×

ఆ తరువాత చాలా మంది ప్రవక్తలను మేము వారి తరువాత పంపాము. మరియు మర్యమ్ కుమారుడు 57:27 Telugu translation

Quran infoTeluguSurah Al-hadid ⮕ (57:27) ayat 27 in Telugu

57:27 Surah Al-hadid ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hadid ayat 27 - الحدِيد - Page - Juz 27

﴿ثُمَّ قَفَّيۡنَا عَلَىٰٓ ءَاثَٰرِهِم بِرُسُلِنَا وَقَفَّيۡنَا بِعِيسَى ٱبۡنِ مَرۡيَمَ وَءَاتَيۡنَٰهُ ٱلۡإِنجِيلَۖ وَجَعَلۡنَا فِي قُلُوبِ ٱلَّذِينَ ٱتَّبَعُوهُ رَأۡفَةٗ وَرَحۡمَةٗۚ وَرَهۡبَانِيَّةً ٱبۡتَدَعُوهَا مَا كَتَبۡنَٰهَا عَلَيۡهِمۡ إِلَّا ٱبۡتِغَآءَ رِضۡوَٰنِ ٱللَّهِ فَمَا رَعَوۡهَا حَقَّ رِعَايَتِهَاۖ فَـَٔاتَيۡنَا ٱلَّذِينَ ءَامَنُواْ مِنۡهُمۡ أَجۡرَهُمۡۖ وَكَثِيرٞ مِّنۡهُمۡ فَٰسِقُونَ ﴾
[الحدِيد: 27]

ఆ తరువాత చాలా మంది ప్రవక్తలను మేము వారి తరువాత పంపాము. మరియు మర్యమ్ కుమారుడు ఈసాను కూడా పంపాము మరియు అతనికి ఇంజీల్ ను ప్రసాదించాము. మరియు అతనిని అనుసరించేవారి హృదయాలలో మేము జాలిని, కరుణను కలిగించాము, కాని సన్యాసాన్ని వారే స్వయంగా కల్పించుకున్నారు. మేము దానిని వారిపై విధించలేదు, కాని అల్లాహ్ ప్రసన్నతను పొందగోరి వారే దానిని విధించుకున్నారు, కాని వారు దానిని పాటించవలసిన విధంగా నిజాయితీతో పాటించలేదు. కావున వారిలో విశ్వసించిన వారికి వారి ప్రతిఫలాన్ని ప్రసాదించాము. కాని వారిలో చాలా మంది అవిధేయులు (ఫాసిఖూన్) ఉన్నారు

❮ Previous Next ❯

ترجمة: ثم قفينا على آثارهم برسلنا وقفينا بعيسى ابن مريم وآتيناه الإنجيل وجعلنا, باللغة التيلجو

﴿ثم قفينا على آثارهم برسلنا وقفينا بعيسى ابن مريم وآتيناه الإنجيل وجعلنا﴾ [الحدِيد: 27]

Abdul Raheem Mohammad Moulana
A taruvata cala mandi pravaktalanu memu vari taruvata pampamu. Mariyu maryam kumarudu isanu kuda pampamu mariyu ataniki injil nu prasadincamu. Mariyu atanini anusarincevari hrdayalalo memu jalini, karunanu kaligincamu, kani san'yasanni vare svayanga kalpincukunnaru. Memu danini varipai vidhincaledu, kani allah prasannatanu pondagori vare danini vidhincukunnaru, kani varu danini patincavalasina vidhanga nijayitito patincaledu. Kavuna varilo visvasincina variki vari pratiphalanni prasadincamu. Kani varilo cala mandi avidheyulu (phasikhun) unnaru
Abdul Raheem Mohammad Moulana
Ā taruvāta cālā mandi pravaktalanu mēmu vāri taruvāta pampāmu. Mariyu maryam kumāruḍu īsānu kūḍā pampāmu mariyu ataniki in̄jīl nu prasādin̄cāmu. Mariyu atanini anusarin̄cēvāri hr̥dayālalō mēmu jālini, karuṇanu kaligin̄cāmu, kāni san'yāsānni vārē svayaṅgā kalpin̄cukunnāru. Mēmu dānini vāripai vidhin̄calēdu, kāni allāh prasannatanu pondagōri vārē dānini vidhin̄cukunnāru, kāni vāru dānini pāṭin̄cavalasina vidhaṅgā nijāyitītō pāṭin̄calēdu. Kāvuna vārilō viśvasin̄cina vāriki vāri pratiphalānni prasādin̄cāmu. Kāni vārilō cālā mandi avidhēyulu (phāsikhūn) unnāru
Muhammad Aziz Ur Rehman
మరి వారి వెనుకే మేము మా ప్రవక్తలను నిరంతరం పంపసాగాము. వారి తరువాత మర్యం కుమారుడైన ఈసాను పంపాము. అతనికి ఇంజీలు గ్రంథాన్ని వొసగాము. అతన్ని అనుసరించే వారి హృదయాలలో మృదుత్వాన్ని, జాలిని సృజించాము. మరైతే సన్యాసత్వాన్ని (రహ్ బానియత్) వారంతట వారే ఆవిష్కరించారు. మేము మాత్రం దీనిని వారిపై విధించలేదు. దైవప్రీతిని తప్ప! మరి వారు దానికి తగురీతిలో కట్టుబడి ఉండలేకపోయారు. అయినప్పటికీ మేము వారిలో విశ్వసించిన వారికి వారి పుణ్య ఫలాన్ని ప్రసాదించాము. వారిలో అధికులు మాత్రం అవిధేయులుగా తయారయ్యారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek