×

అల్లాహ్ కు సాటి (భాగస్వాములు) కల్పించేవారు అంటారు: "ఒకవేళ అల్లాహ్ కోరితే మేము గానీ, మా 6:148 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:148) ayat 148 in Telugu

6:148 Surah Al-An‘am ayat 148 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 148 - الأنعَام - Page - Juz 8

﴿سَيَقُولُ ٱلَّذِينَ أَشۡرَكُواْ لَوۡ شَآءَ ٱللَّهُ مَآ أَشۡرَكۡنَا وَلَآ ءَابَآؤُنَا وَلَا حَرَّمۡنَا مِن شَيۡءٖۚ كَذَٰلِكَ كَذَّبَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ حَتَّىٰ ذَاقُواْ بَأۡسَنَاۗ قُلۡ هَلۡ عِندَكُم مِّنۡ عِلۡمٖ فَتُخۡرِجُوهُ لَنَآۖ إِن تَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ وَإِنۡ أَنتُمۡ إِلَّا تَخۡرُصُونَ ﴾
[الأنعَام: 148]

అల్లాహ్ కు సాటి (భాగస్వాములు) కల్పించేవారు అంటారు: "ఒకవేళ అల్లాహ్ కోరితే మేము గానీ, మా తండ్రితాతలు గానీ ఆయనకు సాటి కప్పించే వారమూ కాము మరియు దేనినీ నిషేధించి ఉండేవారమూ కాము." వారికి పూర్వం వారు కూడా మా శిక్షను రుచి చూడనంత వరకు ఇదే విధంగా తిరస్కరించారు. వారిని అడుగు: "మీ వద్ద ఏదైనా (రూఢి అయిన) జ్ఞానం ఉందా! ఉంటే మా ముందు పెట్టండి. మీరు కేవలం కల్పనలను అనుసరిస్తున్నారు మరియు మీరు కేవలం ఊహాగానాలే చేస్తున్నారు

❮ Previous Next ❯

ترجمة: سيقول الذين أشركوا لو شاء الله ما أشركنا ولا آباؤنا ولا حرمنا, باللغة التيلجو

﴿سيقول الذين أشركوا لو شاء الله ما أشركنا ولا آباؤنا ولا حرمنا﴾ [الأنعَام: 148]

Abdul Raheem Mohammad Moulana
allah ku sati (bhagasvamulu) kalpincevaru antaru: "Okavela allah korite memu gani, ma tandritatalu gani ayanaku sati kappince varamu kamu mariyu denini nisedhinci undevaramu kamu." Variki purvam varu kuda ma siksanu ruci cudananta varaku ide vidhanga tiraskarincaru. Varini adugu: "Mi vadda edaina (rudhi ayina) jnanam unda! Unte ma mundu pettandi. Miru kevalam kalpanalanu anusaristunnaru mariyu miru kevalam uhaganale cestunnaru
Abdul Raheem Mohammad Moulana
allāh ku sāṭi (bhāgasvāmulu) kalpin̄cēvāru aṇṭāru: "Okavēḷa allāh kōritē mēmu gānī, mā taṇḍritātalu gānī āyanaku sāṭi kappin̄cē vāramū kāmu mariyu dēninī niṣēdhin̄ci uṇḍēvāramū kāmu." Vāriki pūrvaṁ vāru kūḍā mā śikṣanu ruci cūḍananta varaku idē vidhaṅgā tiraskarin̄cāru. Vārini aḍugu: "Mī vadda ēdainā (rūḍhi ayina) jñānaṁ undā! Uṇṭē mā mundu peṭṭaṇḍi. Mīru kēvalaṁ kalpanalanu anusaristunnāru mariyu mīru kēvalaṁ ūhāgānālē cēstunnāru
Muhammad Aziz Ur Rehman
“అల్లాహ్‌ తలచుకొని ఉంటే మేముగానీ, మా తాత ముత్తాతలుగానీ షిర్క్‌కు పాల్పడేవారం కాము; ఏ వస్తువునూ నిషిద్ధంగా ఖరారు చేసేవారం కూడా కాము” అని ముష్రిక్కులు అంటారు. వీరికి పూర్వం గతించిన వారు కూడా ఇలాగే ధిక్కార వైఖరిని అవలంబించారు. కడకు వారు మా శిక్షను చవి చూశారు. (ఓ ప్రవక్తా!) వారిని అడుగు: “మీ దగ్గర ఏదైనా ప్రమాణం ఉంటే, దాన్ని మా ముందు సమర్పించండి. మీరు కేవలం ఊహలను అనుసరిస్తారు. అంచనాలతో మాట్లాడతారు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek