×

మరియు వారి వద్దకు ఏదైనా సూచన వచ్చినప్పుడు వారు: "అల్లాహ్ యొక్క సందేశహరులకు ఇవ్వబడినట్లు, మాకు 6:124 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:124) ayat 124 in Telugu

6:124 Surah Al-An‘am ayat 124 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 124 - الأنعَام - Page - Juz 8

﴿وَإِذَا جَآءَتۡهُمۡ ءَايَةٞ قَالُواْ لَن نُّؤۡمِنَ حَتَّىٰ نُؤۡتَىٰ مِثۡلَ مَآ أُوتِيَ رُسُلُ ٱللَّهِۘ ٱللَّهُ أَعۡلَمُ حَيۡثُ يَجۡعَلُ رِسَالَتَهُۥۗ سَيُصِيبُ ٱلَّذِينَ أَجۡرَمُواْ صَغَارٌ عِندَ ٱللَّهِ وَعَذَابٞ شَدِيدُۢ بِمَا كَانُواْ يَمۡكُرُونَ ﴾
[الأنعَام: 124]

మరియు వారి వద్దకు ఏదైనా సూచన వచ్చినప్పుడు వారు: "అల్లాహ్ యొక్క సందేశహరులకు ఇవ్వబడినట్లు, మాకు కూడా (దివ్యజ్ఞానం) ఇవ్వబడనంత వరకు మేము విశ్వసించము." అని అంటారు. తన సందేశాన్ని ఎవరిపై అవతరింపజేయాలో అల్లాహ్ కు బాగా తెలుసు. త్వరలోనే అపరాధులు అల్లాహ్ దగ్గర అవమానింపబడగలరు. మరియు వారి కుట్రల ఫలితంగా వారికి తీవ్రమైన శిక్ష విధించబడగలదు

❮ Previous Next ❯

ترجمة: وإذا جاءتهم آية قالوا لن نؤمن حتى نؤتى مثل ما أوتي رسل, باللغة التيلجو

﴿وإذا جاءتهم آية قالوا لن نؤمن حتى نؤتى مثل ما أوتي رسل﴾ [الأنعَام: 124]

Abdul Raheem Mohammad Moulana
mariyu vari vaddaku edaina sucana vaccinappudu varu: "Allah yokka sandesaharulaku ivvabadinatlu, maku kuda (divyajnanam) ivvabadananta varaku memu visvasincamu." Ani antaru. Tana sandesanni evaripai avatarimpajeyalo allah ku baga telusu. Tvaralone aparadhulu allah daggara avamanimpabadagalaru. Mariyu vari kutrala phalitanga variki tivramaina siksa vidhincabadagaladu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāri vaddaku ēdainā sūcana vaccinappuḍu vāru: "Allāh yokka sandēśaharulaku ivvabaḍinaṭlu, māku kūḍā (divyajñānaṁ) ivvabaḍananta varaku mēmu viśvasin̄camu." Ani aṇṭāru. Tana sandēśānni evaripai avatarimpajēyālō allāh ku bāgā telusu. Tvaralōnē aparādhulu allāh daggara avamānimpabaḍagalaru. Mariyu vāri kuṭrala phalitaṅgā vāriki tīvramaina śikṣa vidhin̄cabaḍagaladu
Muhammad Aziz Ur Rehman
వారి వద్దకు ఏదైనా సూచన వచ్చినప్పుడు, “దైవప్రవక్తలకు ఇవ్వబడినదే మాకూ ఇవ్వబడనంతవరకూ మేము విశ్వసించేది లేదు” అని వారు అంటారు. తన దౌత్యాన్ని ఎవరికి అందజేయాలో అల్లాహ్‌కే బాగా తెలుసు. అతి త్వరలోనే అపరాధులు అల్లాహ్‌ వద్దకు చేరుకుని పరాభవాన్నీ, తమ దుష్టపన్నాగాలకు గాను కఠినాతి కఠినమైన శిక్షను అనుభవిస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek