న విషయాన్ని నేను ఎంత మాత్రం ఒప్పుకోను. నిశ్చయంగా అటువంటి దుర్మార్గుల కోసం వ్యధాభరితమైన శిక్ష ఉంది.” |