×

ఓ విశ్వాసులారా! మీలో ఎవడైనా తన ధర్మం (ఇస్లాం) నుండి వైదొలగితే, అల్లాహ్ త్వరలోనే ఇతర 5:54 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:54) ayat 54 in Telugu

5:54 Surah Al-Ma’idah ayat 54 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 54 - المَائدة - Page - Juz 6

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ مَن يَرۡتَدَّ مِنكُمۡ عَن دِينِهِۦ فَسَوۡفَ يَأۡتِي ٱللَّهُ بِقَوۡمٖ يُحِبُّهُمۡ وَيُحِبُّونَهُۥٓ أَذِلَّةٍ عَلَى ٱلۡمُؤۡمِنِينَ أَعِزَّةٍ عَلَى ٱلۡكَٰفِرِينَ يُجَٰهِدُونَ فِي سَبِيلِ ٱللَّهِ وَلَا يَخَافُونَ لَوۡمَةَ لَآئِمٖۚ ذَٰلِكَ فَضۡلُ ٱللَّهِ يُؤۡتِيهِ مَن يَشَآءُۚ وَٱللَّهُ وَٰسِعٌ عَلِيمٌ ﴾
[المَائدة: 54]

ఓ విశ్వాసులారా! మీలో ఎవడైనా తన ధర్మం (ఇస్లాం) నుండి వైదొలగితే, అల్లాహ్ త్వరలోనే ఇతర ప్రజలను తేగలడు. ఆయన వారిని ప్రేమిస్తాడు మరియు వారు ఆయన (అల్లాహ్) ను ప్రేమిస్తారు. వారు విశ్వాసుల పట్ల మృదువుగా, సత్యతిరస్కారుల పట్ల కఠినంగా ప్రవర్తించే వారునూ, అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం చేసే వారూను మరియు నిందించే వారి నిందలకు భయపడని వారూనూ, అయి ఉంటారు. ఇది అల్లాహ్ అనుగ్రహం, ఆయన దానిని తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ సర్వోపగతుడు (సర్వవ్యాప్తి), సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا من يرتد منكم عن دينه فسوف يأتي الله بقوم, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا من يرتد منكم عن دينه فسوف يأتي الله بقوم﴾ [المَائدة: 54]

Abdul Raheem Mohammad Moulana
O visvasulara! Milo evadaina tana dharmam (islam) nundi vaidolagite, allah tvaralone itara prajalanu tegaladu. Ayana varini premistadu mariyu varu ayana (allah) nu premistaru. Varu visvasula patla mrduvuga, satyatiraskarula patla kathinanga pravartince varunu, allah marganlo dharmaporatam cese varunu mariyu nindince vari nindalaku bhayapadani varunu, ayi untaru. Idi allah anugraham, ayana danini tanu korina variki prasadistadu. Mariyu allah sarvopagatudu (sarvavyapti), sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
Ō viśvāsulārā! Mīlō evaḍainā tana dharmaṁ (islāṁ) nuṇḍi vaidolagitē, allāh tvaralōnē itara prajalanu tēgalaḍu. Āyana vārini prēmistāḍu mariyu vāru āyana (allāh) nu prēmistāru. Vāru viśvāsula paṭla mr̥duvugā, satyatiraskārula paṭla kaṭhinaṅgā pravartin̄cē vārunū, allāh mārganlō dharmapōrāṭaṁ cēsē vārūnu mariyu nindin̄cē vāri nindalaku bhayapaḍani vārūnū, ayi uṇṭāru. Idi allāh anugrahaṁ, āyana dānini tānu kōrina vāriki prasādistāḍu. Mariyu allāh sarvōpagatuḍu (sarvavyāpti), sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! మీలో ఎవరయినాసరే తమ ధర్మం నుంచి తిరిగిపోతే (పోవచ్చు), అల్లాహ్‌ త్వరలోనే మరో జాతి వారిని తీసుకువస్తాడు. అల్లాహ్‌ వారిని ప్రేమిస్తాడు, వారు అల్లాహ్‌ను ప్రేమిస్తారు. వారు విశ్వాసుల పట్ల మృదు స్వభావులుగానూ, అవిశ్వాసుల పట్ల కఠినులుగానూ ఉంటారు. వారు అల్లాహ్‌ మార్గంలో పోరాడుతారు. నిందించేవారి నిందలను వారు ఏమాత్రం పట్టించుకోరు. ఇది అల్లాహ్‌ అనుగ్రహం. ఆయన తాను కోరిన వారికి దీన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్‌ విస్తృతి కలవాడు, జ్ఞాన సంపన్నుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek