وَاللَّيْلِ إِذَا يَغْشَىٰ (1) క్రమ్ముకునే రాత్రి సాక్షిగా |
وَالنَّهَارِ إِذَا تَجَلَّىٰ (2) ప్రకాశించే పగటి సాక్షిగా |
وَمَا خَلَقَ الذَّكَرَ وَالْأُنثَىٰ (3) మరియు, మగ మరియు ఆడ (జాతులను) సృష్టించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా |
إِنَّ سَعْيَكُمْ لَشَتَّىٰ (4) వాస్తవానికి, మీ ప్రయత్నాలు నానా విధాలుగా ఉన్నాయి |
فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ (5) కాని ఎవడైతే (దానధర్మాలు) చేస్తూ దైవభీతి కలిగి ఉంటాడో |
وَصَدَّقَ بِالْحُسْنَىٰ (6) మరియు మంచిని నమ్ముతాడో |
فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ (7) అతనికి మేము మేలు కొరకు దారిని సులభం చేస్తాము |
وَأَمَّا مَن بَخِلَ وَاسْتَغْنَىٰ (8) కాని ఎవడైతే పిసినారితనం చేస్తూ, నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తాడో |
وَكَذَّبَ بِالْحُسْنَىٰ (9) మరియు మంచిని అబద్ధమని తిరస్కరిస్తాడో |
فَسَنُيَسِّرُهُ لِلْعُسْرَىٰ (10) అతనికి మేము చెడు కొరకు దారిని సులభం చేస్తాము |
وَمَا يُغْنِي عَنْهُ مَالُهُ إِذَا تَرَدَّىٰ (11) మరియు అతడు నశించి పోయినప్పుడు, అతని ధనం అతనికి ఎలా ఉపయోగపడుతుంది |
إِنَّ عَلَيْنَا لَلْهُدَىٰ (12) నిశ్చయంగా, సన్మార్గం చూపడం మా పని |
وَإِنَّ لَنَا لَلْآخِرَةَ وَالْأُولَىٰ (13) మరియు నిశ్చయంగా, ఇహపరలోకాల (ఆధిపత్యం) మాకే చెందినది |
فَأَنذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ (14) కాబట్టి నేను మిమ్మల్ని ప్రజ్వలించే నరకాగ్నిని గురించి హెచ్చరించాను |
لَا يَصْلَاهَا إِلَّا الْأَشْقَى (15) పరమ దౌర్భాగ్యుడు తప్ప, మరెవ్వడూ అందులో కాలడు |
الَّذِي كَذَّبَ وَتَوَلَّىٰ (16) ఎవడైతే (సత్యాన్ని) తిరస్కరించి (దాని నుండి) విముఖుడవుతాడో |
وَسَيُجَنَّبُهَا الْأَتْقَى (17) కాని దైవభీతి గలవాడు దాని నుండి (ఆ నరకాగ్ని నుండి) దూరంగా ఉంచబడతాడు |
الَّذِي يُؤْتِي مَالَهُ يَتَزَكَّىٰ (18) అతడే! ఎవడైతే, పవిత్రుడవటానికి తన ధనం నుండి (ఇతరులకు) ఇస్తాడో |
وَمَا لِأَحَدٍ عِندَهُ مِن نِّعْمَةٍ تُجْزَىٰ (19) కాని అది, వారు అతనికి చేసిన ఏ ఉపకారానికి బదులుగా గాక |
إِلَّا ابْتِغَاءَ وَجْهِ رَبِّهِ الْأَعْلَىٰ (20) కేవలం మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అయితే |
وَلَسَوْفَ يَرْضَىٰ (21) మరియు అలాంటి వాడే తప్పక సంతోషిస్తాడు |