Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 221 - البَقَرَة - Page - Juz 2
﴿وَلَا تَنكِحُواْ ٱلۡمُشۡرِكَٰتِ حَتَّىٰ يُؤۡمِنَّۚ وَلَأَمَةٞ مُّؤۡمِنَةٌ خَيۡرٞ مِّن مُّشۡرِكَةٖ وَلَوۡ أَعۡجَبَتۡكُمۡۗ وَلَا تُنكِحُواْ ٱلۡمُشۡرِكِينَ حَتَّىٰ يُؤۡمِنُواْۚ وَلَعَبۡدٞ مُّؤۡمِنٌ خَيۡرٞ مِّن مُّشۡرِكٖ وَلَوۡ أَعۡجَبَكُمۡۗ أُوْلَٰٓئِكَ يَدۡعُونَ إِلَى ٱلنَّارِۖ وَٱللَّهُ يَدۡعُوٓاْ إِلَى ٱلۡجَنَّةِ وَٱلۡمَغۡفِرَةِ بِإِذۡنِهِۦۖ وَيُبَيِّنُ ءَايَٰتِهِۦ لِلنَّاسِ لَعَلَّهُمۡ يَتَذَكَّرُونَ ﴾
[البَقَرَة: 221]
﴿ولا تنكحوا المشركات حتى يؤمن ولأمة مؤمنة خير من مشركة ولو أعجبتكم﴾ [البَقَرَة: 221]
Abdul Raheem Mohammad Moulana mariyu musrik strilu, visvasincananta varaku, miru varini vivahamadakandi, musrik stri miku enta naccina, ame kante visvasuralaina oka banisa stri ento melainadi. Mariyu musrik purusulu visvasincananta varaku mi strilato vari vivaham ceyincakandi. Mariyu musrik purusudu miku enta naccina, atadi kante visvasi ayina oka banisa ento melainavadu. Ilanti varu (musrikin) mim'malni agni vaipunaku ahvanistunnaru. Kani allah! Tana anumatito, mim'malni svargam vaipunaku mariyu ksamabhiksa pondataniki pilustunnadu. Mariyu i vidhanga ayana tana sucanalanu prajalaku - bahusa varu gunapatham nercukuntarani - spastanga teluputunnadu |
Abdul Raheem Mohammad Moulana mariyu muṣrik strīlu, viśvasin̄cananta varaku, mīru vārini vivāhamāḍakaṇḍi, muṣrik strī mīku enta naccinā, āme kaṇṭē viśvāsurālaina oka bānisa strī entō mēlainadi. Mariyu muṣrik puruṣulu viśvasin̄cananta varaku mī strīlatō vāri vivāhaṁ cēyin̄cakaṇḍi. Mariyu muṣrik puruṣuḍu mīku enta naccinā, ataḍi kaṇṭē viśvāsi ayina oka bānisa entō mēlainavāḍu. Ilāṇṭi vāru (muṣrikīn) mim'malni agni vaipunaku āhvānistunnāru. Kāni allāh! Tana anumatitō, mim'malni svargaṁ vaipunaku mariyu kṣamābhikṣa pondaṭāniki pilustunnāḍu. Mariyu ī vidhaṅgā āyana tana sūcanalanu prajalaku - bahuśā vāru guṇapāṭhaṁ nērcukuṇṭārani - spaṣṭaṅgā teluputunnāḍu |
Muhammad Aziz Ur Rehman దైవానికి భాగస్వామ్యం కల్పించే స్త్రీలు విశ్వసించి ముస్లింలు కానంతవరకూ మీరు వారిని వివాహమాడకండి. దైవానికి భాగస్వామ్యం కల్పించే స్వతంత్ర స్త్రీ మీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమెకన్నా అల్లాహ్‌ను విశ్వసించే ఒక బానిస స్త్రీ ఎంతో ఉత్తమురాలు. (అలాగే) షిర్కుకు ఒడిగట్టే పురుషులు విశ్వసించనంతవరకూ మీ స్త్రీలను వారి వివాహ బంధంలోకి ఇవ్వకండి. ఎందుకంటే షిర్కుకు పాల్పడే పురుషుడు మీకు నచ్చినప్పటికీ అతనికంటే విశ్వసించిన ఒక బానిస పురుషుడు ఎన్నో రెట్లు నయం. వీరు (మిమ్మల్ని) నరకం వైపుకు పిలుస్తున్నారు. కాని అల్లాహ్ తన అనుజ్ఞతో స్వర్గం వైపునకూ, క్షమాభిక్ష వైపునకూ పిలుస్తున్నాడు. ప్రజలు గుణపాఠం నేర్చుకునేందుకుగాను ఆయన తన ఆయతులను విడమరచి మరీ చెబుతున్నాడు |