Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 95 - المَائدة - Page - Juz 7
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَقۡتُلُواْ ٱلصَّيۡدَ وَأَنتُمۡ حُرُمٞۚ وَمَن قَتَلَهُۥ مِنكُم مُّتَعَمِّدٗا فَجَزَآءٞ مِّثۡلُ مَا قَتَلَ مِنَ ٱلنَّعَمِ يَحۡكُمُ بِهِۦ ذَوَا عَدۡلٖ مِّنكُمۡ هَدۡيَۢا بَٰلِغَ ٱلۡكَعۡبَةِ أَوۡ كَفَّٰرَةٞ طَعَامُ مَسَٰكِينَ أَوۡ عَدۡلُ ذَٰلِكَ صِيَامٗا لِّيَذُوقَ وَبَالَ أَمۡرِهِۦۗ عَفَا ٱللَّهُ عَمَّا سَلَفَۚ وَمَنۡ عَادَ فَيَنتَقِمُ ٱللَّهُ مِنۡهُۚ وَٱللَّهُ عَزِيزٞ ذُو ٱنتِقَامٍ ﴾
[المَائدة: 95]
﴿ياأيها الذين آمنوا لا تقتلوا الصيد وأنتم حرم ومن قتله منكم متعمدا﴾ [المَائدة: 95]
Abdul Raheem Mohammad Moulana O visvasulara! Miru ihram sthitilo unnappudu vetadakandi. Milo evaraina bud'dhipurvakanga veta ceste, atadu campina jantuvuto sarituge oka pasuvunu pariharanga samarpincukovali. Danini (a pasuvunu) milo n'yayavartulaina iddaru vyaktulu nirnayincali. Pasuvunu khurbani koraku ka'abah vaddaku cercali. Leda daniki pariharanga kondaru pedalaku bhojanam pettali, leda daniki pariharanga - tanu cesina dani pratiphalanni cavicudataniki - upavasamundali. Gadicipoyina danini allah mannincadu. Kani ika mundu evaraina malli ala ceste allah ataniki pratikaram cestadu. Mariyu allah sarva sakti sampannudu, pratikaram ceyagalavadu |
Abdul Raheem Mohammad Moulana Ō viśvāsulārā! Mīru ihrām sthitilō unnappuḍu vēṭāḍakaṇḍi. Mīlō evarainā bud'dhipūrvakaṅgā vēṭa cēstē, ataḍu campina jantuvutō saritūgē oka paśuvunu parihāraṅgā samarpin̄cukōvāli. Dānini (ā paśuvunu) mīlō n'yāyavartulaina iddaru vyaktulu nirṇayin̄cāli. Paśuvunu khurbānī koraku ka'abah vaddaku cērcāli. Lēdā dāniki parihāraṅgā kondaru pēdalaku bhōjanaṁ peṭṭāli, lēdā dāniki parihāraṅgā - tānu cēsina dāni pratiphalānni cavicūḍaṭāniki - upavāsamuṇḍāli. Gaḍicipōyina dānini allāh mannin̄cāḍu. Kāni ika mundu evarainā maḷḷī alā cēstē allāh ataniki pratīkāraṁ cēstāḍu. Mariyu allāh sarva śakti sampannuḍu, pratīkāraṁ cēyagalavāḍu |
Muhammad Aziz Ur Rehman ఓ విశ్వాసులారా! మీరు ఇహ్రాము స్థితిలో ఉన్నప్పుడు వేట జంతువులను చంపకండి. మీలో ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా దానిని చంపినట్లయితే అతడు తాను చంపిన జంతువుకు సమానమైన జంతువును పరిహారంగా చెల్లించటం అవశ్యం. దానిని మీలోని ఇరువురు న్యాయశీలురు నిర్ణయించాలి. పరిహారంగా యివ్వబడే జంతువును ఖుర్బానీ నిమిత్తం కాబా వద్దకు చేర్చాలి. లేదా ఆ పాపానికి పరిహారంగా కొంతమంది పేదలకు అన్నం పెట్టాలి. లేదా దానికి సమానంగా ఉపవాసం పాటించాలి. తాను పాల్పడిన చేష్టకు ఫలితాన్ని చవిచూసేందుకు (ఈ విధంగా నిర్థారించబడింది). గతంలో జరిగిన దాన్ని అల్లాహ్ మన్నించాడు. ఇకమీదట కూడా ఎవరయినా అలా చేస్తే అల్లాహ్ ప్రతీకారం చేస్తాడు. అల్లాహ్ సర్వాధిక్యుడు, ప్రతీకారం చేసేవాడూను |