×

(వాస్తవానికి) సత్యాన్ని తిరస్కరించి, మిమ్మల్ని మస్జిద్ అల్ హరామ్ కు పోకుండా నిరోధించి, బలి (ఖుర్బానీ) 48:25 Telugu translation

Quran infoTeluguSurah Al-Fath ⮕ (48:25) ayat 25 in Telugu

48:25 Surah Al-Fath ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Fath ayat 25 - الفَتح - Page - Juz 26

﴿هُمُ ٱلَّذِينَ كَفَرُواْ وَصَدُّوكُمۡ عَنِ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِ وَٱلۡهَدۡيَ مَعۡكُوفًا أَن يَبۡلُغَ مَحِلَّهُۥۚ وَلَوۡلَا رِجَالٞ مُّؤۡمِنُونَ وَنِسَآءٞ مُّؤۡمِنَٰتٞ لَّمۡ تَعۡلَمُوهُمۡ أَن تَطَـُٔوهُمۡ فَتُصِيبَكُم مِّنۡهُم مَّعَرَّةُۢ بِغَيۡرِ عِلۡمٖۖ لِّيُدۡخِلَ ٱللَّهُ فِي رَحۡمَتِهِۦ مَن يَشَآءُۚ لَوۡ تَزَيَّلُواْ لَعَذَّبۡنَا ٱلَّذِينَ كَفَرُواْ مِنۡهُمۡ عَذَابًا أَلِيمًا ﴾
[الفَتح: 25]

(వాస్తవానికి) సత్యాన్ని తిరస్కరించి, మిమ్మల్ని మస్జిద్ అల్ హరామ్ కు పోకుండా నిరోధించి, బలి (ఖుర్బానీ) జంతువులను వాటిని బలి చేసే స్థలానికి చేరనివ్వకుండా ఆపింది వారే కదా! ఒకవేళ వారిలో విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు లేకుంటే - ఎవరిని గురించైతే మీకు తెలియదో - వారిని మీరు త్రొక్కివేసి ఉండేవారు. దాని వలన మీరు - మీకు తెలియకుండానే - పాపానికి గురి అయ్యేవారు. అల్లాహ్ తాను కోరిన వారిని తన కారుణ్యంలోనికి తీసుకుంటాడు. ఒకవేళ వారు (విశ్వాసులు) వారి నుండి వేరుగా ఉండి ఉంటే, మేము తప్పక వారిలోని సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష విధించి ఉండేవారము

❮ Previous Next ❯

ترجمة: هم الذين كفروا وصدوكم عن المسجد الحرام والهدي معكوفا أن يبلغ محله, باللغة التيلجو

﴿هم الذين كفروا وصدوكم عن المسجد الحرام والهدي معكوفا أن يبلغ محله﴾ [الفَتح: 25]

Abdul Raheem Mohammad Moulana
(vastavaniki) satyanni tiraskarinci, mim'malni masjid al haram ku pokunda nirodhinci, bali (khurbani) jantuvulanu vatini bali cese sthalaniki ceranivvakunda apindi vare kada! Okavela varilo visvasulaina purusulu mariyu visvasulaina strilu lekunte - evarini gurincaite miku teliyado - varini miru trokkivesi undevaru. Dani valana miru - miku teliyakundane - papaniki guri ayyevaru. Allah tanu korina varini tana karunyanloniki tisukuntadu. Okavela varu (visvasulu) vari nundi veruga undi unte, memu tappaka variloni satyatiraskarulaku badhakaramaina siksa vidhinci undevaramu
Abdul Raheem Mohammad Moulana
(vāstavāniki) satyānni tiraskarin̄ci, mim'malni masjid al harām ku pōkuṇḍā nirōdhin̄ci, bali (khurbānī) jantuvulanu vāṭini bali cēsē sthalāniki cēranivvakuṇḍā āpindi vārē kadā! Okavēḷa vārilō viśvāsulaina puruṣulu mariyu viśvāsulaina strīlu lēkuṇṭē - evarini gurin̄caitē mīku teliyadō - vārini mīru trokkivēsi uṇḍēvāru. Dāni valana mīru - mīku teliyakuṇḍānē - pāpāniki guri ayyēvāru. Allāh tānu kōrina vārini tana kāruṇyanlōniki tīsukuṇṭāḍu. Okavēḷa vāru (viśvāsulu) vāri nuṇḍi vērugā uṇḍi uṇṭē, mēmu tappaka vārilōni satyatiraskārulaku bādhākaramaina śikṣa vidhin̄ci uṇḍēvāramu
Muhammad Aziz Ur Rehman
వారే తిరస్కార వైఖరిని అవలంబించినవారు. మిమ్మల్ని మస్జిదె హరాం నుండి అపినవారు. ఖుర్బానీ కొరకు ప్రత్యేకించబడిన పశువులను వాటి ఖుర్బానీ ప్రదేశానికి చేరకుండా అడ్డు తగిలినవారు. (మక్కా నగరంలో) నీకు తెలియని ముస్లిం పురుషులు, (మరెంతో మంది) ముస్లిం స్త్రీలు లేకుండా ఉండి నట్లయితే, తెలీని స్థితిలో వారు మీచేత త్రొక్కివేయబడతారన్న అనుమానం లేకుండా ఉన్నట్లయితే, వారివల్ల నీపై అపవాదు వచ్చే ప్రమాదం లేకపోయినట్లయితే (మీకు యుద్ధం చేసేందుకు అనుమతి ఇవ్వబడి ఉండేది. కాని అలాంటి పరిస్థితి రానివ్వలేదు). అల్లాహ్ తాను కోరిన వారిని తన కారుణ్యంలో చేర్పించుకోవటానికే ఆ పరిస్థితి రానివ్వలేదు. ఒకవేళ వారు (ఆ ముస్లింలు మక్కా నుండి) గనక వేర్పడి (వెళ్ళిపోయి) ఉంటే, మేము వారిలోని తిరస్కారులను బాధాకరమైన శిక్షకు గురిచేసి ఉండేవారము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek