Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 157 - الأعرَاف - Page - Juz 9
﴿ٱلَّذِينَ يَتَّبِعُونَ ٱلرَّسُولَ ٱلنَّبِيَّ ٱلۡأُمِّيَّ ٱلَّذِي يَجِدُونَهُۥ مَكۡتُوبًا عِندَهُمۡ فِي ٱلتَّوۡرَىٰةِ وَٱلۡإِنجِيلِ يَأۡمُرُهُم بِٱلۡمَعۡرُوفِ وَيَنۡهَىٰهُمۡ عَنِ ٱلۡمُنكَرِ وَيُحِلُّ لَهُمُ ٱلطَّيِّبَٰتِ وَيُحَرِّمُ عَلَيۡهِمُ ٱلۡخَبَٰٓئِثَ وَيَضَعُ عَنۡهُمۡ إِصۡرَهُمۡ وَٱلۡأَغۡلَٰلَ ٱلَّتِي كَانَتۡ عَلَيۡهِمۡۚ فَٱلَّذِينَ ءَامَنُواْ بِهِۦ وَعَزَّرُوهُ وَنَصَرُوهُ وَٱتَّبَعُواْ ٱلنُّورَ ٱلَّذِيٓ أُنزِلَ مَعَهُۥٓ أُوْلَٰٓئِكَ هُمُ ٱلۡمُفۡلِحُونَ ﴾
[الأعرَاف: 157]
﴿الذين يتبعون الرسول النبي الأمي الذي يجدونه مكتوبا عندهم في التوراة والإنجيل﴾ [الأعرَاف: 157]
Abdul Raheem Mohammad Moulana evaraite i sandesaharunni niraksyarasyudaina i pravaktanu anusaristaro! Evari prastavana vari vadda vunna taurat mariyu injil granthalalo vrayabadi unnado, atanu variki dharmamunu adesistadu mariyu adharmamu nundi nisedhistadu mariyu vari koraku parisud'dhamaina vastuvulanu dharmasam'matam cesi aparisud'dhamaina vatini nisedhistadu. Varipai mopabadina bharalanu mariyu vari nirbhandhalanu tolagistadu. Kavuna atanini samarthinci, atanito sahakarinci, atanipai atavarimpajeyabadina jyotini anusarince varu matrame saphalyam pondevaru |
Abdul Raheem Mohammad Moulana evaraitē ī sandēśaharuṇṇi nirakṣyarāsyuḍaina ī pravaktanu anusaristārō! Evari prastāvana vāri vadda vunna taurāt mariyu in̄jīl granthālalō vrāyabaḍi unnadō, atanu vāriki dharmamunu ādēśistāḍu mariyu adharmamu nuṇḍi niṣēdhistāḍu mariyu vāri koraku pariśud'dhamaina vastuvulanu dharmasam'mataṁ cēsi apariśud'dhamaina vāṭini niṣēdhistāḍu. Vāripai mōpabaḍina bhārālanu mariyu vāri nirbhandhālanu tolagistāḍu. Kāvuna atanini samarthin̄ci, atanitō sahakarin̄ci, atanipai atavarimpajēyabaḍina jyōtini anusarin̄cē vāru mātramē sāphalyaṁ pondēvāru |
Muhammad Aziz Ur Rehman ఈ సందేశహరుణ్ణి, నిరక్షరాసి అయిన ఈ ప్రవక్తను అనుసరించేవారు (కరుణించబడతారు), అతని ప్రస్తావన తమ వద్ద ఉన్న తౌరాతు, ఇంజీలు గ్రంథాలలో లిఖితపూర్వకంగా లభిస్తుంది. ఆ ప్రవక్త మంచిని చెయ్యమని వారికి ఆదేశిస్తాడు. చెడుల నుంచి వారిస్తాడు. పరిశుద్ధమైన వస్తువులను ధర్మ సమ్మతంగా ప్రకటిస్తాడు. అశుద్ధమైన వాటిని నిషిద్ధంగా ఖరారు చేస్తాడు. వారిపై ఉన్న బరువులను దించుతాడు. వారికి వేయబడి వున్న సంకెళ్లను (విప్పుతాడు). కనుక ఎవరు ఈ ప్రవక్తను విశ్వసించి, అతనికి ఆదరువుగా నిలుస్తారో, తోడ్పాటునందిస్తారో, ఇంకా అతనితోపాటు పంపబడిన జ్యోతిని అనుసరిస్తారో వారే సాఫల్యం పొందేవారు |