Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 187 - الأعرَاف - Page - Juz 9
﴿يَسۡـَٔلُونَكَ عَنِ ٱلسَّاعَةِ أَيَّانَ مُرۡسَىٰهَاۖ قُلۡ إِنَّمَا عِلۡمُهَا عِندَ رَبِّيۖ لَا يُجَلِّيهَا لِوَقۡتِهَآ إِلَّا هُوَۚ ثَقُلَتۡ فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ لَا تَأۡتِيكُمۡ إِلَّا بَغۡتَةٗۗ يَسۡـَٔلُونَكَ كَأَنَّكَ حَفِيٌّ عَنۡهَاۖ قُلۡ إِنَّمَا عِلۡمُهَا عِندَ ٱللَّهِ وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يَعۡلَمُونَ ﴾
[الأعرَاف: 187]
﴿يسألونك عن الساعة أيان مرساها قل إنما علمها عند ربي لا يجليها﴾ [الأعرَاف: 187]
Abdul Raheem Mohammad Moulana (o pravakta!) Varu ninnu a antimaghadiyanu gurinci: "Adi eppudu ranunnadi?" Ani adugutunnaru. Varito ila anu: "Nis'sandehanga, dani jnanam na prabhuvuku matrame undi. Kevalam ayana svayanga danini, dani samayanlo teliyajestadu. Adi bhumyakasalaku ento durbharamainadiga untundi. Adi mipai akasmattugane vacci padutundi." Danini gurinci niku baga telisi unnatlu bhavinci, varu ninnu danini gurinci adugutunnaru. Nivu ila samadhanam ivvu: "Nis'sandehanga, dani jnanam allah ku matrame undi. Kani cala mandi idi telusukoleru |
Abdul Raheem Mohammad Moulana (ō pravaktā!) Vāru ninnu ā antimaghaḍiyanu gurin̄ci: "Adi eppuḍu rānunnadi?" Ani aḍugutunnāru. Vāritō ilā anu: "Nis'sandēhaṅgā, dāni jñānaṁ nā prabhuvuku mātramē undi. Kēvalaṁ āyana svayaṅgā dānini, dāni samayanlō teliyajēstāḍu. Adi bhūmyākāśālaku entō durbharamainadigā uṇṭundi. Adi mīpai akasmāttugānē vacci paḍutundi." Dānini gurin̄ci nīku bāgā telisi unnaṭlu bhāvin̄ci, vāru ninnu dānini gurin̄ci aḍugutunnāru. Nīvu ilā samādhānaṁ ivvu: "Nis'sandēhaṅgā, dāni jñānaṁ allāh ku mātramē undi. Kāni cālā mandi idi telusukōlēru |
Muhammad Aziz Ur Rehman “ఇంతకీ ఆ ఘడియ ఎప్పుడొస్తుందీ?’ అని వారు నిన్ను ప్రళయం గురించి అడుగుతున్నారు కదూ! “ఆ జ్ఞానం మాత్రం నా ప్రభువు వద్దనే ఉంది. ఆ సమయం ఆసన్నమైనపుడు ఆయన మాత్రమే దాన్ని ప్రత్యక్షపరుస్తాడు. అది ఆకాశాలలోనూ, భూమిలోనూ మహా బరువైనది (విపత్కరమైన సంఘటన)గా ఉంటుంది. అది అకస్మాత్తుగానే మీపై వచ్చిపడుతుంది” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. నీవు దాని గురించి పరిశోధన చేసి కనుగొన్నట్లే వారు నిన్ను అడుగుతున్నారు. “దాని జ్ఞానం కేవలం అల్లాహ్ వద్ద మాత్రమే ఉంది. కాని చాలా మంది ఈ విషయాన్ని తెలుసుకోరు” అని వారికి చెప్పు |