وَالْمُرْسَلَاتِ عُرْفًا (1) ఒకదాని తరువాత ఒకటి, వరుసగా పంపబడే వాయువుల సాక్షిగా |
فَالْعَاصِفَاتِ عَصْفًا (2) మరియు తీవ్రమైన వేగతో వీచే వాయువుల సాక్షిగా |
وَالنَّاشِرَاتِ نَشْرًا (3) మరియు మేఘాలను దూరదూరంగా వ్యాపింపజేసే వాయువుల సాక్షిగా |
فَالْفَارِقَاتِ فَرْقًا (4) మరియు మంచి చెడులను విశదపరచే (దైవదూతల) సాక్షిగా |
فَالْمُلْقِيَاتِ ذِكْرًا (5) సందేశాలను ప్రవక్తల వద్దకు తెచ్చే (దైవదూత) సాక్షిగా |
عُذْرًا أَوْ نُذْرًا (6) సాకుగా లేక హెచ్చరికగా |
إِنَّمَا تُوعَدُونَ لَوَاقِعٌ (7) నిశ్చయంగా, మీకు వాగ్దానం చేయబడినది, జరగవలసి ఉంది |
فَإِذَا النُّجُومُ طُمِسَتْ (8) అప్పుడు ఎప్పడైతే నక్షత్రాలు కాంతి హీనమై పోతాయో |
وَإِذَا السَّمَاءُ فُرِجَتْ (9) మరియు ఆకాశం చీలిపోతుందో |
وَإِذَا الْجِبَالُ نُسِفَتْ (10) మరియు పర్వతాలు పొడిగా మారి, చెల్లాచెదురుగా చేయబడతాయో |
وَإِذَا الرُّسُلُ أُقِّتَتْ (11) మరియు ప్రవక్తలు తమ నిర్ణీత సమయంలో సమావేశపరచబడతారో |
لِأَيِّ يَوْمٍ أُجِّلَتْ (12) ఏ దినానికి గాను, (ఇవన్నీ) వాయిదా వేయబడ్డాయి |
لِيَوْمِ الْفَصْلِ (13) ఆ తీర్పుదినం కొరకా |
وَمَا أَدْرَاكَ مَا يَوْمُ الْفَصْلِ (14) మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా అర్థం కాగలదు |
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ (15) ఆ రోజు (పునరుత్థాన దినాన్ని) తిరస్కరించే వారికి వినాశమంది |
أَلَمْ نُهْلِكِ الْأَوَّلِينَ (16) ఏమీ? మేము పూర్వీకులను నాశనం చేయలేదా |
ثُمَّ نُتْبِعُهُمُ الْآخِرِينَ (17) తరువాత రాబోయే వారిని కూడా, మేము వారి వెనక పంపుతాము |
كَذَٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِينَ (18) ఈ విధంగా మేము నేరస్థుల పట్ల వ్యవహరిస్తాము |
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ (19) ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది |
أَلَمْ نَخْلُقكُّم مِّن مَّاءٍ مَّهِينٍ (20) ఏమీ? మేము మిమ్మల్ని తుచ్ఛమైన నీటితో (వీర్యబిందువుతో) సృష్టించలేదా |
فَجَعَلْنَاهُ فِي قَرَارٍ مَّكِينٍ (21) తరువాత మేము దానిని ఒక భద్రమైన స్థానంలో ఉంచాము |
إِلَىٰ قَدَرٍ مَّعْلُومٍ (22) ఒక నిర్ణీత కాలం వరకు |
فَقَدَرْنَا فَنِعْمَ الْقَادِرُونَ (23) ఈ విధంగా మేము నిర్ణయించాము, ఎందుకంటే మేమే ఉత్తమమైన నిర్ణయాలు తీసుకునే వారము |
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ (24) ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది |
أَلَمْ نَجْعَلِ الْأَرْضَ كِفَاتًا (25) ఏమీ? మేము భూమిని ఒక సమీకరించే స్థానంగా చేయలేదా |
أَحْيَاءً وَأَمْوَاتًا (26) జీవులకూ మరియు మృతులకూను |
وَجَعَلْنَا فِيهَا رَوَاسِيَ شَامِخَاتٍ وَأَسْقَيْنَاكُم مَّاءً فُرَاتًا (27) మరియు దానిలో ఎత్తైన పర్వతాలను స్థిరంగా నిలుపలేదా? మరియు మీకు త్రాగటానికి మంచి నీటిని ప్రసాదించలేదా |
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ (28) ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది |
انطَلِقُوا إِلَىٰ مَا كُنتُم بِهِ تُكَذِّبُونَ (29) (సత్యతిరస్కారులతో ఇలా అనబడుతుంది): "మీరు తిరస్కరిస్తూ వచ్చిన దాని వైపునకు పొండి |
انطَلِقُوا إِلَىٰ ظِلٍّ ذِي ثَلَاثِ شُعَبٍ (30) (దాని పొగ) మూడు శాఖలుగా చీలిపోయే నీడ వైపునకు పొండి |
لَّا ظَلِيلٍ وَلَا يُغْنِي مِنَ اللَّهَبِ (31) కాని అది ఏ విధమైన (చల్ల) నీడనూ ఇవ్వదూ మరియు (నరక) జ్వాలల నుండి కూడా కాపాడదు |
إِنَّهَا تَرْمِي بِشَرَرٍ كَالْقَصْرِ (32) వాస్తవానికి అది పెద్ద పెద్ద మొద్దు వంటి అగ్నికణాలను విసురుతుంది |
كَأَنَّهُ جِمَالَتٌ صُفْرٌ (33) వాస్తవానికి ఆ అగ్నికణాలు పసుపు పచ్చని ఒంటెల వలే కనిపిస్తాయి |
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ (34) ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది |
هَٰذَا يَوْمُ لَا يَنطِقُونَ (35) ఆ దినాన వారు మాట్లాడలేరు |
وَلَا يُؤْذَنُ لَهُمْ فَيَعْتَذِرُونَ (36) మరియు వారికి సాకులు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వబడదు |
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ (37) ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది |
هَٰذَا يَوْمُ الْفَصْلِ ۖ جَمَعْنَاكُمْ وَالْأَوَّلِينَ (38) అది తీర్పుదినమై ఉంటుంది! మేము మిమ్మల్ని మరియు మీ పూర్వీకులను సమావేశపరచి ఉంటాము |
فَإِن كَانَ لَكُمْ كَيْدٌ فَكِيدُونِ (39) కావున మీ వద్ద ఏదైనా పన్నాగముంటే దానిని పన్నండి |
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ (40) ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది |
إِنَّ الْمُتَّقِينَ فِي ظِلَالٍ وَعُيُونٍ (41) నిశ్చయంగా భయభక్తులు గలవారు (ఆ రోజు చల్లని) నీడలలో చెలమల దగ్గర ఉంటారు |
وَفَوَاكِهَ مِمَّا يَشْتَهُونَ (42) మరియు వారికి వారు కోరే ఫలాలు లభిస్తాయి |
كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا كُنتُمْ تَعْمَلُونَ (43) (వారితో ఇలా అనబడుతుంది): "మీరు చేస్తూ ఉండిన కర్మలను ఫలితంగా హాయిగా తినండి, త్రాగండి |
إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ (44) నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమే ఇస్తాము |
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ (45) ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది |
كُلُوا وَتَمَتَّعُوا قَلِيلًا إِنَّكُم مُّجْرِمُونَ (46) (ఓ సత్యతిరస్కారులారా!) మీరు కొంతకాలం తినండి, సుఖాలు అనుభవించండి. నిశ్చయంగా, మీరు నేరస్థులు |
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ (47) ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది |
وَإِذَا قِيلَ لَهُمُ ارْكَعُوا لَا يَرْكَعُونَ (48) మరియు వారితో: "(అల్లాహ్ ముందు) వంగండి (రుకూఉ చేయండి)." అని అన్నప్పుడు, వారు వంగలేదు |
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ (49) ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది |
فَبِأَيِّ حَدِيثٍ بَعْدَهُ يُؤْمِنُونَ (50) దీని (ఈ ఖుర్ఆన్) తరువాత ఇక వారు మరెలాంటి సందేశాన్నివిశ్వసిస్తారు |