×

ఓ విశ్వాసులారా! నాకు శత్రువులైన వారిని మరియు మీకు కూడా శత్రువులైన వారిని - వారి 60:1 Telugu translation

Quran infoTeluguSurah Al-Mumtahanah ⮕ (60:1) ayat 1 in Telugu

60:1 Surah Al-Mumtahanah ayat 1 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mumtahanah ayat 1 - المُمتَحنَة - Page - Juz 28

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَتَّخِذُواْ عَدُوِّي وَعَدُوَّكُمۡ أَوۡلِيَآءَ تُلۡقُونَ إِلَيۡهِم بِٱلۡمَوَدَّةِ وَقَدۡ كَفَرُواْ بِمَا جَآءَكُم مِّنَ ٱلۡحَقِّ يُخۡرِجُونَ ٱلرَّسُولَ وَإِيَّاكُمۡ أَن تُؤۡمِنُواْ بِٱللَّهِ رَبِّكُمۡ إِن كُنتُمۡ خَرَجۡتُمۡ جِهَٰدٗا فِي سَبِيلِي وَٱبۡتِغَآءَ مَرۡضَاتِيۚ تُسِرُّونَ إِلَيۡهِم بِٱلۡمَوَدَّةِ وَأَنَا۠ أَعۡلَمُ بِمَآ أَخۡفَيۡتُمۡ وَمَآ أَعۡلَنتُمۡۚ وَمَن يَفۡعَلۡهُ مِنكُمۡ فَقَدۡ ضَلَّ سَوَآءَ ٱلسَّبِيلِ ﴾
[المُمتَحنَة: 1]

ఓ విశ్వాసులారా! నాకు శత్రువులైన వారిని మరియు మీకు కూడా శత్రువులైన వారిని - వారి మీద ప్రేమ చూపిస్తూ - వారిని మీ స్నేహితులుగా చేసుకోకండి. మరియు వాస్తవానికి వారు మీ వద్దకు వచ్చిన సత్యాన్ని తిరస్కరించారు. మీ ప్రభువైన అల్లాహ్ ను మీరు విశ్వసించినందుకు, వారు ప్రవక్తను మరియు మిమ్మల్ని (మీ నగరం నుండి) వెడలగొట్టారు! ఒకవేళ మీరు నా ప్రసన్నత కోరి నా మార్గంలో ధర్మయుద్ధం కొరకు వెళితే (ఈ సత్యతిరస్కారులను మీ స్నేహితులుగా చేసుకోకండి). వారి పట్ల వాత్సల్యం చూపుతూ మీరు వారికి రహస్యంగా సందేశం పంపుతారా! మీరు దాచేది మరియు వెలిబుచ్చేది, నాకు బాగా తెలుసు. మరియు మీలో ఎవడైతే ఇలా చేస్తాడో, అతడు వాస్తవంగా, ఋజుమార్గం నుండి తప్పిపోయినవాడే

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا لا تتخذوا عدوي وعدوكم أولياء تلقون إليهم بالمودة وقد, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا لا تتخذوا عدوي وعدوكم أولياء تلقون إليهم بالمودة وقد﴾ [المُمتَحنَة: 1]

Abdul Raheem Mohammad Moulana
O visvasulara! Naku satruvulaina varini mariyu miku kuda satruvulaina varini - vari mida prema cupistu - varini mi snehituluga cesukokandi. Mariyu vastavaniki varu mi vaddaku vaccina satyanni tiraskarincaru. Mi prabhuvaina allah nu miru visvasincinanduku, varu pravaktanu mariyu mim'malni (mi nagaram nundi) vedalagottaru! Okavela miru na prasannata kori na marganlo dharmayud'dham koraku velite (i satyatiraskarulanu mi snehituluga cesukokandi). Vari patla vatsalyam cuputu miru variki rahasyanga sandesam pamputara! Miru dacedi mariyu velibuccedi, naku baga telusu. Mariyu milo evadaite ila cestado, atadu vastavanga, rjumargam nundi tappipoyinavade
Abdul Raheem Mohammad Moulana
Ō viśvāsulārā! Nāku śatruvulaina vārini mariyu mīku kūḍā śatruvulaina vārini - vāri mīda prēma cūpistū - vārini mī snēhitulugā cēsukōkaṇḍi. Mariyu vāstavāniki vāru mī vaddaku vaccina satyānni tiraskarin̄cāru. Mī prabhuvaina allāh nu mīru viśvasin̄cinanduku, vāru pravaktanu mariyu mim'malni (mī nagaraṁ nuṇḍi) veḍalagoṭṭāru! Okavēḷa mīru nā prasannata kōri nā mārganlō dharmayud'dhaṁ koraku veḷitē (ī satyatiraskārulanu mī snēhitulugā cēsukōkaṇḍi). Vāri paṭla vātsalyaṁ cūputū mīru vāriki rahasyaṅgā sandēśaṁ pamputārā! Mīru dācēdi mariyu velibuccēdi, nāku bāgā telusu. Mariyu mīlō evaḍaitē ilā cēstāḍō, ataḍu vāstavaṅgā, r̥jumārgaṁ nuṇḍi tappipōyinavāḍē
Muhammad Aziz Ur Rehman
విశ్వసించిన ఓ ప్రజలారా! నా శత్రువుల్ని, మీ శత్రువుల్ని మీ స్నేహితులుగా చేసుకోకండి. మీరేమో స్నేహపూర్వకంగా వారివైపు సందేశం పంపుతున్నారు. వారేమో మీ వద్దకు వచ్చిన సత్యాన్ని త్రోసిపుచ్చారు. మీ ప్రభువైన అల్లాహ్ ను మీరు విశ్వసించినందుకు వారు ప్రవక్తను, స్వయంగా మిమ్మల్ని కూడా దేశం నుండి బహిష్కరించారు. మీరు గనక నా మార్గంలో పోరాడటానికి, నా ప్రసన్నతను చూరగొనటానికి బయలుదేరిన వారైతే (మీరు వాళ్లతో స్నేహం చేయకండి). మీరు వారి వద్దకు స్నేహ సందేశాన్ని రహస్యంగా పంపిస్తారా! మీరు దాచేదీ, బహిర్గతం చేసేదీ – అంతా నాకు తెలుసు. మీలో ఎవడు ఈ కార్యకలాపాలకు పాల్పడినా అతను తిన్నని మార్గం నుండి తప్పిపోయినట్లే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek