×

మేము ఏమీ (చెడు మాట) అనలేదు!" అని వారు అల్లాహ్ పై ప్రమాణం చేసి అంటున్నారు. 9:74 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:74) ayat 74 in Telugu

9:74 Surah At-Taubah ayat 74 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 74 - التوبَة - Page - Juz 10

﴿يَحۡلِفُونَ بِٱللَّهِ مَا قَالُواْ وَلَقَدۡ قَالُواْ كَلِمَةَ ٱلۡكُفۡرِ وَكَفَرُواْ بَعۡدَ إِسۡلَٰمِهِمۡ وَهَمُّواْ بِمَا لَمۡ يَنَالُواْۚ وَمَا نَقَمُوٓاْ إِلَّآ أَنۡ أَغۡنَىٰهُمُ ٱللَّهُ وَرَسُولُهُۥ مِن فَضۡلِهِۦۚ فَإِن يَتُوبُواْ يَكُ خَيۡرٗا لَّهُمۡۖ وَإِن يَتَوَلَّوۡاْ يُعَذِّبۡهُمُ ٱللَّهُ عَذَابًا أَلِيمٗا فِي ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةِۚ وَمَا لَهُمۡ فِي ٱلۡأَرۡضِ مِن وَلِيّٖ وَلَا نَصِيرٖ ﴾
[التوبَة: 74]

మేము ఏమీ (చెడు మాట) అనలేదు!" అని వారు అల్లాహ్ పై ప్రమాణం చేసి అంటున్నారు. కాని వాస్తవానికి వారు సత్యతిరస్కారపు మాట అన్నారు. మరియు ఇస్లాంను స్వీకరించిన తరువాత దానిని తిరస్కరించారు. మరియు వారికి అసాధ్యమైన దానిని చేయదలచుకున్నారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త, (అల్లాహ్) అనుగ్రహంతో వారిని సంపన్నులుగా చేశారనే కదా! వారు ఈ విధంగా ప్రతీకారం చేస్తున్నారు. ఇప్పుడైనా వారు పశ్చాత్తాప పడితే అది వారికే మేలు. మరియు వారు మరలిపోతే, అల్లాహ్ వారికి ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ, బాధాకరమైన శిక్ష విధిస్తాడు. మరియు భూమిలో వారికి ఏ రక్షకుడు గానీ సహాయకుడు గానీ ఉండడు

❮ Previous Next ❯

ترجمة: يحلفون بالله ما قالوا ولقد قالوا كلمة الكفر وكفروا بعد إسلامهم وهموا, باللغة التيلجو

﴿يحلفون بالله ما قالوا ولقد قالوا كلمة الكفر وكفروا بعد إسلامهم وهموا﴾ [التوبَة: 74]

Abdul Raheem Mohammad Moulana
Memu emi (cedu mata) analedu!" Ani varu allah pai pramanam cesi antunnaru. Kani vastavaniki varu satyatiraskarapu mata annaru. Mariyu islannu svikarincina taruvata danini tiraskarincaru. Mariyu variki asadhyamaina danini ceyadalacukunnaru. Allah mariyu ayana pravakta, (allah) anugrahanto varini sampannuluga cesarane kada! Varu i vidhanga pratikaram cestunnaru. Ippudaina varu pascattapa padite adi varike melu. Mariyu varu maralipote, allah variki ihalokanlonu mariyu paralokanlonu, badhakaramaina siksa vidhistadu. Mariyu bhumilo variki e raksakudu gani sahayakudu gani undadu
Abdul Raheem Mohammad Moulana
Mēmu ēmī (ceḍu māṭa) analēdu!" Ani vāru allāh pai pramāṇaṁ cēsi aṇṭunnāru. Kāni vāstavāniki vāru satyatiraskārapu māṭa annāru. Mariyu islānnu svīkarin̄cina taruvāta dānini tiraskarin̄cāru. Mariyu vāriki asādhyamaina dānini cēyadalacukunnāru. Allāh mariyu āyana pravakta, (allāh) anugrahantō vārini sampannulugā cēśāranē kadā! Vāru ī vidhaṅgā pratīkāraṁ cēstunnāru. Ippuḍainā vāru paścāttāpa paḍitē adi vārikē mēlu. Mariyu vāru maralipōtē, allāh vāriki ihalōkanlōnū mariyu paralōkanlōnū, bādhākaramaina śikṣa vidhistāḍu. Mariyu bhūmilō vāriki ē rakṣakuḍu gānī sahāyakuḍu gānī uṇḍaḍu
Muhammad Aziz Ur Rehman
“మేమలా చెప్పలేద”ని వారు ప్రమాణాలు చేసి చెబుతున్నారు. యదార్థానికి అవిశ్వాస వాక్కు వారి నోట వెలువడింది. ఇస్లాంను స్వీకరించిన తరువాత వారు కుఫ్ర్‌కు (తిరస్కారానికి) ఒడిగట్టారు. వారు చేయలేకపోయిన దానిని గురించి కూడా నిశ్చయించుకున్నారు. అల్లాహ్‌, ఆయన ప్రవక్త (సఅసం) తమ చలువతో వారిని సంపన్నులుగా చేసినందుకే వారు ఈ విధంగా ప్రతీకారం తీర్చుకుంటున్నారు. వారు ఇప్పటికైనా పశ్చాత్తాపం చెందితే అది వారికొరకు శ్రేయస్కరం అవుతుంది. ఒకవేళ వారు ముఖం త్రిప్పుకున్నట్లయితే ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అల్లాహ్‌ వారికి వ్యధాభరితమైన శిక్షకు గురి చేస్తాడు. భూమండలంలో వారిని సమర్థించేవాడు, సహాయపడే వాడెవడూ ఉండడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek