×

ఓ ప్రవక్తా! మీరు స్త్రీలకు విడాకులు (తలాఖ్) ఇచ్చేటప్పుడు వారికి, వారి నిర్ణీత గడువు (ఇద్దత్) 65:1 Telugu translation

Quran infoTeluguSurah AT-Talaq ⮕ (65:1) ayat 1 in Telugu

65:1 Surah AT-Talaq ayat 1 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah AT-Talaq ayat 1 - الطَّلَاق - Page - Juz 28

﴿يَٰٓأَيُّهَا ٱلنَّبِيُّ إِذَا طَلَّقۡتُمُ ٱلنِّسَآءَ فَطَلِّقُوهُنَّ لِعِدَّتِهِنَّ وَأَحۡصُواْ ٱلۡعِدَّةَۖ وَٱتَّقُواْ ٱللَّهَ رَبَّكُمۡۖ لَا تُخۡرِجُوهُنَّ مِنۢ بُيُوتِهِنَّ وَلَا يَخۡرُجۡنَ إِلَّآ أَن يَأۡتِينَ بِفَٰحِشَةٖ مُّبَيِّنَةٖۚ وَتِلۡكَ حُدُودُ ٱللَّهِۚ وَمَن يَتَعَدَّ حُدُودَ ٱللَّهِ فَقَدۡ ظَلَمَ نَفۡسَهُۥۚ لَا تَدۡرِي لَعَلَّ ٱللَّهَ يُحۡدِثُ بَعۡدَ ذَٰلِكَ أَمۡرٗا ﴾
[الطَّلَاق: 1]

ఓ ప్రవక్తా! మీరు స్త్రీలకు విడాకులు (తలాఖ్) ఇచ్చేటప్పుడు వారికి, వారి నిర్ణీత గడువు (ఇద్దత్) తో విడాకులివ్వండి. మరియు ఆ గడువును ఖచ్చితంగా లెక్కపెట్టండి. మరియు మీ ప్రభువైన అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. వారు బహిరంగంగా అశ్లీల చేష్టలకు పాల్పడితే తప్ప, మీరు వారిని వారి ఇండ్ల నుండి వెడల గొట్టకండి మరియు వారు కూడా స్వయంగా వెళ్ళి పోకూడదు. మరియు ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. మరియు ఎవడైతే అల్లాహ్ (నిర్ణయించిన) హద్దులను అతిక్రమిస్తాడో వాస్తవానికి వాడు తనకు తానే అన్యాయం చేసుకున్నట్లు. నీకు తెలియదు, బహుశా! దాని తరువాత అల్లాహ్ ఏదైనా క్రొత్త మార్గం చూపించవచ్చు

❮ Previous Next ❯

ترجمة: ياأيها النبي إذا طلقتم النساء فطلقوهن لعدتهن وأحصوا العدة واتقوا الله ربكم, باللغة التيلجو

﴿ياأيها النبي إذا طلقتم النساء فطلقوهن لعدتهن وأحصوا العدة واتقوا الله ربكم﴾ [الطَّلَاق: 1]

Abdul Raheem Mohammad Moulana
o pravakta! Miru strilaku vidakulu (talakh) iccetappudu variki, vari nirnita gaduvu (iddat) to vidakulivvandi. Mariyu a gaduvunu khaccitanga lekkapettandi. Mariyu mi prabhuvaina allah patla bhayabhaktulu kaligi undandi. Varu bahiranganga aslila cestalaku palpadite tappa, miru varini vari indla nundi vedala gottakandi mariyu varu kuda svayanga velli pokudadu. Mariyu ivi allah nirnayincina haddulu. Mariyu evadaite allah (nirnayincina) haddulanu atikramistado vastavaniki vadu tanaku tane an'yayam cesukunnatlu. Niku teliyadu, bahusa! Dani taruvata allah edaina krotta margam cupincavaccu
Abdul Raheem Mohammad Moulana
ō pravaktā! Mīru strīlaku viḍākulu (talākh) iccēṭappuḍu vāriki, vāri nirṇīta gaḍuvu (iddat) tō viḍākulivvaṇḍi. Mariyu ā gaḍuvunu khaccitaṅgā lekkapeṭṭaṇḍi. Mariyu mī prabhuvaina allāh paṭla bhayabhaktulu kaligi uṇḍaṇḍi. Vāru bahiraṅgaṅgā aślīla cēṣṭalaku pālpaḍitē tappa, mīru vārini vāri iṇḍla nuṇḍi veḍala goṭṭakaṇḍi mariyu vāru kūḍā svayaṅgā veḷḷi pōkūḍadu. Mariyu ivi allāh nirṇayin̄cina haddulu. Mariyu evaḍaitē allāh (nirṇayin̄cina) haddulanu atikramistāḍō vāstavāniki vāḍu tanaku tānē an'yāyaṁ cēsukunnaṭlu. Nīku teliyadu, bahuśā! Dāni taruvāta allāh ēdainā krotta mārgaṁ cūpin̄cavaccu
Muhammad Aziz Ur Rehman
ఓ ప్రవక్తా! (నీ అనుచర సమాజానికి చెప్పు) మీరు మీ స్త్రీలకు విడాకులు ఇస్తున్నప్పుడు వారి గడువు (ఇద్దత్) ప్రకారం విడాకులివ్వండి. ‘గడువు’ (రుతువు)ను లెక్కిస్తూ ఉండండి. మీ ప్రభువైన అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. మీరు వారిని వారి ఇండ్ల నుండి గెంటివేయకండి, వారు సయితం వెళ్లిపోకూడదు. ఒకవేళ వారు బాహాటంగా ఏదైనా నీతిబాహ్యమైన చేష్టకు ఒడిగడితే (అప్పుడు వెళ్ళగొట్టవచ్చు). ఇవి అల్లాహ్ నిర్ధారించిన హద్దులు. ఎవరైతే అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమిస్తాడో అతడు తన స్వయానికే అన్యాయం చేసుకున్నవాడవుతాడు. నీకు తెలీదు – బహుశా అల్లాహ్ దీని తరువాత ఏదైనా కొత్త పరిస్థితిని కల్పిస్తాడేమో
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek