×

అప్పుడు ఈ దుఃఖం తరువాత ఆయన (అల్లాహ్) మీపై శాంతి భద్రతలను అవతరింపజేశాడు; దాని వల్ల 3:154 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:154) ayat 154 in Telugu

3:154 Surah al-‘Imran ayat 154 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 154 - آل عِمران - Page - Juz 4

﴿ثُمَّ أَنزَلَ عَلَيۡكُم مِّنۢ بَعۡدِ ٱلۡغَمِّ أَمَنَةٗ نُّعَاسٗا يَغۡشَىٰ طَآئِفَةٗ مِّنكُمۡۖ وَطَآئِفَةٞ قَدۡ أَهَمَّتۡهُمۡ أَنفُسُهُمۡ يَظُنُّونَ بِٱللَّهِ غَيۡرَ ٱلۡحَقِّ ظَنَّ ٱلۡجَٰهِلِيَّةِۖ يَقُولُونَ هَل لَّنَا مِنَ ٱلۡأَمۡرِ مِن شَيۡءٖۗ قُلۡ إِنَّ ٱلۡأَمۡرَ كُلَّهُۥ لِلَّهِۗ يُخۡفُونَ فِيٓ أَنفُسِهِم مَّا لَا يُبۡدُونَ لَكَۖ يَقُولُونَ لَوۡ كَانَ لَنَا مِنَ ٱلۡأَمۡرِ شَيۡءٞ مَّا قُتِلۡنَا هَٰهُنَاۗ قُل لَّوۡ كُنتُمۡ فِي بُيُوتِكُمۡ لَبَرَزَ ٱلَّذِينَ كُتِبَ عَلَيۡهِمُ ٱلۡقَتۡلُ إِلَىٰ مَضَاجِعِهِمۡۖ وَلِيَبۡتَلِيَ ٱللَّهُ مَا فِي صُدُورِكُمۡ وَلِيُمَحِّصَ مَا فِي قُلُوبِكُمۡۚ وَٱللَّهُ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ ﴾
[آل عِمران: 154]

అప్పుడు ఈ దుఃఖం తరువాత ఆయన (అల్లాహ్) మీపై శాంతి భద్రతలను అవతరింపజేశాడు; దాని వల్ల మీలో కొందరికి కునుకుపాటు ఆవరించింది. కాని మరికొందరు - కేవలం స్వంత ప్రాణాలకు ప్రాముఖ్యత నిచ్చేవారు, అల్లాహ్ ను గురించి పామరుల వంటి తప్పుడు ఊహలు చేసేవారు - ఇలా అన్నారు: "ఏమీ? ఈ వ్యవహారంలో మాకు ఏమైనా భాగముందా?" వారితో ఇలా అను: "నిశ్చయంగా, సమస్త వ్యవహారాలపై సర్వాధికారం అల్లాహ్ దే!" వారు తమ హృదయాలలో దాచుకున్న దానిని నీకు వ్యక్తం చేయటం లేదు. వారు ఇంకా ఇలా అంటారు: "మాకు అధికారమే ఉండి వుంటే, మేము ఇక్కడు చంపబడి ఉండేవారము కాదు." వారికి ఇలా జవాబివ్వు: "ఒకవేళ మీరు మీ ఇళ్ళలోనే ఉండి వున్నప్పటికీ, మరణం వ్రాయబడి ఉన్నవారు స్వయంగా తమ వధ్య స్థానాలకు తరలి వచ్చేవారు." మరియు అల్లాహ్ మీ గుండెలలో దాగి వున్న దానిని పరీక్షించటానికి మరియు మీ హృదయాలను పరిశుద్ధ పరచటానికి ఇలా చేశాడు. మరియు హృదయాలలో (దాగి) ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: ثم أنـزل عليكم من بعد الغم أمنة نعاسا يغشى طائفة منكم وطائفة, باللغة التيلجو

﴿ثم أنـزل عليكم من بعد الغم أمنة نعاسا يغشى طائفة منكم وطائفة﴾ [آل عِمران: 154]

Abdul Raheem Mohammad Moulana
Appudu i duhkham taruvata ayana (allah) mipai santi bhadratalanu avatarimpajesadu; dani valla milo kondariki kunukupatu avarincindi. Kani marikondaru - kevalam svanta pranalaku pramukhyata niccevaru, allah nu gurinci pamarula vanti tappudu uhalu cesevaru - ila annaru: "Emi? I vyavaharanlo maku emaina bhagamunda?" Varito ila anu: "Niscayanga, samasta vyavaharalapai sarvadhikaram allah de!" Varu tama hrdayalalo dacukunna danini niku vyaktam ceyatam ledu. Varu inka ila antaru: "Maku adhikarame undi vunte, memu ikkadu campabadi undevaramu kadu." Variki ila javabivvu: "Okavela miru mi illalone undi vunnappatiki, maranam vrayabadi unnavaru svayanga tama vadhya sthanalaku tarali vaccevaru." Mariyu allah mi gundelalo dagi vunna danini pariksincataniki mariyu mi hrdayalanu parisud'dha paracataniki ila cesadu. Mariyu hrdayalalo (dagi) unnadanta allah ku baga telusu
Abdul Raheem Mohammad Moulana
Appuḍu ī duḥkhaṁ taruvāta āyana (allāh) mīpai śānti bhadratalanu avatarimpajēśāḍu; dāni valla mīlō kondariki kunukupāṭu āvarin̄cindi. Kāni marikondaru - kēvalaṁ svanta prāṇālaku prāmukhyata niccēvāru, allāh nu gurin̄ci pāmarula vaṇṭi tappuḍu ūhalu cēsēvāru - ilā annāru: "Ēmī? Ī vyavahāranlō māku ēmainā bhāgamundā?" Vāritō ilā anu: "Niścayaṅgā, samasta vyavahārālapai sarvādhikāraṁ allāh dē!" Vāru tama hr̥dayālalō dācukunna dānini nīku vyaktaṁ cēyaṭaṁ lēdu. Vāru iṅkā ilā aṇṭāru: "Māku adhikāramē uṇḍi vuṇṭē, mēmu ikkaḍu campabaḍi uṇḍēvāramu kādu." Vāriki ilā javābivvu: "Okavēḷa mīru mī iḷḷalōnē uṇḍi vunnappaṭikī, maraṇaṁ vrāyabaḍi unnavāru svayaṅgā tama vadhya sthānālaku tarali vaccēvāru." Mariyu allāh mī guṇḍelalō dāgi vunna dānini parīkṣin̄caṭāniki mariyu mī hr̥dayālanu pariśud'dha paracaṭāniki ilā cēśāḍu. Mariyu hr̥dayālalō (dāgi) unnadantā allāh ku bāgā telusu
Muhammad Aziz Ur Rehman
మరి ఈ దుఃఖం తరువాత ఆయన శాంతియుత స్థితిని మీపై అవతరింపజేశాడు. దాంతో మీలోని ఒక వర్గం వారిపై కునుకు ఆవహించసాగింది. అయితే మరోవర్గం వారు తమ ప్రాణరక్షణ గురించి తీవ్ర విచారంలో పడిపోయారు. వారు అల్లాహ్‌ యెడల మరీ అజ్ఞానంతో కూడిన, సత్యదూరమైన సందేహాలను, అనుమానాలను వ్యక్తపరచసాగారు. ”ఇంతకీ మాకంటూ ఏదన్నా అధికారం ఉందా?” అని వారనేవారు. ”దీనికి సంబంధించిన నిర్ణయాధికారం అంతా అల్లాహ్‌దే” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. వారు తమ ఆంతర్యాల్లో అణచి పెట్టుకున్న విషయాలను నీ ముందు వెలిబుచ్చటం లేదు. ”మాకంటూ అధికారమేదైనా ఉండి ఉంటే మేమిలా హత మార్చబడి ఉండేవాళ్ళం కాము” అని వారంటున్నారు. (అంటే తమ మనుషులు చంపబడేవారు కాదు అని వారి అభిప్రాయం). ”ఒకవేళ మీరు మీ ఇండ్లల్లోనే ఉన్నప్పటికీ, వధించబడటం అన్నది మీకు రాసిపెట్టి ఉంటే మీ అంతట మీరే వధ్యస్థలాలకు వచ్చి తీర్తారు” అని వారికి చెప్పు. మీ మనసుల్లో దాగి ఉన్న వాటిని పరికించేందుకు, మీ హృదయాలలో వున్న దానిని శుద్ధి చేసేందుకు (అల్లాహ్‌ ఈ పరిస్థితులను ఉత్పన్నం చేశాడు). అల్లాహ్‌ గుండెల్లోని గుట్టును బాగా ఎరిగినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek