×

అప్పుడు అతని జాతివారిలో సత్యతిరస్కారులైన నాయకులు: "నీవు కూడా మా మాదిరిగా ఒక సాధారణ మానవుడవే 11:27 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:27) ayat 27 in Telugu

11:27 Surah Hud ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 27 - هُود - Page - Juz 12

﴿فَقَالَ ٱلۡمَلَأُ ٱلَّذِينَ كَفَرُواْ مِن قَوۡمِهِۦ مَا نَرَىٰكَ إِلَّا بَشَرٗا مِّثۡلَنَا وَمَا نَرَىٰكَ ٱتَّبَعَكَ إِلَّا ٱلَّذِينَ هُمۡ أَرَاذِلُنَا بَادِيَ ٱلرَّأۡيِ وَمَا نَرَىٰ لَكُمۡ عَلَيۡنَا مِن فَضۡلِۭ بَلۡ نَظُنُّكُمۡ كَٰذِبِينَ ﴾
[هُود: 27]

అప్పుడు అతని జాతివారిలో సత్యతిరస్కారులైన నాయకులు: "నీవు కూడా మా మాదిరిగా ఒక సాధారణ మానవుడవే తప్ప, నీలో మరే ప్రత్యేకతను మేము చూడటం లేదు. మరియు వివేకం లేని నీచమైన వారు తప్ప ఇతరులు నిన్ను అనుసరిస్తున్నట్లు కూడా మేము చూడటం లేదు. మరియు మీలో మా కంటే ఎక్కువ ఘనత కూడా మాకు కనబడటం లేదు. అంతేగాక మీరు అసత్యవాదులని మేము భావిస్తున్నాము." అని అన్నారు

❮ Previous Next ❯

ترجمة: فقال الملأ الذين كفروا من قومه ما نراك إلا بشرا مثلنا وما, باللغة التيلجو

﴿فقال الملأ الذين كفروا من قومه ما نراك إلا بشرا مثلنا وما﴾ [هُود: 27]

Abdul Raheem Mohammad Moulana
appudu atani jativarilo satyatiraskarulaina nayakulu: "Nivu kuda ma madiriga oka sadharana manavudave tappa, nilo mare pratyekatanu memu cudatam ledu. Mariyu vivekam leni nicamaina varu tappa itarulu ninnu anusaristunnatlu kuda memu cudatam ledu. Mariyu milo ma kante ekkuva ghanata kuda maku kanabadatam ledu. Antegaka miru asatyavadulani memu bhavistunnamu." Ani annaru
Abdul Raheem Mohammad Moulana
appuḍu atani jātivārilō satyatiraskārulaina nāyakulu: "Nīvu kūḍā mā mādirigā oka sādhāraṇa mānavuḍavē tappa, nīlō marē pratyēkatanu mēmu cūḍaṭaṁ lēdu. Mariyu vivēkaṁ lēni nīcamaina vāru tappa itarulu ninnu anusaristunnaṭlu kūḍā mēmu cūḍaṭaṁ lēdu. Mariyu mīlō mā kaṇṭē ekkuva ghanata kūḍā māku kanabaḍaṭaṁ lēdu. Antēgāka mīru asatyavādulani mēmu bhāvistunnāmu." Ani annāru
Muhammad Aziz Ur Rehman
అప్పుడు అతని జాతికి చెందిన అవిశ్వాసుల సర్దారులు ఇలా సమాధానమిచ్చారు: “మా దృష్టిలో నువ్వు మాలాంటి ఒక మానవ మాత్రుడివే తప్ప మరేమీ కావు. ఇంకా మేము గమనిస్తున్నాము, మాలోని అల్పులైనవారే ఆలోచించకుండా, అర్థంచేసుకోకుండా నిన్ను అనుసరిస్తున్నారు. కనుక మాపై మీకెలాంటి ప్రాధాన్యతగాని ఉన్నట్లు కానరావటంలేదు. పైగా మేము మిమ్మల్ని అబద్ధాలకోరులుగా భావిస్తున్నాము.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek