×

(ఓ ముహమ్మద్!) నీవు, వాస్తవానికి దాదాపు మూడింట రెండు వంతుల రాత్రి లేక సగం (రాత్రి) 73:20 Telugu translation

Quran infoTeluguSurah Al-Muzzammil ⮕ (73:20) ayat 20 in Telugu

73:20 Surah Al-Muzzammil ayat 20 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Muzzammil ayat 20 - المُزمل - Page - Juz 29

﴿۞ إِنَّ رَبَّكَ يَعۡلَمُ أَنَّكَ تَقُومُ أَدۡنَىٰ مِن ثُلُثَيِ ٱلَّيۡلِ وَنِصۡفَهُۥ وَثُلُثَهُۥ وَطَآئِفَةٞ مِّنَ ٱلَّذِينَ مَعَكَۚ وَٱللَّهُ يُقَدِّرُ ٱلَّيۡلَ وَٱلنَّهَارَۚ عَلِمَ أَن لَّن تُحۡصُوهُ فَتَابَ عَلَيۡكُمۡۖ فَٱقۡرَءُواْ مَا تَيَسَّرَ مِنَ ٱلۡقُرۡءَانِۚ عَلِمَ أَن سَيَكُونُ مِنكُم مَّرۡضَىٰ وَءَاخَرُونَ يَضۡرِبُونَ فِي ٱلۡأَرۡضِ يَبۡتَغُونَ مِن فَضۡلِ ٱللَّهِ وَءَاخَرُونَ يُقَٰتِلُونَ فِي سَبِيلِ ٱللَّهِۖ فَٱقۡرَءُواْ مَا تَيَسَّرَ مِنۡهُۚ وَأَقِيمُواْ ٱلصَّلَوٰةَ وَءَاتُواْ ٱلزَّكَوٰةَ وَأَقۡرِضُواْ ٱللَّهَ قَرۡضًا حَسَنٗاۚ وَمَا تُقَدِّمُواْ لِأَنفُسِكُم مِّنۡ خَيۡرٖ تَجِدُوهُ عِندَ ٱللَّهِ هُوَ خَيۡرٗا وَأَعۡظَمَ أَجۡرٗاۚ وَٱسۡتَغۡفِرُواْ ٱللَّهَۖ إِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمُۢ ﴾
[المُزمل: 20]

(ఓ ముహమ్మద్!) నీవు, వాస్తవానికి దాదాపు మూడింట రెండు వంతుల రాత్రి లేక సగం (రాత్రి) లేక మూడింట ఒక భాగం (నమాజ్ లో) నిలుస్తావనేది నీ ప్రభువుకు బాగా తెలుసు. మరియు నీతో పాటు ఉన్న వారిలో కొందరు కూడా! మరియు అల్లాహ్ రేయింబవళ్ళ పరిమాణాలను నిర్ణయిస్తాడు. మీరు ఖచ్ఛితంగా పూర్తి రాత్రి ప్రార్థించలేరని ఆయనకు తెలుసు. కావున ఆయన మీ వైపునకు (కనికరంతో) మరలాడు. కావున ఖుర్ఆన్ ను, మీరు సులభంగా పఠించగలిగినంతే పఠించండి. మీలో కొందరు వ్యాధిగ్రస్తులు కావచ్చు, మరికొందరు అల్లాహ్ అనుగ్రహాన్ని అన్వేషిస్తూ భూమిలో ప్రయాణంలో ఉండవచ్చు. మరికొందరు అల్లాహ్ మార్గంలో ధర్మయుద్ధం చేస్తూ ఉండవచ్చు అని ఆయనకు బాగా తెలుసు. కావున మీకు దానిలో సులభమైనంత దానినే పఠించండి. మరియు నమాజ్ను స్థాపించండి, విధిదానం (జకాత్) ఇవ్వండి. మరియు అల్లాహ్ కు మంచి అప్పును, అప్పుగా ఇస్తూ ఉండండి. మరియు మీరు, మీ కొరకు ముందుగా చేసి పంపుకున్న మంచి కార్యాలన్నింటినీ అల్లాహ్ దగ్గర పొందుతారు. అదే చాలా ఉత్తమమైనది. మరియు దాని ప్రతిఫలం చాలా గొప్పది. మరియు మీరు అల్లాహ్ ను క్షమాభిక్ష అర్థిస్తూ ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: إن ربك يعلم أنك تقوم أدنى من ثلثي الليل ونصفه وثلثه وطائفة, باللغة التيلجو

﴿إن ربك يعلم أنك تقوم أدنى من ثلثي الليل ونصفه وثلثه وطائفة﴾ [المُزمل: 20]

Abdul Raheem Mohammad Moulana
(O muham'mad!) Nivu, vastavaniki dadapu mudinta rendu vantula ratri leka sagam (ratri) leka mudinta oka bhagam (namaj lo) nilustavanedi ni prabhuvuku baga telusu. Mariyu nito patu unna varilo kondaru kuda! Mariyu allah reyimbavalla parimanalanu nirnayistadu. Miru khacchitanga purti ratri prarthincalerani ayanaku telusu. Kavuna ayana mi vaipunaku (kanikaranto) maraladu. Kavuna khur'an nu, miru sulabhanga pathincagaliginante pathincandi. Milo kondaru vyadhigrastulu kavaccu, marikondaru allah anugrahanni anvesistu bhumilo prayananlo undavaccu. Marikondaru allah marganlo dharmayud'dham cestu undavaccu ani ayanaku baga telusu. Kavuna miku danilo sulabhamainanta danine pathincandi. Mariyu namajnu sthapincandi, vidhidanam (jakat) ivvandi. Mariyu allah ku manci appunu, appuga istu undandi. Mariyu miru, mi koraku munduga cesi pampukunna manci karyalannintini allah daggara pondutaru. Ade cala uttamamainadi. Mariyu dani pratiphalam cala goppadi. Mariyu miru allah nu ksamabhiksa arthistu undandi. Niscayanga, allah ksamasiludu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
(Ō muham'mad!) Nīvu, vāstavāniki dādāpu mūḍiṇṭa reṇḍu vantula rātri lēka sagaṁ (rātri) lēka mūḍiṇṭa oka bhāgaṁ (namāj lō) nilustāvanēdi nī prabhuvuku bāgā telusu. Mariyu nītō pāṭu unna vārilō kondaru kūḍā! Mariyu allāh rēyimbavaḷḷa parimāṇālanu nirṇayistāḍu. Mīru khacchitaṅgā pūrti rātri prārthin̄calērani āyanaku telusu. Kāvuna āyana mī vaipunaku (kanikarantō) maralāḍu. Kāvuna khur'ān nu, mīru sulabhaṅgā paṭhin̄cagaliginantē paṭhin̄caṇḍi. Mīlō kondaru vyādhigrastulu kāvaccu, marikondaru allāh anugrahānni anvēṣistū bhūmilō prayāṇanlō uṇḍavaccu. Marikondaru allāh mārganlō dharmayud'dhaṁ cēstū uṇḍavaccu ani āyanaku bāgā telusu. Kāvuna mīku dānilō sulabhamainanta dāninē paṭhin̄caṇḍi. Mariyu namājnu sthāpin̄caṇḍi, vidhidānaṁ (jakāt) ivvaṇḍi. Mariyu allāh ku man̄ci appunu, appugā istū uṇḍaṇḍi. Mariyu mīru, mī koraku mundugā cēsi pampukunna man̄ci kāryālanniṇṭinī allāh daggara pondutāru. Adē cālā uttamamainadi. Mariyu dāni pratiphalaṁ cālā goppadi. Mariyu mīru allāh nu kṣamābhikṣa arthistū uṇḍaṇḍi. Niścayaṅgā, allāh kṣamāśīluḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) నువ్వు ఒక్కోసారి మూడింట రెండు వంతుల రాత్రి కంటే కొంచెం తక్కువ, ఒక్కోసారి సగం రాత్రి, ఒక్కోసారి మూడింట ఒక వంతు రాత్రి ఆరాధనలో నిలబడుతున్నావనీ, నీ సహచరుల్లోని ఒక వర్గం కూడా ఇలాగే చేస్తుందన్న సంగతి నీ ప్రభువుకు బాగా తెలుసు. రేయింబవళ్ళ లెక్కను ఖచ్చితంగా మదించగలవాడు అల్లాహ్ మాత్రమే. ఎట్టి పరిస్థితిలోనూ మీరు దీనిని నిర్వర్తించలేరని ఆయనకు తెలుసు. అందుకే ఆయన మీపై దయదలిచాడు. కాబట్టి మీరు ఖుర్ఆన్ లో సులభంగా పఠించగలిగినంత భాగాన్ని పఠించండి. మీలో కొందరు వ్యాధి గ్రస్తులుంటారనీ, మరి కొందరు భువిలో సంచరించి దైవానుగ్రహాన్ని (అంటే ఉపాధిని) అన్వేషించేవారున్నారనీ, ఇంకా కొందరు దైవమార్గంలో యుద్ధం చేసేవారు కూడా ఉంటారని ఆయనకు తెలుసు. కాబట్టి మీరు సులువుగా పఠించగలిగినంత ఖుర్ఆన్ ను పఠించండి. నమాజును నెలకొల్పండి. జకాత్ ను ఇస్తూ ఉండండి. అల్లాహ్ కు మంచి రుణం ఇవ్వండి. మీరు మీ కోసం ఏ మంచిని (పుణ్యకార్యాన్ని) ముందుగా పంపినా, దాన్ని అల్లాహ్ దగ్గర అత్యుత్తమ పుణ్య ఫలం రూపంలో అత్యధికంగా పొందుతారు. క్షమాపణకై అల్లాహ్ ను అర్ధిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ గొప్ప క్షమాశీలి, దయాశీలి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek