×

మరియు అల్లాహ్ పై అబద్ధపు నింద మోపే వాని కంటే, లేదా తనపై ఏ దివ్య 6:93 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:93) ayat 93 in Telugu

6:93 Surah Al-An‘am ayat 93 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 93 - الأنعَام - Page - Juz 7

﴿وَمَنۡ أَظۡلَمُ مِمَّنِ ٱفۡتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًا أَوۡ قَالَ أُوحِيَ إِلَيَّ وَلَمۡ يُوحَ إِلَيۡهِ شَيۡءٞ وَمَن قَالَ سَأُنزِلُ مِثۡلَ مَآ أَنزَلَ ٱللَّهُۗ وَلَوۡ تَرَىٰٓ إِذِ ٱلظَّٰلِمُونَ فِي غَمَرَٰتِ ٱلۡمَوۡتِ وَٱلۡمَلَٰٓئِكَةُ بَاسِطُوٓاْ أَيۡدِيهِمۡ أَخۡرِجُوٓاْ أَنفُسَكُمُۖ ٱلۡيَوۡمَ تُجۡزَوۡنَ عَذَابَ ٱلۡهُونِ بِمَا كُنتُمۡ تَقُولُونَ عَلَى ٱللَّهِ غَيۡرَ ٱلۡحَقِّ وَكُنتُمۡ عَنۡ ءَايَٰتِهِۦ تَسۡتَكۡبِرُونَ ﴾
[الأنعَام: 93]

మరియు అల్లాహ్ పై అబద్ధపు నింద మోపే వాని కంటే, లేదా తనపై ఏ దివ్య జ్ఞానం (వహీ) అవతరించక పోయినప్పటికీ: "నాపై దివ్యజ్ఞానం అవతరింప జేయబడుతుంది." అని చేప్పేవాని కంటే, లేదా: "అల్లాహ్ అవతరింప జేసినటువంటి విషయాలను నేను కూడా అవతరింపజేయగలను." అని పలికే వాని కంటే, మించిన దుర్మార్గుడు ఎవడు? దుర్మార్గులు మరణ వేదనలో ఉన్నప్పుడు దేవదూతలు తమ చేతులు చాచి: "మీ ప్రాణాలను వదలండి! అల్లాహ్ పై అసత్యాలు పలుకుతూ ఉన్నందు వలన మరియు ఆయన సూచనల పట్ల అనాదరణ చూపటం వలన, ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది!" అని అంటూ ఉండే దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుండేది

❮ Previous Next ❯

ترجمة: ومن أظلم ممن افترى على الله كذبا أو قال أوحي إلي ولم, باللغة التيلجو

﴿ومن أظلم ممن افترى على الله كذبا أو قال أوحي إلي ولم﴾ [الأنعَام: 93]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah pai abad'dhapu ninda mope vani kante, leda tanapai e divya jnanam (vahi) avatarincaka poyinappatiki: "Napai divyajnanam avatarimpa jeyabadutundi." Ani ceppevani kante, leda: "Allah avatarimpa jesinatuvanti visayalanu nenu kuda avatarimpajeyagalanu." Ani palike vani kante, mincina durmargudu evadu? Durmargulu marana vedanalo unnappudu devadutalu tama cetulu caci: "Mi pranalanu vadalandi! Allah pai asatyalu palukutu unnandu valana mariyu ayana sucanala patla anadarana cupatam valana, i roju miku avamanakaramaina siksa vidhincabadutundi!" Ani antu unde drsyanni nivu cudagaligite enta bagundedi
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh pai abad'dhapu ninda mōpē vāni kaṇṭē, lēdā tanapai ē divya jñānaṁ (vahī) avatarin̄caka pōyinappaṭikī: "Nāpai divyajñānaṁ avatarimpa jēyabaḍutundi." Ani cēppēvāni kaṇṭē, lēdā: "Allāh avatarimpa jēsinaṭuvaṇṭi viṣayālanu nēnu kūḍā avatarimpajēyagalanu." Ani palikē vāni kaṇṭē, min̄cina durmārguḍu evaḍu? Durmārgulu maraṇa vēdanalō unnappuḍu dēvadūtalu tama cētulu cāci: "Mī prāṇālanu vadalaṇḍi! Allāh pai asatyālu palukutū unnandu valana mariyu āyana sūcanala paṭla anādaraṇa cūpaṭaṁ valana, ī rōju mīku avamānakaramaina śikṣa vidhin̄cabaḍutundi!" Ani aṇṭū uṇḍē dr̥śyānni nīvu cūḍagaligitē enta bāguṇḍēdi
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌పై అబద్ధాన్ని కల్పించేవాడికంటే, లేదా తనపై ఎలాంటి వహీ అవతరించకపోయినప్పటికీ ‘నాపై వహీ అవతరించింది’ అని చెప్పే వానికంటే లేదా అల్లాహ్‌ అవతరింపజేసినటువంటిదే ‘నేను కూడా అవతరింపజేస్తాను’ అని అనేవాడి కంటే పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఈ దుర్మార్గులు మరణ యాతనలో ఉన్నప్పుడు, దైవదూతలు తమ చేతులు చాచి, “సరే! ఇక మీ ప్రాణాలు (బయటికి) తీయండి. మీరు అల్లాహ్‌కు అబద్ధాలను ఆపాదించినందుకూ, అల్లాహ్‌ ఆయతుల పట్ల గర్వాతిశయంతో విర్రవీగినందుకుగాను ఈ రోజు మీకు పరాభవంతో కూడిన శిక్ష విధించబడుతుంది” అని చెబుతుండగా (ఆ దృశ్యాన్ని) నీవు చూడగలిగితే ఎంత బావుండు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek