إِذَا الشَّمْسُ كُوِّرَتْ (1) సూర్యుడు (అంధకారంలో) చుట్టి పోయబడి కాంతిహీనుడైనప్పుడు |
وَإِذَا النُّجُومُ انكَدَرَتْ (2) మరియు నక్షత్రాలు (కాంతిని కోల్పోయి) రాలిపోవునప్పుడు |
وَإِذَا الْجِبَالُ سُيِّرَتْ (3) మరియు పర్వతాలు కదిలించబడినప్పుడు |
وَإِذَا الْعِشَارُ عُطِّلَتْ (4) మరియు నిండు సూడి ఒంటెలు, నిరపేక్షంగా వదిలివేయబడినప్పుడు |
وَإِذَا الْوُحُوشُ حُشِرَتْ (5) మరియు క్రూరమృగాలన్నీ ఒకచేట సమకూర్చబడినప్పుడు |
وَإِذَا الْبِحَارُ سُجِّرَتْ (6) మరియు సముద్రాలు ఉప్పొంగిపోయి నప్పుడు |
وَإِذَا النُّفُوسُ زُوِّجَتْ (7) మరియు ఆత్మలు (శరీరాలతో) తిరిగి కలుపబడి నప్పుడు |
وَإِذَا الْمَوْءُودَةُ سُئِلَتْ (8) మరియు సజీవంగా పాతి పెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు |
بِأَيِّ ذَنبٍ قُتِلَتْ (9) ఏ అపరాధానికి తాను హత్య చేయబడిందని |
وَإِذَا الصُّحُفُ نُشِرَتْ (10) మరియు కర్మపత్రాలు తెరువబడినప్పుడు |
وَإِذَا السَّمَاءُ كُشِطَتْ (11) మరియు ఆకాశం ఒలిచి వేయబడినప్పుడు |
وَإِذَا الْجَحِيمُ سُعِّرَتْ (12) మరియు నరకాగ్ని మండించబడినప్పుడు |
وَإِذَا الْجَنَّةُ أُزْلِفَتْ (13) మరియు స్వర్గం దగ్గరకు తీసుకురాబడినప్పుడు |
عَلِمَتْ نَفْسٌ مَّا أَحْضَرَتْ (14) ప్రతి ఆత్మ తాను చేసి తెచ్చిన కర్మలను తెలుసుకుంటుంది |
فَلَا أُقْسِمُ بِالْخُنَّسِ (15) అలా కాదు! నేను తొలగిపోయే నక్షత్రాల సాక్షిగా చెబుతున్నాను |
الْجَوَارِ الْكُنَّسِ (16) (ఏవైతే) వేగంగా తిరుగుతూ కనుమరుగవుతున్నాయో |
وَاللَّيْلِ إِذَا عَسْعَسَ (17) మరియు గడచి పోయే రాత్రి సాక్షిగా |
وَالصُّبْحِ إِذَا تَنَفَّسَ (18) మరియు ప్రకాశించే ఉదయం సాక్షిగా |
إِنَّهُ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ (19) నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన వాక్కు |
ذِي قُوَّةٍ عِندَ ذِي الْعَرْشِ مَكِينٍ (20) అతను (జిబ్రీల్) మహా బలశాలి, సింహాసన (అర్ష్) అధిపతి సన్నిధిలో ఉన్నత స్థానం గలవాడు |
مُّطَاعٍ ثَمَّ أَمِينٍ (21) అతని ఆజ్ఞలు పాటింపబడతాయి మరియు (అతను) విశ్వసనీయుడు |
وَمَا صَاحِبُكُم بِمَجْنُونٍ (22) మరియు (ఓ ప్రజలారా!) మీ సహచరుడు పిచ్చివాడు కాడు |
وَلَقَدْ رَآهُ بِالْأُفُقِ الْمُبِينِ (23) మరియు వాస్తవంగా, అతను ఆ సందేశహరుణ్ణి (జిబ్రీల్ ను) ప్రకాశవంతమైన దిఙ్మండలంలో చూశాడు |
وَمَا هُوَ عَلَى الْغَيْبِ بِضَنِينٍ (24) మరియు అతను (ముహమ్మద్) అగోచర జ్ఞానాన్ని ప్రజల నుండి దాచేవాడు కాడు |
وَمَا هُوَ بِقَوْلِ شَيْطَانٍ رَّجِيمٍ (25) మరియు ఇది (ఈ ఖుర్ఆన్) శపించ (బహిష్కరించ) బడిన షైతాన్ వాక్కు కాదు |
فَأَيْنَ تَذْهَبُونَ (26) మరి మీరు ఎటు పోతున్నారు |
إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَالَمِينَ (27) ఇది (ఈ ఖుర్ఆన్) సర్వలోకాలకు ఒక హితోపదేశం |
لِمَن شَاءَ مِنكُمْ أَن يَسْتَقِيمَ (28) మీలో, ఋజుమార్గంలో నడవ దలచుకున్న ప్రతివాని కొరకు |
وَمَا تَشَاءُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ (29) మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు |