×

ఏమీ? ఆయన (అల్లాహ్), ప్రతి వ్యక్తి అర్జించే దానిని కనిపెట్టుకొని ఉండేవాడు (మరియు లాభనష్టాలు కలుగజేయలేని 13:33 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:33) ayat 33 in Telugu

13:33 Surah Ar-Ra‘d ayat 33 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 33 - الرَّعد - Page - Juz 13

﴿أَفَمَنۡ هُوَ قَآئِمٌ عَلَىٰ كُلِّ نَفۡسِۭ بِمَا كَسَبَتۡۗ وَجَعَلُواْ لِلَّهِ شُرَكَآءَ قُلۡ سَمُّوهُمۡۚ أَمۡ تُنَبِّـُٔونَهُۥ بِمَا لَا يَعۡلَمُ فِي ٱلۡأَرۡضِ أَم بِظَٰهِرٖ مِّنَ ٱلۡقَوۡلِۗ بَلۡ زُيِّنَ لِلَّذِينَ كَفَرُواْ مَكۡرُهُمۡ وَصُدُّواْ عَنِ ٱلسَّبِيلِۗ وَمَن يُضۡلِلِ ٱللَّهُ فَمَا لَهُۥ مِنۡ هَادٖ ﴾
[الرَّعد: 33]

ఏమీ? ఆయన (అల్లాహ్), ప్రతి వ్యక్తి అర్జించే దానిని కనిపెట్టుకొని ఉండేవాడు (మరియు లాభనష్టాలు కలుగజేయలేని మీ బూటకపు దైవాలు సరిసమానులా)? అయినా వారు అల్లాహ్ కు భాగస్వాములు (సాటి) కల్పిస్తారు. వారితో ఇలా అను: "(నిజంగానే వారు అల్లాహ్ స్వయంగా నియమించుకున్న భాగస్వాములే అయితే) వారి పేర్లను తెలుపండి! లేక భూమిలో ఉన్నట్లు ఆయనకు తెలియని విషయాన్ని మీరు ఆయనకు తెలుపుతున్నారా? లేక మీరు ఇట్లే నోటికి వచ్చినట్లు వాగుతున్నారా? వాస్తవానికి, సత్యాన్ని తిరస్కరించిన వారికి, వారి కుట్ర ఆకర్షణీయంగా చేయబడుతోంది. మరియు వారు ఋజుమార్గం నుండి నిరోధించచబడ్డారు. మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదలిన వానికి సన్మార్గం చూపేవాడు ఎవ్వడూ ఉండడు

❮ Previous Next ❯

ترجمة: أفمن هو قائم على كل نفس بما كسبت وجعلوا لله شركاء قل, باللغة التيلجو

﴿أفمن هو قائم على كل نفس بما كسبت وجعلوا لله شركاء قل﴾ [الرَّعد: 33]

Abdul Raheem Mohammad Moulana
emi? Ayana (allah), prati vyakti arjince danini kanipettukoni undevadu (mariyu labhanastalu kalugajeyaleni mi butakapu daivalu sarisamanula)? Ayina varu allah ku bhagasvamulu (sati) kalpistaru. Varito ila anu: "(Nijangane varu allah svayanga niyamincukunna bhagasvamule ayite) vari perlanu telupandi! Leka bhumilo unnatlu ayanaku teliyani visayanni miru ayanaku teluputunnara? Leka miru itle notiki vaccinatlu vagutunnara? Vastavaniki, satyanni tiraskarincina variki, vari kutra akarsaniyanga ceyabadutondi. Mariyu varu rjumargam nundi nirodhincacabaddaru. Mariyu allah margabhrastatvanlo vadalina vaniki sanmargam cupevadu evvadu undadu
Abdul Raheem Mohammad Moulana
ēmī? Āyana (allāh), prati vyakti arjin̄cē dānini kanipeṭṭukoni uṇḍēvāḍu (mariyu lābhanaṣṭālu kalugajēyalēni mī būṭakapu daivālu sarisamānulā)? Ayinā vāru allāh ku bhāgasvāmulu (sāṭi) kalpistāru. Vāritō ilā anu: "(Nijaṅgānē vāru allāh svayaṅgā niyamin̄cukunna bhāgasvāmulē ayitē) vāri pērlanu telupaṇḍi! Lēka bhūmilō unnaṭlu āyanaku teliyani viṣayānni mīru āyanaku teluputunnārā? Lēka mīru iṭlē nōṭiki vaccinaṭlu vāgutunnārā? Vāstavāniki, satyānni tiraskarin̄cina vāriki, vāri kuṭra ākarṣaṇīyaṅgā cēyabaḍutōndi. Mariyu vāru r̥jumārgaṁ nuṇḍi nirōdhin̄cacabaḍḍāru. Mariyu allāh mārgabhraṣṭatvanlō vadalina vāniki sanmārgaṁ cūpēvāḍu evvaḍū uṇḍaḍu
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, ఒక్కొక్క ప్రాణి చేసే కర్మలను పర్యవేక్షిస్తున్నటువంటి అల్లాహ్‌కా వీళ్లు సహవర్తుల్ని కల్పించేది? వారిని అడుగు: “కాస్త వారి పేర్లయినా చెప్పండి! ఏమిటీ, భూమిలో అల్లాహ్‌కే తెలియని విషయాలు మీరు ఆయనకు తెలియపరుస్తున్నారా? లేక పై పై మాటలు చెబుతున్నారా? అసలు విషయం ఏమిటంటే తిరస్కార వైఖరిపై మొండికేసిన వారికి, వారి కుతంత్రాలు అందంగా (కానవచ్చేలా) చేయబడ్డాయి. వారు సన్మార్గం నుంచి ఆపివేయబడ్డారు. అల్లాహ్‌ అపమార్గానికి లోనుచేసినవారిని ఎవరూ సన్మార్గానికి తేలేరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek