إِذَا السَّمَاءُ انفَطَرَتْ (1) ఆకాశం చీల్చబడినప్పుడు |
وَإِذَا الْكَوَاكِبُ انتَثَرَتْ (2) మరియు నక్షత్రాలు చెదిరి పోయినప్పుడు |
وَإِذَا الْبِحَارُ فُجِّرَتْ (3) మరియు సముద్రాలు పొంగి పొరలి పోయినప్పుడు |
وَإِذَا الْقُبُورُ بُعْثِرَتْ (4) మరియు సమాధులు పెళ్ళగింప (తెరువ) బడినప్పుడు |
عَلِمَتْ نَفْسٌ مَّا قَدَّمَتْ وَأَخَّرَتْ (5) ప్రతి వ్యక్తికి తాను చేసి పంపుకున్నది మరియు వెనుక వదలి పెట్టింది అంతా తెలిసి పోతుంది |
يَا أَيُّهَا الْإِنسَانُ مَا غَرَّكَ بِرَبِّكَ الْكَرِيمِ (6) ఓ మానవుడా! పరమదాత అయిన నీ ప్రభువును గురించి, ఏ విషయం నిన్ను ఏమరుపాటుకు గురి చేసింది |
الَّذِي خَلَقَكَ فَسَوَّاكَ فَعَدَلَكَ (7) ఆయనే నిన్ను సృష్టించాడు, తరువాత ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు మరియు నిన్ను తగిన ప్రమాణంలో రూపొందించాడు |
فِي أَيِّ صُورَةٍ مَّا شَاءَ رَكَّبَكَ (8) తాను తలచిన ఆకారంలో నిన్ను మలిచాడు |
كَلَّا بَلْ تُكَذِّبُونَ بِالدِّينِ (9) అలా కాదు! వాస్తవానికి మీరు (పరలోక) తీర్పును అబద్ధమని తిరస్కరిస్తున్నారు |
وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ (10) మరియు, నిశ్చయంగా! మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండేవారు (దేవదూతలు) ఉన్నారు |
كِرَامًا كَاتِبِينَ (11) వారు, గౌరవనీయులైన లేఖకులు |
يَعْلَمُونَ مَا تَفْعَلُونَ (12) మీరు చేసేదంతా తెలుసుకునేవారు |
إِنَّ الْأَبْرَارَ لَفِي نَعِيمٍ (13) నిశ్చయంగా పుణ్యాత్ములు సుఖసంతోషాలలో తేలియాడుతూ ఉంటారు |
وَإِنَّ الْفُجَّارَ لَفِي جَحِيمٍ (14) మరియు నిశ్చయంగా, దుష్టులు భగభగ మండే నరకాగ్నిలో ఉంటారు |
يَصْلَوْنَهَا يَوْمَ الدِّينِ (15) తీర్పు దినమున వారు అందులో ప్రవేశిస్తారు |
وَمَا هُمْ عَنْهَا بِغَائِبِينَ (16) మరియు వారు దాని నుండి ఎంత మాత్రం తప్పించుకోలేరు |
وَمَا أَدْرَاكَ مَا يَوْمُ الدِّينِ (17) మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది |
ثُمَّ مَا أَدْرَاكَ مَا يَوْمُ الدِّينِ (18) అవును మరి! ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది |
يَوْمَ لَا تَمْلِكُ نَفْسٌ لِّنَفْسٍ شَيْئًا ۖ وَالْأَمْرُ يَوْمَئِذٍ لِّلَّهِ (19) ఆ దినమున ఏ మానవునికి కూడా ఇతరునికి ఎలాంటి సహాయం చేసే అధికారం ఉండదు. మరియు ఆ రోజు నిర్ణయాధికారం కేవలం అల్లాహ్ కే ఉంటుంది |