×

అప్పుడు సమాధానంగా వారి ప్రభువు, వారితో ఇలా అంటాడు: "మీలో పురుషులు గానీ, స్త్రీలు గానీ 3:195 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:195) ayat 195 in Telugu

3:195 Surah al-‘Imran ayat 195 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 195 - آل عِمران - Page - Juz 4

﴿فَٱسۡتَجَابَ لَهُمۡ رَبُّهُمۡ أَنِّي لَآ أُضِيعُ عَمَلَ عَٰمِلٖ مِّنكُم مِّن ذَكَرٍ أَوۡ أُنثَىٰۖ بَعۡضُكُم مِّنۢ بَعۡضٖۖ فَٱلَّذِينَ هَاجَرُواْ وَأُخۡرِجُواْ مِن دِيَٰرِهِمۡ وَأُوذُواْ فِي سَبِيلِي وَقَٰتَلُواْ وَقُتِلُواْ لَأُكَفِّرَنَّ عَنۡهُمۡ سَيِّـَٔاتِهِمۡ وَلَأُدۡخِلَنَّهُمۡ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ ثَوَابٗا مِّنۡ عِندِ ٱللَّهِۚ وَٱللَّهُ عِندَهُۥ حُسۡنُ ٱلثَّوَابِ ﴾
[آل عِمران: 195]

అప్పుడు సమాధానంగా వారి ప్రభువు, వారితో ఇలా అంటాడు: "మీలో పురుషులు గానీ, స్త్రీలు గానీ చేసిన కర్మలను నేను వ్యర్థం కానివ్వను. మీరందరూ ఒకరికొకరు (సమానులు). కనుక నా కొరకు, తమ దేశాన్ని విడిచి పెట్టి వలస పోయినవారు, తమ గృహాల నుండి తరిమి వేయబడి (నిరాశ్రయులై, దేశదిమ్మరులై), నా మార్గంలో పలుకష్టాలు పడినవారు మరియు నా కొరకు పోరాడినవారు మరియు చంపబడినవారు; నిశ్చయంగా, ఇలాంటి వారందరి చెడులను వారి నుండి తుడిచి వేస్తాను. మరియు నిశ్చయంగా, వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రేవశింపజేస్తాను; ఇది అల్లాహ్ వద్ద వారికి లభించే ప్రతిఫలం. మరియు అల్లాహ్! ఆయన వద్దనే ఉత్తమ ప్రతిఫలం ఉంది

❮ Previous Next ❯

ترجمة: فاستجاب لهم ربهم أني لا أضيع عمل عامل منكم من ذكر أو, باللغة التيلجو

﴿فاستجاب لهم ربهم أني لا أضيع عمل عامل منكم من ذكر أو﴾ [آل عِمران: 195]

Abdul Raheem Mohammad Moulana
Appudu samadhananga vari prabhuvu, varito ila antadu: "Milo purusulu gani, strilu gani cesina karmalanu nenu vyartham kanivvanu. Mirandaru okarikokaru (samanulu). Kanuka na koraku, tama desanni vidici petti valasa poyinavaru, tama grhala nundi tarimi veyabadi (nirasrayulai, desadim'marulai), na marganlo palukastalu padinavaru mariyu na koraku poradinavaru mariyu campabadinavaru; niscayanga, ilanti varandari cedulanu vari nundi tudici vestanu. Mariyu niscayanga, varini krinda kaluvalu pravahince svargavanalalo prevasimpajestanu; idi allah vadda variki labhince pratiphalam. Mariyu allah! Ayana vaddane uttama pratiphalam undi
Abdul Raheem Mohammad Moulana
Appuḍu samādhānaṅgā vāri prabhuvu, vāritō ilā aṇṭāḍu: "Mīlō puruṣulu gānī, strīlu gānī cēsina karmalanu nēnu vyarthaṁ kānivvanu. Mīrandarū okarikokaru (samānulu). Kanuka nā koraku, tama dēśānni viḍici peṭṭi valasa pōyinavāru, tama gr̥hāla nuṇḍi tarimi vēyabaḍi (nirāśrayulai, dēśadim'marulai), nā mārganlō palukaṣṭālu paḍinavāru mariyu nā koraku pōrāḍinavāru mariyu campabaḍinavāru; niścayaṅgā, ilāṇṭi vārandari ceḍulanu vāri nuṇḍi tuḍici vēstānu. Mariyu niścayaṅgā, vārini krinda kāluvalu pravahin̄cē svargavanālalō prēvaśimpajēstānu; idi allāh vadda vāriki labhin̄cē pratiphalaṁ. Mariyu allāh! Āyana vaddanē uttama pratiphalaṁ undi
Muhammad Aziz Ur Rehman
వారి ప్రభువు వారి మొరను ఆలకించి ఆమోదించాడు: ”మీలో పని చేసేవారి పనిని – వారు పురుషులైనా సరే, స్త్రీలయినాసరే – నేను వృధా చేయను. మీరు పరస్పరం ఒకే కోవకు చెందినవారు. కాబట్టి తమ స్వస్థలం వదలి వలస వెళ్ళినవారు (హిజ్రత్‌ చేసినవారు), తమ ఇళ్ళనుంచి వెళ్లగొట్ట బడినవారు, నా మార్గంలో వేధింపులకు గురైనవారు, నా మార్గంలో పోరాడి చంపబడినవారు – అటువంటి వారి చెడుగులను వారి నుంచి దూరం చేస్తాను. క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలో వారిని ప్రవేశింపజేస్తాను. ఇదీ అల్లాహ్‌ తరఫున వారికి లభించే పుణ్యఫలం. అల్లాహ్‌ వద్దనే అత్యుత్తమమయిన పుణ్యఫలం ఉంది” అని సెలవిచ్చాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek