Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 61 - البَقَرَة - Page - Juz 1
﴿وَإِذۡ قُلۡتُمۡ يَٰمُوسَىٰ لَن نَّصۡبِرَ عَلَىٰ طَعَامٖ وَٰحِدٖ فَٱدۡعُ لَنَا رَبَّكَ يُخۡرِجۡ لَنَا مِمَّا تُنۢبِتُ ٱلۡأَرۡضُ مِنۢ بَقۡلِهَا وَقِثَّآئِهَا وَفُومِهَا وَعَدَسِهَا وَبَصَلِهَاۖ قَالَ أَتَسۡتَبۡدِلُونَ ٱلَّذِي هُوَ أَدۡنَىٰ بِٱلَّذِي هُوَ خَيۡرٌۚ ٱهۡبِطُواْ مِصۡرٗا فَإِنَّ لَكُم مَّا سَأَلۡتُمۡۗ وَضُرِبَتۡ عَلَيۡهِمُ ٱلذِّلَّةُ وَٱلۡمَسۡكَنَةُ وَبَآءُو بِغَضَبٖ مِّنَ ٱللَّهِۚ ذَٰلِكَ بِأَنَّهُمۡ كَانُواْ يَكۡفُرُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ وَيَقۡتُلُونَ ٱلنَّبِيِّـۧنَ بِغَيۡرِ ٱلۡحَقِّۚ ذَٰلِكَ بِمَا عَصَواْ وَّكَانُواْ يَعۡتَدُونَ ﴾
[البَقَرَة: 61]
﴿وإذ قلتم ياموسى لن نصبر على طعام واحد فادع لنا ربك يخرج﴾ [البَقَرَة: 61]
Abdul Raheem Mohammad Moulana Mariyu appudu miru: "O musa!Memu oke rakamaina aharam tintu undalemu. Kavuna bhumilo utpatti ayye aku kuralu, dosakayalu (kuragayalu), vellulli (godhumalu), ulligaddalu, pappu dinusulu modalainavi ma koraku pandincamani ni prabhuvunu prarthincu." Ani annaru. Danikatanu: "Emi? Sresthamaina daniki baduluga alpamaina danini korukuntunnara? (Alagayite) miru edaina nagaraniki tirigipondi. Niscayanga, akkada miku, miru koredanta dorukutundi!" Ani annadu. Mariyu varu, tivra avamanam mariyu daridryaniki gurayyaru. Mariyu varu allah agrahaniki gurayyaru. Adanta vastavaniki varu allah sucana (ayatu) lanu tiraskarincina dani mariyu pravaktalanu an'yayanga campina dani phalitam. Idanta varu cesina ajnollanghana mariyu haddulu miri pravartincina dani paryavasanam |
Abdul Raheem Mohammad Moulana Mariyu appuḍu mīru: "Ō mūsā!Mēmu okē rakamaina āhāraṁ tiṇṭū uṇḍalēmu. Kāvuna bhūmilō utpatti ayyē āku kūralu, dōsakāyalu (kūragāyalu), vellulli (gōdhumalu), ulligaḍḍalu, pappu dinusulu modalainavi mā koraku paṇḍin̄camani nī prabhuvunu prārthin̄cu." Ani annāru. Dānikatanu: "Ēmī? Śrēṣṭhamaina dāniki badulugā alpamaina dānini kōrukuṇṭunnārā? (Alāgayitē) mīru ēdainā nagarāniki tirigipoṇḍi. Niścayaṅgā, akkaḍa mīku, mīru kōrēdantā dorukutundi!" Ani annāḍu. Mariyu vāru, tīvra avamānaṁ mariyu dāridryāniki gurayyāru. Mariyu vāru allāh āgrahāniki gurayyāru. Adantā vāstavāniki vāru allāh sūcana (āyatu) lanu tiraskarin̄cina dāni mariyu pravaktalanu an'yāyaṅgā campina dāni phalitaṁ. Idantā vāru cēsina ājñōllaṅghana mariyu haddulu mīri pravartin̄cina dāni paryavasānaṁ |
Muhammad Aziz Ur Rehman (జ్ఞాపకం చేసుకోండి,) “ఓ మూసా! ఒకే రకమైన తిండిని మేము అస్సలు సహించము. అందుకే భూమిలో పండే ఆకుకూరలు, దోసకాయలు, గోధుమలు, పప్పుదినుసులు, ఉల్లిపాయలు ప్రసాదించవలసినదిగా నీ ప్రభువును ప్రార్థించు” అని మీరు డిమాండు చేసినప్పుడు అతనిలా అన్నాడు: “మీరు శ్రేష్ఠమైన వస్తువుకు బదులుగా అధమమైన దానిని కోరుకుంటున్నారెందుకు? (సరే!) ఏదయినా పట్టణానికి వెళ్ళండి. అక్కడ మీరు కోరుకున్నవన్నీ మీకు లభిస్తాయి.” దాంతో వారిపై పరాభవం, దారిద్య్రం రుద్దబడింది. వారు దైవాగ్రహానికి గురై తరలిపోయారు. వారి ఈ దురవస్థకు కారణమేమిటంటే వారు అల్లాహ్ ఆయతుల పట్ల తిరస్కార వైఖరిని అవలంబించేవారు, అన్యాయంగా ప్రవక్తలను చంపేవారు. ఇది వారి అవిధేయతకు, బరితెగించిన పోకడకు పర్యవసానం మాత్రమే |