×

మరియు (ఓ ప్రవక్తా!) ఎవరు ఆయన ముఖ దర్శనం (ప్రసన్నతను) కోరుతూ, ఉదయం మరియు సాయంత్రం 18:28 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:28) ayat 28 in Telugu

18:28 Surah Al-Kahf ayat 28 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 28 - الكَهف - Page - Juz 15

﴿وَٱصۡبِرۡ نَفۡسَكَ مَعَ ٱلَّذِينَ يَدۡعُونَ رَبَّهُم بِٱلۡغَدَوٰةِ وَٱلۡعَشِيِّ يُرِيدُونَ وَجۡهَهُۥۖ وَلَا تَعۡدُ عَيۡنَاكَ عَنۡهُمۡ تُرِيدُ زِينَةَ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۖ وَلَا تُطِعۡ مَنۡ أَغۡفَلۡنَا قَلۡبَهُۥ عَن ذِكۡرِنَا وَٱتَّبَعَ هَوَىٰهُ وَكَانَ أَمۡرُهُۥ فُرُطٗا ﴾
[الكَهف: 28]

మరియు (ఓ ప్రవక్తా!) ఎవరు ఆయన ముఖ దర్శనం (ప్రసన్నతను) కోరుతూ, ఉదయం మరియు సాయంత్రం తమ ప్రభువును ప్రార్థిస్తున్నారో, వారి సహచర్యంలోనే సహనం వహించి ఉండు. ఇహలోక ఆడంబరాలను అపేక్షించి నీ దృష్టిని వారి నుండి దాటనివ్వకు (వారిని ఉపేక్షించకు). మరియు అలాంటి వానిని అనుసరించకు (మాట వినకు), ఎవడి హృదయాన్ని మా ధ్యానం నుండి తొలగించామో మరియు ఎవడు తన మనోవాంఛలను అనుసరిస్తున్నాడో మరియు ఎవడి వ్యవహారాలు (కర్మలు) వ్యర్థమయ్యాయో

❮ Previous Next ❯

ترجمة: واصبر نفسك مع الذين يدعون ربهم بالغداة والعشي يريدون وجهه ولا تعد, باللغة التيلجو

﴿واصبر نفسك مع الذين يدعون ربهم بالغداة والعشي يريدون وجهه ولا تعد﴾ [الكَهف: 28]

Abdul Raheem Mohammad Moulana
mariyu (o pravakta!) Evaru ayana mukha darsanam (prasannatanu) korutu, udayam mariyu sayantram tama prabhuvunu prarthistunnaro, vari sahacaryanlone sahanam vahinci undu. Ihaloka adambaralanu apeksinci ni drstini vari nundi datanivvaku (varini upeksincaku). Mariyu alanti vanini anusarincaku (mata vinaku), evadi hrdayanni ma dhyanam nundi tolagincamo mariyu evadu tana manovanchalanu anusaristunnado mariyu evadi vyavaharalu (karmalu) vyarthamayyayo
Abdul Raheem Mohammad Moulana
mariyu (ō pravaktā!) Evaru āyana mukha darśanaṁ (prasannatanu) kōrutū, udayaṁ mariyu sāyantraṁ tama prabhuvunu prārthistunnārō, vāri sahacaryanlōnē sahanaṁ vahin̄ci uṇḍu. Ihalōka āḍambarālanu apēkṣin̄ci nī dr̥ṣṭini vāri nuṇḍi dāṭanivvaku (vārini upēkṣin̄caku). Mariyu alāṇṭi vānini anusarin̄caku (māṭa vinaku), evaḍi hr̥dayānni mā dhyānaṁ nuṇḍi tolagin̄cāmō mariyu evaḍu tana manōvān̄chalanu anusaristunnāḍō mariyu evaḍi vyavahārālu (karmalu) vyarthamayyāyō
Muhammad Aziz Ur Rehman
తమ ప్రభువును ఉదయం, సాయంత్రం వేడుకుంటూ, ఆయన ప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో ఉన్నవారి సహచర్యం పట్ల నీ మనసును సంతృప్త పరచుకో. జాగ్రత్త! వారి నుంచి నీ దృష్టిని మరల్చుకోకు. ప్రాపంచిక జీవితపు అందాలను నీవు కోరుకుంటావేమో! చూడు! ఎవరి హృదయాన్ని మేము మా ధ్యానం పట్ల నిర్లక్ష్యానికి లోనుచేశామో, ఎవడు తన మనోవాంఛల వెనుక పరుగులు తీస్తున్నాడో, ఎవడి పనితీరు మితిమీరిపోయిందో అతనికి విధేయత చూపకు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek